Home Cinema Oscar Award: ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ లో రామ్ చరణ్ ఉపాసనకు ఏమిచ్చాడో తెలుసా?

Oscar Award: ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ లో రామ్ చరణ్ ఉపాసనకు ఏమిచ్చాడో తెలుసా?

Ram Charan and Upasana in Oscar Award function: ఒక మనిషి తాను ఒక గోల్ పెట్టుకుని అక్కడికి రీచ్ అవ్వడానికి ఒక పరిధి ఉంటాది.అలాగే ఒక ఊరు, ఒక రాష్ట్రం, ఒక దేశం ఇలా ఏదైనా అనుకున్నది షాధించాలంటే దాన్ని బట్టి పరిధి పెరుగుతూ ఉంటాది. అలా ఒక దేశం ఎంతో కాలం నుంచి ఒక అవార్డు ని సొంతం చేసుకోవాలని అనుకుంటూ ఉంటె అది నిజం అయ్యేసమయంలో కలిగే ఆనందం అంతా, ఇంతా కాదు. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ వేదికగా.. ఆస్కార్ అవార్డ్స్ 2023 వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. హాలీవుడ్ కు చెందిన సినీ ప్రముఖులు, తారలతో పాటు, ఈ ఏడాది నామినేషన్లలో ఉన్న సినిమాల నటీనటులు, సాంకేతిక సిబ్బంది ఈ వేడుకకు హాజరు అయ్యారు. అందరి మనస్సులో అక్కడి వరకు రీచ్ అయినందుకు ఆనందం, వాళ్లకు అవార్డు వస్తాదా రాదా అనే టెంక్షన్ బాగా కనిపిస్తూ ఉంది.

See also  Ashu Reddy: సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టక ముందు అషు రెడ్డి అమెరికాలో అలాంటి పని చేసి డబ్బులు సంపాదించేదా.?

ram-charan-and-upasana-in-oscar-award-function

ఇక మన భారతదేశం నుంచి వెళ్లిన వారు, భారతీయ సంప్రదాయం కనిపించేలా దుస్తులు వేసుకుని కళకళలాడారు. ఈ వేడుకకు ఆర్ఆర్ఆర్ సినిమా టీమ్ లో దర్శకుడు రాజమౌళి లైట్ మెరున్ కలర్ శర్వాణీ వేసుకున్నారు. ఈ సినిమా హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు బ్లాక్ కలర్ ఔట్​ఫిట్​లో వచ్చి అట్రాక్షన్ గా నిలిచారు. నాటు నాటు పాట పాడిన సింగర్స్ కాల భైరవ బ్లాక్ శర్వాణీలో కనిపించగా.. రాహుల్ సిప్లిగంజ్ యాష్ కలర్ శర్వాణీలో, నాటు నాటు సాంగ్ కొరియోగ్రఫీ ప్రేమ్ రక్షిత్ బ్లాక్ కలర్ శర్వాణీలో వేడుకకు వచ్చారు. రెడ్ కార్పట్ పై భారతీయ సినిమా టీం ని చూసి ఎందరో సినీ అభిమానులు కళ్లంట ఆనంద బాష్పాలు తెచ్చుకున్నారు. సినీ అభిమానులకే ( Ram Charan and Upasana in Oscar Award funtion ) అంత ఆనందాన్ని ఇచ్చిందంటే, ఇక అక్కడి వరకు రీచ్ అయిన సినిమా టీమ్ కి ఇంకెత ఆనందంగా ఉంటాదో ఊహించండి.

See also  Sridevi: అతన్ని చూస్తుంటేనే అసహ్యం వేస్తుందంటూ ఆయనతో నేను నటించడం ఏంటంటూ ఆ స్టార్ కమీడియన్ ను అవమానించిన శ్రీదేవి.

ram-charan-and-upasana-in-oscar-award-function

ఆస్కార్ వేడుకకు హాజరైన ఆర్ఆర్ఆర్ సినిమా టీమ్ ముఖంలో ఒక రకమైన ఆనందం, ఒకరకమైన టెంక్షన్ తో అవార్డు ఎనౌన్స్ చేసేవరకు ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి, రామ్ చరణ్ అయితే వాళ్ళ అనుబంధాన్ని కనబడేలా ఒకరితో ఒకరు ఆనందంగా ఫొటోస్, సెల్ఫీలు తీసుకున్నారు. ఆస్కార్ అవార్డ్స్ ( Oscar Award )వేడుకకు రామ్ చరణ్ ఉపాసనతో కలిసి వచ్చారు. ఉపాసన ఇప్పుడు ఆరవ నెల గర్భవతి. వాళ్లిద్దరూ కలిసి రెడ్ కార్పెట్ పై కన్నుల విందుగా నడిచివచ్చారు. నిజమే మనిషి తాను ఊహించని సక్సస్ ని ఆనందాన్ని అందుకునేటప్పుడు, తన పక్కన తనకు బాగా కావాల్సిన వారిని పెట్టుకోవాలని అనుకుంటాడు. అలాగే రామ్ చరణ్ ఇంతటి సక్సెస్ ని పొందేటప్పుడు తన పక్కన తన భార్య ఉపాసన ఉండాలని కోరుకున్నారు.

See also  Allu Arjun: అందరూ చూస్తుండగానే షూటింగ్ స్పాట్ లో ఆ స్టార్ హీరోయిన్ చెంప చెల్లుమనిపించాడట అల్లు అర్జున్..

ram-charan-and-upasana-in-oscar-award-function

రామ్ చరణ్ ఉపాసనతో రాగానే మీడియా రామ్ చరణ్ ఇంటర్వ్యూ చేయగా.. తన సినిమా ఇక్కడివరకు రీచ్ అవ్వడం ఆనందంగా ఉందని, పైగా తన భార్య ఉపాసనకు ఇదే నా తరుపున గిఫ్ట్ అని అన్నాడు. కడుపుతో ఉన్న భార్యకి రామ్ చరణ్ ఇచ్చిన ఆనందం నిజంగానే వెలకట్టలేని గొప్ప గిఫ్ట్. ఆ గిఫ్ట్ అనుభవించిన ఉపాసన ముఖంలో ఆ అనుభూతి బాగా కనిపిస్తుంది. ఉపాసనతో పాటు కడుపులో ఉన్న రామ్ చరణ్ వారసుడు కూడా గర్వించ తగ్గ గిఫ్ట్ ఇది.