
Rajinikanth – Jailer : సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే యావత్ భారత దేశంలో విపరీతమైన క్రేజీ ఉందన్న సంగతి కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలేదు. కేవలం ఒక భాషకు మాత్రమే పరిమితం కాకుండా అన్ని భాషల వారిని తన ( Rajinikanth Jailer movie collections ) స్టైల్ తో ఆకట్టుకునే గొప్ప హీరో రజనీకాంత్. ఆయన వయసు మీద పడే కొద్దీ.. ఆయన మీద ఉన్న క్రేజ్ పెరుగుతూనే వచ్చింది. అయితే గత కొంతకాలంగా రజినీకాంత్ కెరీర్లో హిట్స్ అనేవి లేకుండా పోయాయి. రిలీజ్ అయిన ప్రతి సినిమా యావరేజ్ గానే.. అట్టర్ ఫ్లాప్ గానే అవుతూ వచ్చింది. ఈ క్రమంలో ఆయన అభిమానులంతా ఎంతో నిరాశపడ్డారు.
కానీ జైలర్ సినిమా అందరి నిరాశల్ని పటాపంచలు చేసింది. రిలీజ్ కి ముందు పెద్ద భారీ అంచనా లేకపోయినప్పటికీ.. ఈ సినిమా రిలీజ్ తర్వాత మాత్రం అందరిని ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది. రజినీకాంత్ సినిమాలో నటించిన స్టైల్ గాని, ఆయన ప్రతిభ గాని ఊహించని విధంగా ఉంది. ఇక దర్శకుడు తన ట్యాలెంట్ ని ( Rajinikanth Jailer movie collections ) రజనీకాంత్ ని ఎలా చూపిస్తే అభిమానులు పొంగిపోతారో.. ఆ రకంగా అన్ని రకాలుగా కథని, కథనాన్ని, ప్రతి సీన్ ని కేర్ తీసుకొని ఎంతో బాగా చేయడం జరిగింది. అలాగే ఇతర నటీనటులు కూడా.. ప్రతి భాషలో ఉన్న స్టార్ హీరోలు రజనీకాంత్ మీద ఉన్న అభిమానంతో ఆ సినిమాలో చిన్న చిన్న క్యారెక్టర్స్ తో కనిపించి మెరిపించి వెళ్లారు.
ఇక ఈ సినిమాలో ఇంటర్వెల్ అదిరిపోతుంది. కేవలం ఈ సీన్ చూడటం కోసమే రిపీట్ రిపీట్ గా సినీ అభిమానులందరూ కూడా చూస్తున్నారు. ఇక రజనీకాంత్ అభిమానులైతే ఈ సినిమాలో ప్రతి సీన్ ని ఎంజాయ్ చేశారు. ఆయన ప్రతి డైలాగుని, ఆయన ఆకట్టుకునే నటన విధానాన్ని ఆస్వాదించారు. ఇక జైలర్ సినిమా రిలీజ్ అయిన ( Rajinikanth Jailer movie collections ) మొదటి రోజు ఎలాంటి కలెక్షన్స్ తీసుకొచ్చిందో ఇన్ని రోజులైనా కూడా ఇప్పటికీ అలాగే దుమ్ము రేపుతుంది. ఈ సినిమా ఒక కొత్త రికార్డును సృష్టించే దారిలోకి వెళ్ళిపోతుంది. ఈవారం ఎలా ఉంటుందో?ఈ వారం ఎలా ఉంటుందో అనుకునే దారిలోంచి ప్రతి వారం కూడా మొదటి రోజులాగే కలెక్షన్స్ తో అదరగొడుతుంది.
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన జైలర్ సినిమా రజినీకాంత్ కెరీర్లో ఒక కొత్త మలుపును తిప్పబోతుంది. రజనీకాంత్ ముందు మునుపు ఉన్న రికార్డ్స్ ని దాటుకోడమే కాకుండా.. ఇంకా తమిళ్లో అనేకమంది స్టార్ హీరోలు సినిమాల్ని బద్దలు కొట్టేస్తుంది. ఇప్పటికి 600 కోట్లు రూపాయలు కలెక్షన్ రాగా భారతీయ సినిమా ఇండస్ట్రీ చరిత్రలో ఈ సినిమా ఒక పేజీని తనకోసం రాసుకుంది. మొదటి రోజే 97 కోట్లతో రికార్డును సృష్టించిన జైలర్ అక్కడ నుంచి ఆగకుండా దూసుకుపోతూ ఇప్పటికే 600 కోట్లకు రీచ్ అవ్వడం అంటే మామూలు మాట కాదు. ఇక రజనీకాంత్ అభిమానులకైతే ఆనందానికి అవధులు లేవు. తమిళ్లో ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్స్ గా రాసి పెట్టుకున్న సినిమాల్ని బద్దలు కొట్టి ముందుకు వెళ్ళిపోతుంది జైలర్.