NTR – Ram Charan : తెలుగు సినిమా రంగం గర్వించతగ్గ గొప్ప వ్యక్తి, సినీ దిగ్గజం, తెలుగు ప్రేక్షకులకు అన్నగారు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు సీనియర్ నందమూరి తారక రామారావు గారి శతజయంతి నిన్న హైదరాబాదులో ( Ram Charan did with Senior NTR ) ఎంతో ఘనంగా జరిగింది. ఈ సతజయంతి వేడుకకి ఎందరో సెలబ్రిటీస్ విచ్చేశారు. నందమూరి తారక రామారావు గారితో అనుబంధం ఉన్నవాళ్లు ఎందరో వచ్చి.. వాళ్ళ అనుభవాలను చెప్పుకుంటూ సెంటిమెంట్ గా ఫీల్ అయ్యారు. కొందరు మహానుభావులు మన కళ్ళ ముందు ఉన్నా, లేకున్నా ఎప్పుడు ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా ఉండిపోతారు. అలాంటి వారిలో నందమూరి తారక రామారావు గారు ఒకరు.
సీనియర్ నందమూరి తారకరామారావు గారి శతజయంతి సందర్భంగా ఎందరో ప్రముఖులు విచ్చేయగా.. అందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan did with Senior NTR ) కూడా అక్కడికి వచ్చాడు. రామ్ చరణ్ సీనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ గారితో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేసే అదృష్టం తనకి కలిగిందని చెప్పారు. ఇది విన్న అక్కడి ప్రేక్షకులు హర్ష ధ్వనులు వినిపించారు. పురందేశ్వరి కొడుకు, రామ్ చరణ్ చిన్నప్పుడు నుంచి స్నేహితులంట. పురందేశ్వరి కొడుకుని కలవడానికి రామ్ చరణ్ ఎన్టీఆర్ గారి ఇంటికి ఉదయం 6 గంటల సమయంలో వెళ్ళాడంట. అక్కడ ఎన్టీఆర్ జిమ్ వర్కవుట్ పూర్తిచేసుకుని వచ్చి.. చికెన్ వేసుకొని టిఫిన్ తింటున్నారంట.
ఆ సమయంలో పురందేశ్వరి కొడుకుని కలవడానికి వెళ్ళిన రామ్ చరణ్ ని చూసి ఎన్టీఆర్ గారు.. రామ్ చరణ్ రమ్మని పిలిచారంట. కూర్చో టిఫిన్ తిను అని చెప్పారంట. అలా ఎన్టీఆర్ తో కలిసి రాంచరణ్ బ్రేక్ఫాస్ట్ చేశాడంట. ఈ విషయాన్ని రామ్ చరణ్ ఎంతో ఆనందంగా చెప్పారు. అయితే ఇది తెలిసిన నెటిజనులు బ్రేక్ ఫాస్ట్ అంటే ( Ram Charan did with Senior NTR ) ఇడ్లీ, పూరి, ఉప్మా, దోస ఇలాంటివి తినే మన అలవాట్లలో ఎన్టీఆర్ గారు డిఫరెంట్ గా పొద్దున బ్రేక్ ఫాస్ట్ తోనే చికెన్ తినడం అంటే నిజంగా ఆయన ఫుడ్ విషయంలో ఎంత ప్రాముఖ్యత ఇస్తారో అనేది అర్థమవుతుంది. అలాగే రామ్ చరణ్ కి కూడా బ్రేక్ ఫాస్ట్ లో చికెన్ పెట్టి ఉంటారా ఎన్టీఆర్ గారు అంటూ నిటిజన్లు ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారు.
అవును పెట్టే ఉంటారు ఏం తింటే అదే కదా రామ్ చరణ్ కి కూడా పెడతారు అని చెప్పుకుంటున్నారు. అయితే రోజు ఇంట్లో టిఫిన్ ఇడ్లీ, ఉప్మా, పూరి, దోస, మహా అయితే బ్రెడ్ ఆమ్లెట్ తినే రామ్ చరణ్ కి.. ఆరోజు ఎన్టీఆర్ గారు.. రామ్ చరణ్ తో చికెన్ తినిపించే పని చేయించారన్నమాట అని నవ్వుకుంటున్నారు. ఇంకా నందమూరి తారక రామారావు గారి శతజయంతి వేడుకకి రాజకీయ ప్రముఖులు, హర్యానా గవర్నర్, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో సహా అందరూ హాజరయ్యారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, బాలకృష్ణ, పురందేశ్వరి, భువనేశ్వరి, లోకేశ్వరి, వసుంధర, బ్రహ్మణి, దేవాన్ష్ మొదలగువారు ఈ వేడుకకు వచ్చారు. అలాగే సినీ నటులు వెంకటేష్, జయప్రద, జయసుధ, మురళీమోహన్, రామ్ చరణ్, బాబు మోహన్ ఇంకా అనేకమంది ప్రముఖులు విచ్చేసారు..