Bubblegum: రాజమౌళి అంటే ఒక మామూలు బ్రాండ్ కాదు. యావత్ ప్రపంచంలో సినిమా ఇండస్ట్రీలో ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి మొదలైన ఆయన ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా ( Rajamouli wishes Bubblegum movie ) ఆయన పేరుతో పాటు ఆయన వర్క్ చేసుకున్న తెలుగు సినిమా ఇండస్ట్రీని కూడా అంతే ఎత్తుకు ఎత్తారు. అందుకే రాజమౌళి ఏ సినిమా గురించి ఒక రివ్యూ ఇచ్చిన, ఒక కామెంట్ చేసిన, విషెస్ చెప్పిన ఆ సినిమాపై అందరికీ ఆసక్తి పెరుగుతుంది. అలాగే ఇటీవల రాజమౌళి ఒక సినిమాకి ఆయన ఇచ్చిన కాంప్లిమెంటు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
కొత్త హీరోలు కొత్త హీరోయిన్లతో సినిమాలు ఇటీవల కాలంలో ఎక్కువగా తీస్తున్నారు. ఇప్పుడు ఆ ట్రెండ్ బాగా నడుస్తుంది. స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్స్ ని పెట్టి సినిమాలు భారీ బడ్జెట్లో తీసిన తర్వాత, అవి గాని కొంచెం బాగోకపోతే ( Rajamouli wishes Bubblegum movie ) డిజాస్టర్ గా మిగిలితే.. తీసిన నిర్మాతకు అందులో నటించిన హీరోకు, హీరోయిన్, దర్శకుడు కి ఇక మళ్ళీ కొన్ని ఏళ్ల పాటు వాళ్లకు మంచి ప్రాజెక్టు దొరకడం అనేది చాలా కష్టమైపోతుంది. అలాంటి పరిస్థితుల్లో ఉండడం వల్లనే ఎక్కువ మంది చిన్న చిన్న హీరోల్ని, హీరోయిన్స్ ని పెట్టుకొని లేదా కొత్త నటీనటులను పెట్టుకొని మంచి కాన్సెప్ట్ తో అందరిని నవ్విస్తూ.. సినిమా తీస్తే అవి ఒక్కొక్కసారి బ్లాక్ బస్టర్ హిట్టును కొడుతున్నాయి.
వాళ్ళు అనుకున్న బడ్జెట్,వాళ్ళు ఖర్చుపెట్టిన బడ్జెట్ కంటే.. ఎక్కువ బడ్జెట్లో తిరిగి రిటర్న్ అవుతుంది. దీనితో లాభాల బాటపడుతున్నారు. ఇలా చిన్న చిన్న హీరోలకు.. కొత్త హీరో, హీరోయిన్స్ కు.. చిన్న చిన్న ప్రాజెక్టుకు సినిమా బాగుంటే ప్రేక్షకులు ఆదరణ వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి సమయం చూసుకొని యాంకర్ ( Rajamouli wishes Bubblegum movie ) సుమ తన కొడుకుని హీరోగా పరిచయం చేస్తుంది. యాంకర్ సుమ కనకాల, రాజీవ్ కనకాల కొడుకు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. మార్చి 15వ తేదీ అతని పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాని ఈ ఏడాది అనౌన్స్ చేశారు. రాజీవ్ కనకాల, సుమ తెలుగు సినిమా ఇండస్ట్రీని ఎంతగా అంటిపెట్టుకొని ఉన్నారో మనందరం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
ఈ జంట నిజంగా చాలా గొప్ప జంట అని అందరూ చెప్పుకుంటారు. సుమకి కనకాల కుటుంబం నుంచి చాలా సపోర్ట్ వచ్చి.. ఆమెను నిలబడే వరకు వెన్నుగా నిలబడ్డారని అనుకుంటూ ఉంటారు. ఇక సుమ, రాజీవ్ కనకాల దాంపత్యం కూడా ఎంతో హాయిగా ఉందని తెలిసిందే. అయితే రోషన్ కనకాల సినిమా పోస్టర్ ఈరోజు రిలీజ్ చేశారు. ఈ సినిమాలో రోషన్ కనకాల హీరోగా, చెరుకూరి మానస చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ అమ్మాయికి కూడా ఇది ఫస్ట్ సినిమా. ఈ సినిమా పోస్టర్ని వదిలింది ఎవరో కాదు రాజమౌళి. రాజమౌళి బబుల్గమ్ వదులుతూ.. ఆయన రోషన్కు తన అభినందనలు తెలిపారు. రాజమౌళి.. నటుడుగా పరిచయం అవుతున్నందుకు నీకు అభినందనలు రోషన్. నీదైన గుర్తింపు సంపాదించుకుంటావని ఆశిస్తున్నాను. రాజీవ్, సుమ గారు గర్వపడేలా చేయాలి. బబుల్గం చిత్ర బృందం వాళ్లకు కూడా శుభాకాంక్షలు అని రాజమౌళి పేర్కొన్నారు. ఈ సినిమా పోస్టర్ వదలడమే కాకుండా ఆ హీరో తనంతట తాను గుర్తింపు తెచ్చుకోవాలని ఆయన ఆశిస్తున్నట్టుగా చెప్పడం జరిగింది.