
Ram Charan – Upasana : జూన్ 20వ తారీఖున మంగళవారం నాడు తెల్లవారుజామున మెగా కుటుంబంలోకి మెగా ప్రిన్సెస్ వచ్చింది. రామ్ చరణ్, ఉపాసన పెళ్లి చేసుకుని పదేళ్ల తర్వాత ఉపాసన ప్రెగ్నెంట్ అవ్వడం అందరిలో ఆనందాన్ని నింపింది. ఆ ఆనందాన్ని అలాగే నిలుపుతూ ఈరోజు మహాలక్ష్మి లాంటి ( Ram Charan and Upasana ) ఆడబిడ్డ పుట్టి.. మెగా కుటుంబంలో ఆనందాన్ని నింపింది. ఉపాసన డెలివరీ రోజు జూబ్లీహిల్స్ అపోలో హైదరాబాద్ హాస్పిటల్ లోకి రాంచరణ్, ఉపాసన, చిరంజీవి గారి భార్య సురేఖ వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఆ తర్వాత ఉపాసనకి డెలివరీ అయింది. అని వార్త తెలిసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి మీడియాతో మాట్లాడటం జరిగింది.
ఆంజనేయ స్వామి రోజున.. మా కుటుంబం ఆయన్ని నమ్ముకున్నందుకు ఆయనే మాకు ఇలాంటి అదృష్టాన్ని కలిగించాలని చిరంజీవి చెప్పడం జరిగింది. మనవరాలు పుట్టినందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందని.. ఇన్నేళ్ల తర్వాత మా చేతుల్లోకి పండంటి బిడ్డని రామ్ చరణ్ ఉపాసన పెట్టినందుకు.. వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు అయినందుకు ఎంతో ఆనందంగా ఉందని చిరంజీవి చెప్పారు. అలాగే ఇప్పుడు ( Ram Charan and Upasana ) రామ్ చరణ్, ఉపాసన అపోలో ఆసుపత్రి నుంచి బయటికి రావడం రావడమే.. వాళ్లపై పూల వర్షం కురిపించారు. అభిమానులు మెగా ప్రిన్సెస్ బయటకు వస్తుండగా పూల వర్షంతో వెల్కం చెప్పారు మెగా అభిమానులు. రామ్ చరణ్ తన భార్య కడుపుతో ఉన్నంతకాలం ఎంత సామాన్యమైన భర్తల ఆమె వెనక ఆమెకు ఆమెను చూసుకున్నాడో..
అలాగే ఇప్పుడు కూతుర్ని కూడా చాలా బాధ్యత గల తండ్రిగా ఎంతో ఒదిగ్గా ఎత్తుకొని బయటికి వచ్చాడు. పబ్లిక్ లో అందరితో మాట్లాడాల్సిన సమయంలో కూడా.. పాపని పక్కన ఉన్న ఏ సర్వెంట్ కి కూడా ఇవ్వకుండా.. తన భార్య చేతిలో భద్రంగా పెడుతూ.. భార్యని మళ్లీ చేత్తో పట్టుకొని జాగ్రత్తగా ముందుకు నడిపించాడు. అక్కడే ( Ram Charan and Upasana ) కనిపిస్తుంది రామ్ చరణ్ లో ఎంత మంచి భర్త, ఎంత మంచి తండ్రి ఉన్నాడో అనిపిస్తుంది. అయితే మీడియా వాళ్ళు రామ్ చరణ్ ని మాట్లాడమనగా.. రామ్ చరణ్ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా మెగా అభిమానులు మా కోసం చేసిన పూజలు నేను జీవితంలో మర్చిపోలేని చెప్పాడు. ఇంతకంటే అభిమానుల నుంచి మాకు కావాల్సింది ఇంకేముంది అని అడిగాడు.
అలాగే శ్రేయోభిలాషులు, మిత్రులు, బంధువులు అందరూ కూడా ఎక్కడ ఎక్కడ నుంచో మాకు శుభాకాంక్షలు తెలుపుతూ.. మమ్మల్ని ఆశీర్వదించిన అభిమానులు ఆశీర్వచనాలు అన్నీ కూడా నా కూతురు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. ఎంత ఆనందంగా ఉన్నాడో, ఎంత భావోద్వేగం అవుతున్నాడో చెబుతూ.. నేను మాట్లాడలేకపోతున్నాను అని రామ్ చరణ్ చెప్తే అందరి కళ్ళంట ఆనందభాష్పాలు వచ్చాయి. నిజంగా రాంచరణ్ ఉపాసన కేవలం మూడు రోజుల్లో ఉపాసనను అంత చక్కగా బయటికి తీసుకుని వచ్చి.. బిడ్డతో చూపించి ఇంటికి తీసుకెళ్తున్న రాంచరణ్ చూస్తే.. భార్య పైన బిడ్డ పైన తనకున్న ప్రేమకు అందరూ హాట్సాఫ్ చెప్తున్నారు. వీళ్ళ కుటుంబం ఇలాగే ఆనందంగా పిల్లాపాపలతో సుఖంగా ఎంజాయ్ చేయాలని మెగా అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.