Ram Charan Comments About His Carrer: తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి ఒక్కగానొక్క కొడుకు రామ్ చరణ్ ప్రస్తుతం ఏ స్థాయిలో ఉన్నాడు మన అందరికీ తెలిసిన విషయమే. రామ్ చరణ్ మొదటి సినిమా చిరుతతో తెలుగు సినీ చిత్ర ప్రపంచంలోకి అడుగు పెట్టాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మొదటి సినిమా తో మంచి ప్రేక్షకుల మనసు కొల్లగొట్టారు. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ తనదైన రికార్డులు తిరగరాస్తూ ప్రస్తుతం పాన్ ఇండియాలో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా దూసుకు పోతున్నాడు. ఇటీవలే రామ్ చరణ్ నటించిన సినిమా ఏకంగా హాలీవుడ్ నే ఓ రేంజ్ లో ఊపు ఊపేసింది.
ఆ సినిమా ఏంటో మనందరికీ తెలుసు. రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్టాత్మకమైన చిత్రం ఆర్ఆర్ఆర్… ఈ చిత్రం ప్రస్తుతం ఆస్కార్ భరిలో దూసుకుపోతుంది. ఇటీవలే హలీవుడ్ క్రిటిక్స్ విభాగంలో ఏకంగా నాల్గవ అవార్డును కైవసం చేసుకుని సంచనలనాలకు తెరలేపింది రాజమౌళి నిర్మించినటువంటి ఆర్ఆర్ఆర్ సినిమా. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ భరిలో దూసుకుపోతుంది. ఇదే క్రమంలో ఆర్ఆర్ఆర్ టీం ఆస్కార్ అవార్డు కోసం ప్రమోషన్లో భాగంగా అమెరికాలో సందడి చేస్తుంది. ఆ ప్రమోషన్లో భాగంగా రామ్ చరణ్ హలీవుడ్ లో ఓ ఇంటర్వూలో పాల్గొన్నాడు.
ఆ ఇంటర్వూలో రామ్ చరణ్ (Ram Charan Comments About His Carrer) సంచలనమైన వాఖ్యలు చేసాడు. అదేంటంటే… రాజమౌళి ఆర్ఆర్ఆర్ కథ వినకముందు సినిమాలకు కొంత కాలం బ్రేక్ ఇచ్చి.. ఆ బ్రేక్ సమయంలో ఏవైనా కొత్త ఎలిమెంట్స్ నేర్చుకుందాం అని అనుకున్నానంటూ ఆ తర్వాత సరికొత్త ఫ్రష్ లుక్స్ తో మళ్ళీ సినీ ఇండస్ర్టీలోకి రీ ఎంట్రీ ఇద్దామనుకున్నానని తెలిపారు. కానీ రాజమౌళి ఎప్పుడైతే ఆర్ఆర్ఆర్ కథ చెప్పాడో.. ఆ సెకండ్ అన్నీ మర్చిపోయానని ఖచ్చితంగా సినిమా చేయాలని స్ర్టాంగ్ గా ఫిక్స్ అయ్యానని ఫీల్ అయ్యారు.
దానికి తగిన ఫలితం ఈ రోజు దక్కిందంటూ చాలా ఎమోషనల్ అయ్యాడు రామ్ చరణ్. ఇదే క్రమంలో.. రామ్ చరణ్ సినిమాలకు బ్రేక్ చెప్పాలనుకున్నాడా.? అంటూ మెగా హీరో అభిమానులు చాలా షాక్ కు గురవుతున్నారు.. కానీ ఆర్ఆర్ఆర్ లాంటి ఇంత పెద్ద విజయం వరించడం రామ్ చరణ్ కి మంచి కిక్ ఇచ్చిందటున్నారు ఆయన అభిమానులు. ఇదేకాక రామ్ చరణ్ మాట్లాడుతూ.. రాజమౌళి కాలేజ్ లో నేను ఒక స్టూడెంట్ అయినందుకు ఎంతో గర్విస్తున్నాను, నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఒక్కసారిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా అంతట వైరల్ గా మారాయి. దీంతో మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్ చేసినటువంటి వాక్యలకు ఉప్పొంగిపోతున్నారు. చూడాలి మరి రేపు మార్చి 12వ తారీకున విడుదలవనున్న ఫైనల్ ఆస్కార్ ఫలితాల్లో ఇండియా తరపున నిలిచిన ఆర్ఆర్ఆర్ పేరు ఉంటుందో లేదో తెలియనుంది.