Home Cinema Ram Charan : రాజమౌళి అల్లు అరవింద్ ప్రాజక్ట్ లో రాముడిగా రామ్ చరణ్.. మీరు...

Ram Charan : రాజమౌళి అల్లు అరవింద్ ప్రాజక్ట్ లో రాముడిగా రామ్ చరణ్.. మీరు ఊహించలేని సీతా రావణులు వెళ్లే..

ram-charan-in-ramayanam-movie-will-be-directed-by-rajamouli-in-allu-aravind-production

Ram Charan : పురాణ ఇతిహాసాల గురించి ఎన్నో సినిమాలు వచ్చాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో రామాయణం, మహాభారతం లో అనేక ఘట్టాల గురించి అనేక సినిమాలు వచ్చాయి. కాకపోతే ఎన్నిసార్లు వాటిపై సినిమాల వచ్చినా కూడా.. రామాయణ, మహాభారతాల్లో ఏ పాత్ర నటించాలన్న నటులకు మాత్రం ఆత్రం గానే ఉంటుంది. అది నిజంగా ( Ram Charan Ramayanam by Rajamouli ) ఒక అదృష్టమని భావిస్తారు. అలాంటి పాత్రకి వాళ్లనే ఎన్నుకోవడం నిజంగా వాళ్ల ట్యాలెంటు, ఆ భగవంతుని కృపకి పొంగిపోతారు. అలాంటి అవకాశం ఇప్పుడు మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి దక్కింది. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పటికీ.. కలెక్షన్స్ రూపంలో మాత్రం హిట్ అందుకుంటుంది.

ram-charan-in-ramayanam-movie-will-be-directed-by-rajamouli-in-allu-aravind-production

ప్రభాస్ ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేడుకలో కూడా.. చిరంజీవి గారు తనని చూసి రాముడుగా నటిస్తున్నావా నిజంగా అదృష్టం అది అందరికీ దక్కదు అని పొగడాలని చెప్పాడు. నిజమే మెగాస్టార్ చిరంజీవి చెప్పిన ఈ మాటల్లో ప్రతి అక్షరము సత్యమే. ఎంతో అదృష్టం ఉంటే తప్ప.. అలాంటి పాత్ర నటించే అవకాశం ( Ram Charan Ramayanam by Rajamouli ) అందరికీ రాదు. అయితే రాజమౌళికి మహాభారతం మీద సినిమా తీయాలని ఉందని ఎన్నోసార్లు చెప్పారు గానీ.. ఆ సినిమాని ఇప్పుడు తీయగలిగే శక్తి ఇంకా నాకు రాలేదని.. వచ్చినప్పుడు తప్పకుండా తీస్తానని ఆయన ఎన్నో సార్లు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు రామాయణం మీద ట్రెండు నడుస్తుంది. రామాయణం మీద వచ్చిన సినిమాలు సక్సెస్ ని కూడా అందుకుంటున్నాయి.

See also  Niharika: హీరోయిన్ గా రీ ఎంట్రి ఇద్దామనుకున్న నిహరికకు అడ్డుగా ఉంటున్నది ఆ ఇద్దరేనా.? కష్ట కాలంలో నిహరిక

ram-charan-in-ramayanam-movie-will-be-directed-by-rajamouli-in-allu-aravind-production

ఈ క్రమంలో ఎప్పటినుంచో అల్లు అరవింద్, మధు మంతెన కలిసి నిర్మాతలుగా నితీష్ తివారి దర్శకత్వంలో రామాయణం తీయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ ఆ ప్రాజెక్టు ముందుకు రావడం లేదు. ఇటీవల రణ్వీర్ కపూర్ రాముడిగా, అలియా భట్ సీతగా, కేజిఎఫ్ స్టార్ యష్ రావణాసురుడిగా ఈ సినిమాను ( Ram Charan Ramayanam by Rajamouli ) తీయబోతున్నారని ఎన్నో రూమర్స్ కూడా వచ్చాయి. అయితే ఆ ప్రాజెక్టు కూడా ముందుకు రాలేదు. ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అల్లు అరవింద్ ఇప్పుడు ఆ హిందీ హీరోలని, హిందీ డైరెక్టర్స్ ని వదిలేసి.. అదే ప్రాజెక్టుని రాజమౌళి దర్శకుడుగా, రామ్ చరణ్ హీరోగా సినిమా తీయాలని ఆలోచిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. నిర్మాతల్లో అల్లు అరవింద్ ఏదైనా ప్రాజెక్ట్ అనుకుంటే కచ్చితంగా అంత అద్భుతంగా తీయగల వ్యక్తిని అందరికీ తెలిసిందే.

See also  Pushpa 2 : పుష్ప రాజ్ చిటికిన వెలుపై గోరు హైలెట్ చేయడం వెనుక ఇంట్రస్టింగ్ స్టోరీ రివీల్.

ram-charan-in-ramayanam-movie-will-be-directed-by-rajamouli-in-allu-aravind-production

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ రాముడిగా నటించెట్టు.. ఇక రామ్ చరణ్ పక్కన సీతగా లేడీ పవర్ స్టార్ సాయి పల్లవిని ఎన్నుకున్నారు అంట. ఇక వీళ్ళిద్దరికీ రావణుడిగా విక్రమ్ అనుకుంటున్నారంట. ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గానీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వార్తలు తెగ హల్చల్ చేసి వైరల్ అవుతున్నాయి. నిజంగానే రాజమౌళి చేతిలో.. ఆయన సృష్టించిన కధల్ని ఎంతో అద్భుతంగా తీయగల గొప్ప దర్శకుడు.. ఆ రామాయణాన్ని సినిమాగా తీయాలనుకుంటే.. ఆయన ఎంత ప్రాణం పెట్టి తీస్తాడో.. అక్కడ దేవుళ్లను రాముడుని, సీతని ప్రాణాలతో మన ముందు నిలబెట్టి చూపిస్తాడో.. ఊహించుకుంటేనే తెలుగు ఆడియన్స్ కి ఎంతో ఆనందంగా ఉంది. ఎప్పుడెప్పుడా ఈ ప్రాజెక్టు నిజమని వింటామో అని మెగా అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.