Home Cinema Ram Charan – Upasana : పెళ్ళయ్యి ఇన్నేళ్లయినా కూడా రామ్ చరణ్ ఉపాసన ఇప్పటికీ...

Ram Charan – Upasana : పెళ్ళయ్యి ఇన్నేళ్లయినా కూడా రామ్ చరణ్ ఉపాసన ఇప్పటికీ ఆ విషయంలో సెపరేట్ అంట..

ram-charan-and-upasana-10-years-after-marriage-also-still-they-are-separate-in-that-matter

Ram Charan – Upasana : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ప్రాధాన్యత ఏమిటో మనం కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలేదు. మెగాస్టార్గా ఆయన పేరు పొందిన తర్వాత మెగా ఫ్యామిలీని క్రియేట్ చేసిన గొప్ప ఘనుడు. మెగా ఫ్యామిలీ అనగానే మెగాస్టార్ చిరంజీవి గుర్తుకొస్తారు. అలాగే ఇప్పుడైతే మెగాస్టార్ ( Ram Charan and Upasana 10 years after marriage ) చిరంజీవి ఏకైక తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గుర్తుకు వస్తున్నాడు. ఎందుకంటే.. తండ్రిని మించిన తనయుడులా ఎదుగుతూనే ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మంచి పేరును సంపాదించుకున్న వ్యక్తి రామ్ చరణ్.

Ram-Charan-Upasana-after-10years-marriage

ఎంత ఎదుగుతున్న రామ్ చరణ్ ముఖంలో ఎప్పుడూ వినయం కనిపిస్తూనే ఉంటుంది. వినయ విధేయతలతో ఎంతో చక్కగా తన జీవితాన్ని ముందుకు తీసుకుని వెళుతున్నాడు. కేవలం సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా.. ప్రొడక్షన్ లైన్లో ముందుకు సాగుతున్నాడు. అలాగే వ్యాపారాలు చేస్తూ వాటిలో కూడా విజయాలను ( Ram Charan and Upasana 10 years after marriage ) సాధిస్తున్నాడు. చిరంజీవికి అన్ని వైపులా నాకు తగ్గ తనయుడు, నన్ను మించి ఎదుగుతాడు అనే కాన్ఫిడెన్స్ ని ఇస్తూ కుటుంబాన్ని ముందుకు తీసుకుని వెళుతున్నాడు. నిజంగా చిరంజీవి జీవితంలో స్వయంకృషితో పడిన కష్టానికి, ఎదిగిన ఎదుగుదలకి.. కొడుకు అలా ముందుకు ఎదగడం నిజంగా ఆయనకు భగవంతుడు ఇచ్చిన వరమనే అనుకోవాలి.

See also  Allu Arjun : ఒక్క సారైనా అల్లు అర్జున్ తో చేయాలి.. సినిమా కాదండోయ్ అదే..

Ram-Charan-Upasana-after-10years-marriage-also

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఉపాసనని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. రాంచరణ్ చాలా కాలంగా ఉపాసనని ఇష్టపడుతూ ప్రేమించి.. ఆ తర్వాత పెద్దలందరినీ అటు ఇటు కూడా ఒప్పించి.. ఎంతో సాంప్రదాయంగా పెళ్లి చేసుకున్నాడు. 10 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్లకి ఒక ఆడపిల్ల పుట్టింది. కూతురు ( Ram Charan and Upasana 10 years after marriage ) పుట్టిన ఆనందం వాళ్ళ కుటుంబంలో ఎంతో బాగా కనిపిస్తుంది. క్లీన్ కారా పుట్టిన తర్వాత రామ్ చరణ్, ఉపాసన ప్రతి పండుగని కూడా ఎంతో వైభవంగా చేసుకుంటున్నారు. వాళ్ల జీవితంలో ఆనందం అంటే ఆ చిన్నారి పుట్టిన తర్వాత కలిగిందని అనేటట్టుగా కనిపిస్తూ.. ఎంతో వైభవంగా ప్రతి చిన్నదాన్ని చేసుకుంటున్నారు.

See also  Prabhas actress : పెళ్ళికి ముందే అతని కారణంగా తల్లైన ప్రభాస్ హీరోయిన్!

Ram-Charan-Upasana-after-marriage

అయితే రామ్ చరణ్, ఉపాసన మీద ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేమిటంటే.. పెళ్లయినా కూడా రామ్ చరణ్, ఉపాసన ఒకరి సంపాదన జోలికి ఒకరు వెళ్లరు అంట. ఉపాసన ఎన్నో సోషల్ సర్వీసులు చేస్తుందన్న సంగతి మనందరికీ తెలిసిందే. వాటికి దేనికి కూడా రామ్ చరణ్ ని డబ్బు అడగదంట. తన సంపాదన, తన డబ్బులను వాడుతుందట. అలాగే రామ్ చరణ్ కూడా ఈ డబ్బును ఏం చేశావు? దేనికి ఖర్చు పెడుతున్నావు? అని ఒక్క మాట కూడా అడగడంట. అలాగే రామ్ చరణ్ ఎవరికైనా సాయం చేయాలన్నా.. బంధువులకు గాని, కుటుంబ సభ్యులకి గాని, స్నేహితులకు గాని ఎవరికి ఏం చేయాలన్నా కూడా భార్యను ఒక్క రూపాయి కూడా అడగడంట. తన సంపాదనలో తాను చేసుకుంటూ వెళ్తాడంట. నీ సంపాదన ఏం చేస్తున్నావని ఉపాసన కూడా ప్రశ్నించదంట. అంత చక్కటి దాంపత్యం అంట వాళ్ళిద్దరిది. వాళ్ళ పెళ్ళయ్యి ఇన్నేళ్లు అయినా కూడా మనీ క్యాలిక్యులేషన్లో ఇద్దరూ సపరేట్ గానే ఉంటారంట. కేవలం బంధాన్ని, కుటుంబాన్ని మాత్రమే కాపాడుకుంటూ ఎవరి కష్టంతో వాళ్లకి నచ్చిన ఖర్చులు పెడుతూ జాగ్రత్తగా ఉంటారంట. మొత్తం మీద ఇద్దరు జాగ్రత్త పరులే. ఏమైనా చేస్తే మంచికే ఖర్చు పెడతారు తప్పా.. అనవసరంగా ఖర్చు చేయరు అంట.