
Ram Charan – Mahesh Babu : ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ పేరు ప్రఖ్యాతలు ప్రపంచవ్యాప్తంగా చాటాయి అన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ ఏడాది రామ్ చరణ్ కు అన్ని రకాలుగా బాగుంది. కూతురు పుట్టిన ఆనందంలో కూడా ఉన్నాడు. రాంచరణ్ కెరియర్ పరంగా చాలా మంచి సక్సెస్ఫుల్ లోకి వెళ్తున్నాడు. అలాగే ( Ram Charan and Mahesh Babu ) ప్రొడక్షన్ కూడా కొత్త ప్రాజెక్ట్ కొత్త కంపెనీ స్టార్ట్ చేసి అది కూడా అందులో సినిమా కూడా నిఖిల్ తో ఒక సినిమా చేయబోతున్నట్టు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ రకంగా రాంచరణ్ అన్ని వైపుల నుంచి చూసుకుంటూ కెరియర్ ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నాడు. రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేజర్ సినిమాతో షూటింగ్ బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే..
ఇక మహేష్ బాబు విషయానికొస్తే.. గుంటూరు కారం సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో పాటు ఈ సినిమా తర్వాత స్టార్ట్ ( Ram Charan and Mahesh Babu ) అయ్యే సినిమా మీద కూడా అందరికీ ఆత్రం ఎక్కువగా ఉంది. ఎందుకంటే.. మహేష్ బాబు నెక్స్ట్ సినిమా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న విషయం తెలిసిందే. దానిపై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. రాంచరణ్ తో పూర్తి చేసుకున్న సినిమా పూర్తి చేసుకున్న రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుతో మరో సినిమా మొదలు పెట్టబోతున్నారు.
ఇలా రాజమౌళి ఇద్దరు హీరోలు.. ఏఎన్ఆర్ 100వ రోజు పుట్టినరోజు వేడుకలు విగ్రహ ప్రతిష్టాపన వేడుకలో వీళ్ళిద్దరూ కలుసుకున్నారు. ఇలా ఈ స్టార్ హీరోలు ఇద్దరు ఒకే వేడుకల్లో కలవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఒకే వేడుకకి వీళ్లిద్దరూ రావడమే కాకుండా.. ఎంతో సరదాగా ముచ్చటగా మాట్లాడుకుంటూ అక్కడ ( Ram Charan and Mahesh Babu ) అందరినీ ఆనందింప చేశారు. ఇక ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ ని మహేష్ బాబు ని ఒకే స్క్రీన్ లో చూసి అభిమానులను ఆనందంతో పొంగిపోతున్నారు. ఒకే ఫోటోలో ఎలా చూసి ఆనంద పడిపోతున్నామో.. ఒకే స్క్రీన్ మీద కూడా వీళ్ళిద్దరూ కనిపిస్తే ఎంత బాగుంటుందో అని అనుకుంటున్నారు.
అయితే రాజమౌళితో రామ్ చరణ్ కున్న బంధం గురించి మనందరికీ తెలిసిందే. మగధీర లాంటి సినిమాలను రామ్ చరణ్ జీవితంలో చిరస్థాయిగా నిలిచిపోయే రెండు సినిమాలను ఇచ్చింది రాజమౌళినే. అయితే ఇప్పుడు మహేష్ బాబుతో కూడా సినిమా తీస్తుంది రాజమౌళి కాబట్టి.. ఆ సినిమాలో మహేష్ బాబు వచ్చి ఒక మెరుపు మెరుస్తాడని ప్రచారాలు జరుగుతున్నాయి. ఒకవేళ నిజంగా అదే జరిగితే.. రామ్ చరణ్, మహేష్ బాబు అభిమానులకి అది ఎంతో పండగ లాంటివార్తే.. అయితే ఇప్పుడు ఈ వేడుకలో వీళ్ళిద్దరూ నవ్వుతూ.. సెకండిచ్చుకుంటున్న ఫోటోలో మధ్యలో నమ్రత అడ్డుగా ఉంది. నమ్రత మధ్యలో కూర్చుంటే.. వీళ్ళిద్దరూ వంగి ఒకరినొకరు నవ్వుతూ పలకరించుకుని షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నారు. ఆ ఫోటో చూసిన అభిమానులు అబ్బా మా హీరోల మధ్యలో నమ్రత ఉండటం అభిమానులకు ఇంకా ఆ ఫోటో చూడ ముచ్చటగా ఉంది..