Ram Charan : మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా సినిమా రంగంలో హీరోగా అడుగుపెట్టిన రామ్ చరణ్ చిరుత సినిమా నుంచి ఆర్ఆర్ఆర్ సినిమా వరకు ఎన్నో ఘన విజయాలను సాధించాడు. ఈరోజు రామ్ చరణ్ కు గ్లోబల్ స్థాయిలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. రామ్ చరణ్ సినీ కెరీర్లో ఎన్నో సక్సెస్ లు, ఎన్నో ( Ram Charan made sensational decisions ) డిజాస్టర్లు కూడా చూసుకోవచ్చాడు. సినిమా రంగంలో మాత్రమే కాకుండా వ్యాపార రంగంలో కూడా తనదంటూ ఒక పునాది వేసుకొని తనకు తానుగా ఎంతో చక్కగా ఎదుగుతూ వస్తున్న హీరో రామ్ చరణ్. నిజంగా ఏకైక పుత్రుడైనప్పటికీ చిరంజీవికి ఆ ఒక్క కొడుకే తన పేరుని ఎంతో బాగా నిలబెట్టే కొడుకుగా పుట్టడం ఆయన చేసుకున్న అదృష్టమనే అనుకోవాలి.
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ వరుస సినిమా ప్రాజెక్ట్స్ తో చాలా బిజీగా ఉన్నాడు. రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాపై భారీ ( Ram Charan made sensational decisions ) అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా అయిపోయిన తర్వాత ఉప్పెన సినిమా దర్శకుడు బుచ్చిబాబు సనా దర్శకత్వంలో మరో సినిమాని ఒప్పుకున్నాడు. ఆ సినిమాలో హీరోయిన్ కూడా రవీనా టండన్ కూతురు రషా ని తీసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. గేమ్ చేంజెర్ సినిమాపై మెగా అభిమానులకు మాత్రమే కాకుండా సినీ అభిమానులందరికీ కూడా మంచి అంచనాలే ఉన్నాయి.
అయితే ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ ఒప్పుకుంటున్న దర్శకులు సినిమాలో వాటి కథా తీరని అభిమానులు అందరూ ఒక్కసారి కనిపెడుతున్నారు. శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమా తర్వాత చేస్తున్న సినిమాలను చూస్తున్నారు. అలాగే కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో మరో సినిమాను ( Ram Charan made sensational decisions ) ఒప్పుకోబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఆ తర్వాత సుకుమార్ తర్వాత ప్రశాంత్ నీల్ ఇలా వరుసగా ప్రాజెక్టులతో రామ్ చరణ్ చాలా బిజీగా ఉన్నాడు. అయితే రామ్ చరణ్ తీసుకుంటున్న సినిమాలను బట్టి చూస్తే.. మరీ ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ అనేటివి లేకుండా కేవలం మెసేజ్ఎం టర్టైన్మెంట్ విధంగా ఉండే సినిమాలను చూజ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు అంట.
ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చుకున్న తర్వాత మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలనే చేయాలి తప్ప ఆ టైప్ ఆఫ్ కంటెంట్ తోనే ముందుకెళ్లాలి తప్ప ప్రేమ రొమాన్స్ డ్రామా ఇలాంటి వాటి మీద శ్రద్ధ పెట్టకూడదని తనకి అలాంటి కదలే కావాలని రామ్ చరణ్ గట్టి నిర్ణయం తీసుకున్నాడంట. తన దగ్గరకు వచ్చిన దర్శకులకు ఇదే చెప్తున్నాడట. అయితే కెరీర్ పరంగా రామ్ చరణ్ తీసుకున్న ఈ నిర్ణయం ఎంతవరకు రైట్ అని అభిమానుల్లో అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే.. మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలనేవి బాగుంటాయి కానీ.. ఒక పది సినిమాల్లో అదొకటి నచ్చుతుంది. కానీ ఒక హీరో మీద అన్ని మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలే వచ్చి.. ప్రేమ, రొమాన్స్ ఇలాంటివి లేకుండా సినిమా చూడడం అంటే కొన్ని రోజులకు.. తొందరగా రాంచరణ్ బోర్ కొడతాడేమో అని భయపడుతున్నారు. అయితే ఇక పోనీలే ఇక వేరే హీరోయిన్స్ తో రొమాన్స్ లు డ్రామాలు చేయకుండా ఉంటాడు. ఇది ఉపాసనకు మాత్రం భలే హ్యాపీగా ఉంటుంది అని.. నెటిజనులు సరదాగా కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ రామ్ చరణ్ తీసుకున్న నిర్ణయం రైటా, రాంగా అనేది కేవలం ఫ్యూచర్ మాత్రమే చెప్తుంది.