Ram Charan : ఎవరి జీవితంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తాయో చెప్పలేము. ఎంత గొప్పవాళ్ళైనా సెలబ్రిటీస్ అయినా ఒక్కొక్కసారి భయపడక తప్పదు. భయం అనేది మనమేదో తప్పు చేస్తేనో.. కష్టం వస్తే కలిగేది కాదు. ఒక్కొక్కసారి మనలో ఉన్న ప్రతిభను ఎదుటివారు గుర్తిస్తారా లేదా మనం చేసేది ( Ram Charan and Nagarjuna ) అవతల వాళ్ళు కోణంలో మనం కనిపిస్తామా లేదా సక్సెస్, ఫెయిల్యూర్ ఇవన్నీ వచ్చేటప్పుడు కూడా భయాన్ని కలిగిస్తాయి. అలాంటి భయంతోనే ఒకసారి రామ్ చరణ్ చాలా టెన్షన్ పడ్డాడంట. ఇంతకీ అసలు రామ్ చరణ్ అంత భయపడినంత విషయమేమి వచ్చింది? రామ్ చరణ్ భయపడుతూ నాగార్జున దగ్గరకు వెళ్ళాడు అంటూ.. సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
ఈరోజు రామ్ చరణ్ ఇటీవల వచ్చిన లాస్ట్ సినిమా ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న గ్లోబల్ హీరో అయ్యాడు. అంతేకాకుండా ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ నిమిత్తం ఆయన ఇంటర్నేషనల్ ( Ram Charan and Nagarjuna ) లెవెల్ లో అనేక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఈ రకంగా రామ్ చరణ్ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా తెలిసిన ఒక స్టార్ హీరో. అలాంటి హీరో మొదటి సినిమా పయనం చిరుతతో మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి కొడుకు గా, నట వారసుడుగా ఆ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆ సినిమా రేపు రిలీజ్ అవుతుంది అనగా ఒక విచిత్రమైన సంఘటన జరిగిందంట.
చిరుత సినిమా రేపు రిలీజ్ అవుతుంది అనగా.. రామ్ చరణ్ విపరీతంగా భయపడ్డాడు అంట. ఆ సినిమా ఎలా ఉంటుందో ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో అనే భయంతో.. ఆ భయాన్ని ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియక తిన్నగా నాగార్జున ఇంటికి వెళ్లిపోయి నాగార్జునతో చెప్పుకున్నాడంట. నాగార్జున నేను నీ సినిమాని ఫ్రీ రిలీజ్ లో ( Ram Charan and Nagarjuna ) చూశాను చాలా బాగా వచ్చింది. నువ్వేం టెన్షన్ పడాల్సిన పనిలేదని చెప్పారంట. లేదు ఎంత బాగా వచ్చినా నన్ను చిరంజీవి కొడుకు గానే చూస్తారు. ఆయనతో పోల్చి చూస్తే నన్ను యాక్సెప్ట్ చేస్తారో లేదో అంటూ భయపడ్డాడంట.అప్పుడు నాగార్జున అలాంటి భయాలు ఏం పెట్టుకోకు అన్ని బానే జరుగుతాయి. నీ కష్టం నువ్వు పడ్డావు కదా అని ధైర్యం చెప్పాడంట. ఆ మరుసటి రోజు అసలు విషయం తెలిసింది.
మరుసటి రోజు పొద్దుటే మొదటి షో తోనే చిరుత సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. చిరుత సినిమా సూపర్ హిట్ అయింది. దీంతో రామ్ చరణ్ కి అంతులేని ఆనందం కలిగిందట. ఎందుకంటే.. తన వల్ల తన తండ్రికి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో, తన తండ్రి పేరును బట్టి తాను మొదటి సినిమా చేశాను కాబట్టి నా తండ్రికి చెడ్డ పేరు రాకూడదని చాలా టెన్షన్ పడడంట. అలా అంత భయంతో, గౌరవంతో రాంచరణ్ ఉండబట్టే.. ఈరోజు చిరంజీవి ప్రపంచవ్యాప్తంగా గర్వంగా రామ్ చరణ్ నా కొడుకు అని చెప్పుకునే స్థితికి రామ్ చరణ్ ఎదిగాడు. ఇంకా ఎదుగుతూనే ఉంటాడు. అదే మెగాస్టార్ చిరంజీవి తాను కష్టపడి తన చుట్టూ ఉన్న వాళ్లకి అవకాశాన్ని ఇచ్చి నిలబెట్టిన పుణ్యానికి.. ఆయనకు ఆ కొడుకు దొరకడమే అదృష్టం.