
Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మెగా కుటుంబం నుంచి వచ్చినప్పటికీ.. తనదైన శైలిలో కష్టపడుతూ.. మెగాస్టార్ చిరంజీవికి ఏకైక వారసుడిగా.. ప్రతిష్ట ఇంకా పెంచుకుంటూ మంచి స్థాయికి తీసుకు వెళ్తున్న రామ్ చరణ్ ( Ram Charan puts some conditions ) గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ స్థాయి ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగుతుంది. కాశ్మీర్లో g20 సదస్సు వేడుకలు మే 22 నుంచి మూడు రోజులు పాటు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి జి 20 సదస్సు వేడుకల్లో హాజరైన రామ్ చరణ్ అనేక ఇంటర్వ్యూలు ఇచ్చారు. అందులో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..
ఆర్ఆర్ సినిమా గురించి అడగ్గా ఆ సినిమా నా ఒక్కడిదీ కాదు అది ఒక టీం వర్క్ ఇండియన్ సినిమా అని అన్నాడు. ఇండియాలో నార్త్ సౌత్ సినిమాలనేవి లేవు కేవలం ఇండియన్ సినిమాలు మాత్రమే ఉన్నాయి అని అన్నాడు. అలాగే నాటు నాటు పాట గురించి మాట్లాడితే.. ఆ పాట నేను రాసింది, నేను కంపోజ్ చేసింది కాదు. దాని గురించి ( Ram Charan puts some conditions ) మాట్లాడే అదృష్టం నాకు కలిగేలా.. ఆ అవకాశం నాకు వచ్చింది. అందులో నటించే అవకాశం అదృష్టం కలిగింది అని చెబుతూ.. ఇదంతా మా టీం వర్క్ ఇండియన్ ఫిలిం టీం వర్క్ సక్సెస్ అని చెప్పాడు. అలాగే కాశ్మీర్లో ఈ వేడుకలు జరిపి చాలా మంచి పని చేశారని.. ఇక్కడ ఎంతో బాగుందని.. చూడ చక్కని ప్రదేశాలు ఉన్నాయని రామ్ చరణ్ కామెంట్ చేశారు.
అసలు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఇండియాను దాటి లొకేషన్ కోసం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని.. భారత దేశంలోనే అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయని.. కేరళ, కాశ్మీర్ వంటి ఆహ్లాదకరమైన లొకేషన్స్లో సినిమాలు తీసుకోవచ్చని రామ్ చరణ్ చెప్పాడు. ఇకమీదట నేనెప్పుడూ లొకేషన్ కోసం విదేశాలకు వెళ్లనని.. ఇండియాలో ( Ram Charan puts some conditions ) ఉన్న అందమైన ప్రదేశాలను సినిమాలు ద్వారా మన ప్రేక్షకులకు చూపిస్తానని రామ్ చరణ్ పేర్కొన్నాడు. అంతేకాకుండా హాలీవుడ్ లెవెల్ లో సినిమాలు తీసే దర్శకులకు నేను పెట్టే కండిషన్ ఇదేనని.. మన ఇండియాలో ఉన్న అందమైన ప్రదేశాల్ని లొకేషన్ గా తీసుకుని చిత్రీకరించి అభిమానులకు చూపించాలని..
మన సినిమా ద్వారా.. మన దేశంలో ఉన్న లొకేషన్స్ మనమే చూపించాలని కండిషన్ పెడతానని పేర్కొన్నారు. రామ్ చరణ్ మాట్లాడిన ఈ అద్భుతమైన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయితే లొకేషన్ కోసం విదేశాలకు వెళ్లాల్సిన పనిలేదని.. ఇండియాలోనే అందమైన లొకేషన్స్ మాత్రమే చూపించాలని రామ్ చరణ్ పెట్టే కండిషన్ మరి దర్శకులకు నచ్చుతుందా? అని నెటిజనులు అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో సినిమా అంటే ఎంత భారీ బడ్జెట్ తో, ఎన్ని దేశాలు చూపిస్తే.. అంత గొప్పగా ఫీల్ అవుతున్న పరిస్థితుల్లో రామ్ చరణ్ పెట్టిన కండిషన్ ఎంతవరకు దర్శకులు ఒప్పుకుంటారో చూడాలని నెటిజనులు డిస్కస్ చేసుకుంటున్నారు.