Home Cinema Ram Charan : నాగబాబుని బూతులు తిట్టిన రామ్ చరణ్.. దానికి చిరంజీవి..

Ram Charan : నాగబాబుని బూతులు తిట్టిన రామ్ చరణ్.. దానికి చిరంజీవి..

ram-charan-insulted-naga-babu-and-chiranjeevi-scrolled-on-his-son

Ram Charan : మెగాస్టార్ చిరంజీవి కృషి, పట్టుదల, క్రమశిక్షణ గురించి సినీ రంగానికి.. తెలుగు సినీ అభిమానులకి అందరికీ తెలిసిందే. ఒక సాధారణ కుటుంబం నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక్కడిగా అడుగుపెట్టి.. ఈరోజు ఇంతటి గొప్ప స్థాయికి చేరుకున్న ఆయన గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఇక ఆయన ( Ram Charan and Naga Babu ) ఏకైక వారసుడు రామ్ చరణ్ కూడా సినిమా రంగంలో అడుగుపెట్టి.. చిరంజీవి పేరు నిలబెట్టేలాగా మంచి స్థానంలోకి వెళ్లి.. ఈరోజు గ్లోబల్ స్టార్ గా పేరు పొంది.. తండ్రికి తగ్గ తనయుడు అనిపించేలా ఆయనకి సంతృప్తిని ఇవ్వడం జరిగింది. అయితే ఎంత పెద్ద వాళ్ళయినా వాళ్ళ చిన్నప్పుడు చిన్నవాళ్లే. ఆ చిన్నతనంలో తల్లిదండ్రులు ఏం నేర్పిస్తే అదే పిల్లలకు వస్తుంది.

ram-charan-insulted-naga-babu-and-chiranjeevi-scrolled-on-his-son

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అనే కార్యక్రమంలో ఎప్పుడో పాల్గొనినప్పుడు.. ఆయన చెప్పిన కొన్ని మాటలు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. రామ్ చరణ్ తన తండ్రి గురించి, ఆయన పెంపకం గురించి చెప్పిన క్రమంలో.. చిన్నప్పుడు తాను ఒక తప్పు చేశానని, దానివల్ల ( Ram Charan and Naga Babu ) నాన్నతో చాలా గట్టిగా దెబ్బలు తిన్నానని చెప్పుకొచ్చాడు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. రామ్ చరణ్ ఒకరోజు ఇంటి బయట ఆడుకుంటూ ఉండగా.. వాళ్ళు వాచ్మెన్ లు ఇద్దరు విపరీతంగా గొడవ చేసుకుంటూ.. ఒకరిని ఒకరు బూతులు తిట్టుకోవడం విన్నాడంట. అది మొట్టమొదటిసారిగా అలాంటి మాటలు విని.. అవి తిట్లని కూడా రామ్ చరణ్ కి తెలియదు అంట.

See also  Varun Tej : వరుణ్ తేజ్ పెళ్ళికి పవన్ కళ్యాణ్ ఇచ్చిన గిఫ్ట్ ఏమిటో తెలుసా?

ram-charan-insulted-naga-babu-and-chiranjeevi-scrolled-on-his-son

దానితో రామ్ చరణ్ అవి విని లోపలికి వచ్చేసరికి హాల్లో నాగబాబు కూర్చొని ఉన్నాడంట. బాబాయ్ ని చూసిన రామ్ చరణ్ బాబాయిని ఆ మాటలన్నీ అన్నాడంట. వెంటనే నాగబాబు షాక్ అయిపోయాడంట. రామ్ చరణ్ ఇలాంటి అసహ్యమైన మాటలు మాట్లాడుతున్నాడు ఏంటి అని.. రాంచరణ్ తీసుకొని వెళ్లి చిరంజీవి రూమ్ లోకి వెళ్ళాడు అంట. చిరంజీవికి వెళ్లి.. అన్నయ్య చూడండి వీడు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడో, ఎక్కడ ( Ram Charan and Naga Babu ) నేర్చుకుంటున్నాడో, ఎవరి దగ్గర నేర్చుకుంటున్నాడో అర్థం కావడం లేదని చెప్పాడంట. దాంతో చిరంజీవి రామ్ చరణ్ ని దగ్గరికి తీసుకుని.. అందర్నీ రూమ్ బయటకి వెళ్ళమని చెప్పాడంట. అలా అందరినీ బయటికి పంపించి రాంచరణ్ రూమ్ లో పెట్టి ఇలాంటి మాటలు నేర్చుకున్నా, మాట్లాడిన ఊరుకోనని..

See also  Vijay Antony : కూతురు మరణం తరవాత మనసును పిండేసే భయంకరమైనవి బయట పెట్టిన విజయ్ ఆంటోనీ..

ram-charan-insulted-naga-babu-and-chiranjeevi-scrolled-on-his-son

చిరంజీవి రామ్ చరణ్ కి వార్నింగ్ ఇవ్వడమే కాకుండా.. ఒకటి కొట్టాడంట. అంతే అప్పటినుంచి అలాంటి మాటలు విన్నా కూడా నోట్లోంచి రాకుండా.. ఎవరిని అనకుండా జాగ్రత్త పడ్డానని.. ఆ రకంగా నాన్నతో నేను దెబ్బలు తినాల్సి వచ్చిందని రామ్ చరణ్ చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. రామ్ చరణ్ ప్రస్తుతం సినిమా షూటింగ్లో బిజీలో ఉన్నాడు. రామ్ చరణ్ కు ఇటీవలే పుట్టిన కూతురికి సంబంధించిన అన్ని వేడుకలను పూర్తిచేసుకుని.. ఆమెకు క్లింకార అనే పేరు కూడా పెట్టి.. ఎంతో ఆనందంగా తన పర్సనల్ లైఫ్ ని లీడ్ చేస్తూ.. ఒకపక్క సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు రామ్ చరణ్. రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు..