
Chiranjeevi – Ramcharan : మెగాస్టార్ చిరంజీవి గురించి ఆయనకున్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఇక ఆయన ఏకైక కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మారి.. ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తున్నాడో ( Ram charan and Chiranjeevi to do a multi-starer movie ) చూస్తూనే ఉన్నాం. ఒకపక్క సినిమాల్లో హీరోగా నటిస్తూ.. మరోపక్క ప్రొడక్షన్ కంపెనీ ఓపెన్ చేసి దానిలో సినిమాలు తీయడానికి సిద్ధమవుతున్న రామ్ చరణ్ అన్ని రకాలుగా కూడా ఎదుగుతూనే వస్తున్నాడు. తనయుడిగా తన తండ్రికి ఎంతో పుత్రోత్సాహాన్ని కలిగిస్తూనే ఉన్నాడు. అలాగే ఇటీవల రామ్ చరణ్ ఉపాసనలకు కూతురు పుట్టడం వల్ల చిరంజీవికి ఇంకా ఆనందాన్ని కలిగించారు.
ఇవన్నీ ఇలా ఉంటే.. చిరంజీవి, రామ్ చరణ్ లకు ఎంతో కాలం నుంచి ఒక కోరిక అయితే ఉండిపోయింది. కేవలం చిరంజీవి, రామ్ చరణ్ లకె కాకుండా.. మెగా కుటుంబం మొత్తానికి, అలాగే మెగా అభిమానులందరికీ ఉన్న గొప్ప కోరిక అదేమిటంటే.. చిరంజీవి, రామ్ చరణ్ కలిసి సినిమా నటించాలని.. వీళ్లిద్దరూ ( Ram charan and Chiranjeevi to do a multi-starer movie ) ఇప్పటికి చాలాసార్లు.. చాలా తక్కువ సమయాన్ని స్క్రీన్ పంచుకోవడం జరిగింది. అలాగే ఆచార్య సినిమాలో కొంచెం సేపు పంచుకున్నప్పటికీ.. ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఇలా కాకుండా చిరంజీవి, రామ్ చరణ్ కలిసి స్క్రీన్ పంచుకోవాలని.. మల్టీ స్టార్ సినిమా వీళ్ళిద్దరూ చేయాలని.. మెగా అభిమానులు, మెగా కుటుంబం, చిరంజీవి, రామ్ చరణ్ లు ఎంతగానో కోరుకుంటున్నారు. ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైపోయింది.
ప్రస్తుతం ప్రభాస్ హీరోగా సలార్ సినిమాని దర్శకత్వం వహిస్తున్న ప్రశాంత్ నీల్ తదుపరిచిత్రం చిరంజీవి రామ్ చరణ్ తో కలిసి మల్టీస్టారర్ సినిమా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. కొద్దిరోజుల తర్వాత ఇది అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేస్తారని అనుకుంటున్నారు. ప్రశాంత్ నీల్ సినిమా అంటే కేజిఎఫ్, కేజీఎఫ్ 2, సలార్ లాంటి ( Ram charan and Chiranjeevi to do a multi-starer movie ) సినిమాలు ఊహించుకుంటేనే ఫాన్స్ కి ఆనందంతో గుగురుబాటు కలుగుతుంది. అలాంటిది చిరంజీవిని, రామ్ చరణ్ ని కలిపి అలాంటి సినిమా ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడని.. ఇక అదిరిపోయే హైప్ ఉంటుందని అంటున్నారు. ప్రశాంత్ నీల్ చిరంజీవికి, ప్రభాస్ కి చెప్పిన కథ కేజిఎఫ్ కంటే కూడా.. ఇంకా ఈ మల్టీ స్టార్ ఇద్దరినీ హైప్ లేపుతూ.. సినిమాని అదరగొట్టి.. మెగా అభిమానులకు మంచి గిఫ్ట్ ఇస్తాడు ప్రశాంత్ నీల్ అనుకుంటున్నారు.
ఇక ప్రశాంత్ నీల్ తో జూనియర్ ఎన్టీఆర్ కి కూడా సినిమా ఉందని అనుకున్నారు కానీ.. ఆ సినిమా ఇంచుమించుగా క్యాన్సిల్ అయినట్టే అని సినీవర్గాలు అనుకుంటున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజెర్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ప్రశాంత్ నీల్ సలార్ సినిమా అయిపోవడంతో.. చిరంజీవి, రామ్ చరణ్ సినిమా మొదలవుతుందని అంటున్నారు. మరి ప్రశాంత నీల్ చిరంజీవిని, రామ్ చరణ్ ని కూడా గ్యాంగ్ స్టార్స్ గా చూపిస్తాడా? ఎలా చూపిస్తాడు అనేది ఆ మూడు సినిమాలను బట్టి అంచనా వేసుకుంటుంటే సినిమా సినిమాకి ఇంకా హైప్ లో ఉన్న ప్రశాంత్ నీల్.. ఇంకెలాంటి అదిరిపోయే సినిమా తీస్తాడో చిరంజీవి, రామ్ చరణ్ తో అర్థమవుతూనే ఉంది. ఈ వార్త నిజం కావాలని అతి తొందరలోనే అఫీషియల్ గా అనౌన్స్ రావాలని అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.