Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తరవాత వరస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీ లో అడుగు పెట్టినప్పటికీ.. చిరంజీవి గర్వించే విధంగా రోజురోజుకు ( Ram Charan to quit acting for three months to take care of pregnant wife )ఎంతో ఎత్తుకు ఎదుగుతున్నాడు. రామ్ చరణ్ నటించిన సినిమా ఆస్కార్ అవార్డు ని అందుకోవడం చిరంజీవి అది చూడటం నిజంగా అయన పడ్డ కష్టానికి.. భగవంతుడు ఈ ఆనందాన్ని కలిగించడమే కాకుండా.. చూసే అదృష్టాన్ని కలిగించాడని అనిపిస్తుంది. చిరంజీవికి ఏకైక వారసుడైన రామ్ చరణ్ కేవలం ప్రొఫెషనల్ గానే కాకుండా, పర్సనల్ గా కూడా చాలా బాగున్నాడు. రామ్ చరణ్ ఉపాసనల జంట చాలా అన్యోన్యమైన జంట.
వీళ్లిద్దరికి ఒకరిమీద ఒకరికి అవగాహన, అన్యోన్యత ఉన్న జంట. రామ్ చరణ్ ఉపాసన పెళ్లయిన 11 సంవత్సరాలు తరవాత తల్లితండ్రులు కాబోతున్నారు. ఇది నిజంగా మెగా కుటుంబానికి ఎంతో ఆనందకరమైన నిర్ణయం. రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు అనే శుభవార్త తెలిసిన దగ్గర నుంచి ఉపాసనను అస్సలు వదలడం లేదు. తనకు ఎక్కడికి వెళ్లినా.. ఉపాసనను ( Ram Charan to quit acting for three months to take care of pregnant wife ) కూడా తనతో తీసుకుని వెళ్లి.. ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. కడుపుతో ఉన్న తన భార్యకు తాను ఎంత దగ్గరగా ఉంటె.. వాళ్లకు అంత మంచిదని భావిస్తున్నాడు. సినిమాలతో, వ్యాపారాలతో ఎంతో బిజీగా ఉండే రామ్ చరణ్ కడుపుతో ఉన్న తన భార్య మీదా అంత శ్రద్ధ, టైం పెడతున్నాడంటే..
నిజంగా చాలా గొప్పతనం అని అనిపిస్తుంది. ఇందులో చిరంజీవి పెంపకం, ఆయన లక్షణాలు కనిపిస్తున్నాయి. చిరంజీవి ఎంత మెగా స్టార్ అయినా కూడా.. ఆయన కుటుంబ శ్రేయస్కరం కోసం ఎప్పుడు చాల జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఉంటారు తప్ప ఎలాంటి డేరింగ్ స్టెప్స్ తీసేసుకుని.. జాగ్రత్త లేని పెనులు చెయ్యరు. అలాగే రామ్ చరణ్ కి కుటుంబం పట్ల అంత బాధ్యత ఉందని అర్ధం అవుతుంది. ఈ క్రమంలో రామ్ చరణ్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. రామ్ చరణ్ ఉపాసన డెలివరీ అయ్యేవరకు ఇక సినిమా షూటింగ్స్ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఇదే నిజం అయితే ఇంకో 3 నెలలు పాటు రామ్ చరణ్ సినిమాలు షూటింగ్స్ ఉండవు. దీనితో రామ్ చరణ్ అభిమానులు బెంగ పెట్టుకున్నారు. రామ్ చరణ్ మాత్రం ఈ మూడు నెలలు కడుపులో ఉన్న తన బిడ్డని, మోస్తున్న ఉపాసనని జాగ్రత్తగా చూసుకోవాలని ఫిక్స్ అయ్యాడట. అయితే దీనికి చిరంజీవి ఏమంటాడో తెలీదు. ఎందుకంటే.. చిరంజీవి ఎంతో కష్టపడి సినిమాలు చేస్తూనే.. అంతమంది పిల్లలకి తండ్రి అయ్యాడు. ఆ రోజుల్లో పని వదులుకుంటే.. కుటుంబానికి చాల నష్టం. ఇప్పడు రామ్ చరణ్ కి అలాంటి పరిస్థితి లేదు కాబట్టి, పైగా అసలు కన్నా వడ్డీ ముద్దు కాబట్టి.. చిరంజీవి కూడా ఈ నిర్ణయానికి సమ్మతమే చెప్పచ్చు అని అనుకుంటున్నారు.