Rajamouli : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ ఆయన పేరు చెప్పుకొని గర్వించదగ్గ గొప్ప దర్శకుడు రాజమౌళి. భారత దేశంలోనే కాకుండా యావత్ ప్రపంచంలో గర్వంగా తలెత్తుకుని అందరి దృష్టి మన మీద పడేలా ( Rajamouli and Surya ) చేసిన రాజమౌళి లాంటి దర్శకుడు దొరకడం నిజంగా అదృష్టమని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రతీ ఒక్కరూ గర్వంగా చెప్పుకుంటారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ అవార్డు తెలుగు సినిమా ఇండస్ట్రీకి తీసుకువచ్చిన రాజమౌళి తర్వాత ప్రాజెక్టు మీద అందరికీ ఆసక్తిగా ఉంది. రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ మహేష్ బాబుతో చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాని హాలీవుడ్ రేంజ్ లో చేస్తున్నాడని ఇప్పటికే అనేక వార్తలు వచ్చాయి.
మహేష్ బాబు, త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరుకారం సినిమా షూటింగ్ సర వేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన వెంటనే రాజమౌళితో మహేష్ బాబు సినిమా స్టార్ట్ అవుతుందని మహేష్ బాబు ( Rajamouli and Surya ) అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే అసలు రాజమౌళితో సినిమా చేయాలంటే.. అందరి హీరోలకి ఇష్టంగానే ఉంటుంది. ఆయనతో సినిమా చేసే అదృష్టం కోసం తహతహలాడుతారు. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా.. రాజమౌళి లాంటి హీరోతో కలిసి.. అతను తీర్చిదిద్దే ఒక హీరోలా నటించడం అంటే ఎంతో ఇష్టం.
అలాంటి రాజమౌళి కోసం హీరోలందరూ తప్పిస్తుంటే.. రాజమౌళికి మాత్రం ఒక హీరో అంటే ఇష్టం అంట. ఆ హీరోతో కలిసి సినిమా చేయాలని రాజమౌళికి ఎప్పటినుంచో కోరిక అంట. కానీ చేయలేకపోతున్నాడంట. ఇంతకీ ఆ హీరో ఎవరంటే సూర్య అంటే రాజమౌళికి చాలా ఇష్టమంట. చాలా సహజ నటనతో ( Rajamouli and Surya ) అద్భుతంగా నటిస్తాడని ఆయనతో కలిసి సినిమా చేసే అవకాశం వస్తే తప్పకుండా చేయాలని ఉందని చెప్పుకొచ్చాడు రాజమౌళి. సూర్యతో కలిసి సినిమా చేయడం కోసం అనేకసార్లు ఆలోచించాడు కానీ చేయలేకపోవడానికి కారణమేమిటా అని అందరూ అనుకుంటుంటే.. సూర్యకి తగ్గ స్క్రిప్ట్ రాజమౌళి ఇంతవరకు తయారు చేయలేకపోయాడంట.
సూర్య గురించి అని రాజమౌళి ఇప్పటికీ పది సార్లు కథని తయారు చేయాలని అనుకున్నాడంట కానీ.. సూర్యకి తగ్గట్టు కథ తయారవ్వలేదంట. అంటే రాజమౌళి ఏ పని చేసినా కూడా ఎంత శ్రద్ధగా చేస్తాడో ఇప్పుడు అర్థమవుతుంది. ఆయన ఏదో కథ రాసి ఏదో హీరోని పెట్టుకోడన్నమాట. ఒక హీరోని ఊహించుకుంటే ఆ హీరోకి తగ్గట్టుగా కథ తయారు చేసుకుని అలా పర్ఫెక్ట్ గా సినిమా చేసే మనిషి కాబట్టి .. ఆయన సినిమాలు అంత సంచలనాల్ని క్రియేట్ చేస్తాయి. మరి చూద్దాం మహేష్ బాబు తర్వాత రాజమౌళి సూర్యతో ఏవైనా స్క్రిప్ట్ తయారు చేసి మంచి సినిమాను అందిస్తారేమో చూడాలి. రాజమౌళి తో చేసే హీరోకి ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది కానీ.. తరవాత వచ్చే సినిమాలు పోతాయి. కానీ రాజమౌళి మాత్రం ఏ హీరోతో చేసినా అయన ప్రతీ సినిమా హిట్ కొడతాడు. అదే రాజమౌళి స్పెషల్..