Ram Charan : మెగాస్టార్ చిరంజీవి తనయుడు గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టాడు రామ్ చరణ్. ఇప్పుడు రామ్ చరణ్ కి ఎంత క్రేజ్ ఉందో మనందరికీ తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్.. ఆ సినిమా ( Ram Charan fans are angry ) తర్వాత గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే రామ్ చరణ్ గురించి ఇప్పుడు ఒక వార్తా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. రామ్ చరణ్ ఆ వ్యక్తిని నమ్మి నిండా మునిగిపోతున్నాడని, సరిగ్గా కేర్ తీసుకోకపోతే రామ్ చరణ్ కెరీర్ నాశనం అవుతుందని కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి విషయంలోను ఎంతో జాగ్రత్తలు తీసుకునే రామ్ చరణ్ ఆలోచనా విధానం గురించి అభిమానులందరికీ తెలిసిందే. రాంచరణ్ ఏ పని చేసినా ఒకటికి పది సార్లు ఆలోచిస్తాడు. ప్లాన్ ప్రకారమే ప్రతిదీ చేస్తాడు. తన సినిమాలను ( Ram Charan fans are angry ) ఎన్నుకునే విషయంలో కానీ, సినిమాలు చేసే విధానంలో గాని, అలాగే తన పర్సనల్ లైఫ్ లో కూడా ఎప్పుడు ఏ నిర్ణయాలు తీసుకోవాలి అనేది పక్కగా ప్లాన్ చేసుకునే చేస్తాడు. అలాంటిది ఇప్పుడు ఈ వ్యక్తిని నమ్మి నిండా మునిగిపోవడం ఖాయం అంటున్నారు మెగా అభిమానులు. ఇంతకీ ఎవరిని రాంచరణ్ అంతగా నమ్ముతున్నాడు? వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది తెలుసుకుందాం.
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమాకి శంకర్ దర్శకత్వం వహిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా అనగానే మెగా అభిమానులందరూ, రామ్ చరణ్ ( Ram Charan fans are angry ) అభిమానులు అందరూ ఆనందంతో పొంగిపోయారు .ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో పనుల గురించి వాళ్లు ఊహించుకుంటూనే వస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి ఇప్పుడు కొన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. శంకర్.. గేమ్ ఛేంజర్ సినిమాపై శ్రద్ధ పెట్టడం మానేసి, వేరే ఇతర సినిమాల మీద శ్రద్ధ పెడుతున్నాడని ఆరోపిస్తున్నారు.
గేమ్ చేంజ్ సినిమా మొదలై ఇంత కాలం అవుతున్నా కూడా ఇంతవరకు ఒక టీజర్ గాని , ట్రైలర్ గానీ, సాంగ్ గాని ఏమీ రిలీజ్ చేయలేదు. ఈ సినిమాని ఊహాగానులతో అంచనాలేయడమే తప్పితే.. ఆ సినిమాలో ఒక్క సీన్ కూడా ఇంతవరకు చూపించలేదు. ఇటీవల ఒక పాట గేమ్ ఛేంజర్ నుంచి లీక్ అయిపోయింది కూడా. మళ్లీ దీపావళికి ఆ పాటని రిలీజ్ చేస్తామని చెప్పారు. అయినా కూడా దీపావళి దగ్గరికి వచ్చేసింది.ఇప్పుడు చిత్ర బృందం వాళ్ళు ఆ పాటను రిలీజ్ చేయడం అవ్వదని, కొన్ని ఇష్యూస్ ఉన్నాయని అంటున్నారు. దీనితో రామ్ చరణ్ అభిమానులు మండిపడుతున్నారు. శంకర్ కి సినిమా చేయడం ఇంట్రెస్ట్ లేకపోతే ఆపేసి ఇంట్లో కూర్చోమంటున్నారు. అంతేగాని శ్రద్ద లేకుండా సినిమా తీయొద్దు అంటున్నారు. వాళ్ళు హీరో మంచి క్రేజ్ లో ఉన్నాడని.. ఈ టైంలో ప్రతి సినిమా కూడా చాలా విలువైందని.. అంత ప్రతిష్టాత్మకంగానే తీయాలని.. ఒకవేళ అది వీలు కాకపోతే ఇలాంటి దర్శకులు తప్పుకోవాలని అనేక మాటలు అంటున్నారు అభిమానులు. ఏదేమైనా వేచి చూస్తేనే దాని రిజల్ట్ ఏంటో తెలుస్తుంది మరి.