Rakul Boy Friend: రకుల్ ప్రీత్ సింగ్ బాలివుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో మరికొద్ది రోజుల్లో వివాహబంధంతో ఒక్కటి అవ్వబోతున్నారు. అయితే వీళ్ళిద్దరికీ సంబంధించిన వార్త అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడానికి ముందే ఒక కండిషన్ పెట్టుకున్నారట. ఆ కండిషన్ ఒప్పుకున్నాకే. . రకుల్ జాకీని వివాహం చేసుకోవడానికి అంగీకరించిందట. రకుల్ తన ప్రియుడికి పెట్టిన కండిషన్ఇప్పుడు చూద్దాం. .
ఇండస్ట్రీలో ఉన్న చాలామంది సెలబ్రిటీలు పెళ్ళికి ముందు ఇలాంటి కండిషన్స్ పెట్టుకుంటూనే ఉంటారు. అలా ఆ కండిషన్స్ ఓకే అన్నాకే పెళ్లి అనే బంధం లోకి అడుగుపెడుతుంటారు. రకుల్ ప్రీత్ సింగ్ కూడా మొదట్లో తన బాయ్ ఫ్రెండ్ కాబోయే భర్త అయిన జాకీకి (Rakul Boy Friend)ఒక కండిషన్ పెట్టిందట. మరి అదేంటంటే. . ఇద్దరి మధ్యలో ఎలాంటి రహస్యాలు అనేవి ఉండకూడదట. ఏ విషయాన్ని అయినా సరే ఓపెన్ గా చెప్పాలి. .
ఎందుకంటే ఇద్దరి మధ్య రహస్యాలు ఉంటే బంధం అనేది ఎక్కువ రోజులు నిల్వదని వాళ్ళ అభిప్రాయం. . వాళ్ళిద్దరి రిలేషన్ అభద్రత భావంతో ముందుకు సాగుతోంది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఇద్దరు మధ్య బ్రేకప్ వస్తుందేమో అని డేటింగ్ కంటే ముందే ఇద్దరు ఒకరి అభిప్రాయాలను ఒకరు చెప్పుకున్నాం. ఆ సమయంలో నేను జాకీ కి ఎలాంటి రహస్యాలు దాచకూడదని కండిషన్ పెట్టాను. నేను జాకీతో ఉంటే నా జీవితంలో ఫుల్ ఫీల్ అవుతుందని అనిపించింది. అందుకే అతనితో ముందుకు వెళ్లాలని నిశ్చయించుకున్నాను అంటూ చెప్పింది. ఇదేకాక సెలబ్రెటీ హోదాలో ఉన్న చాలామంది నటీనటులు సైతం సమయం లేకపోయినా సరే కచ్చితంగా టైం కుదిరేలా చేసుకుని మరి వాళ్ళ కలలని, ఆశలని సహకారం చేసుకుని ఒక మగతోడు కోసం వెతుక్కున్నట్టు సలహా కూడా ఇచ్చింది.