Rajamouli : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎందరో గొప్ప గొప్ప దర్శకులు ఉన్నారు. అందులో తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రపంచవ్యాప్తంగా పేరు మారుమ్రోగేలా చేసిన దర్శకుడు మన జక్కన్న. రాజమౌళి సినిమా అంటే కనీసం రెండు సంవత్సరాలు తీస్తాడని, ఇంకా రెండు మూడు పార్ట్స్ కూడా తీస్తాడని, ఇతని దగ్గర పని చేశాక ( Rajamouli takes care of heroines ) ఇంకెక్కడైనా పని చేయగలరని, ఇలా ఎన్నెన్నో అనుకుంటూ ఉంటారు. ఎలా చేసినప్పటికీ సినిమానైతే మాత్రం సక్సెస్ఫుల్గా అందులో నటించిన వాళ్లందరూ గర్వించే విధంగా తీర్చిదిద్దుతాడు. అందుకే ఇతనికి జక్కన్న అని పేరు వచ్చింది. ఒక శిల్పి ఎంత అద్భుతంగా చెక్కుతాడో.. ఇతని సినిమాని, సినిమాలో ఉన్న నటులని అంతలా చెక్కుతాడు.
రాజమౌళి ప్రతి సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుంది. దానికి కారణం ఏమిటో మనందరం ఒక్కొక్కటి గెస్ చేయగలం కానీ.. ఖచ్చితంగా కారణం ఏంటనేది మాత్రం రాజమౌళినే చెప్పాలి. కానీ ఆయన్ని అడిగినా కూడా ఏదో ఒక కారణం చెప్తాడు తప్పా.. పూర్తిగా అతని విద్యని, అతని టాలెంట్ ని, అతని ఆలోచన ఎందుకు బయటకు చెబుతాడు. రాజమౌళి చెప్పాల్సిన పనిలేదు.. అతను చేస్తున్న తీరును గమనిస్తూ.. అతను ఆలోచిస్తున్న విధానాన్ని గౌరవిస్తూ.. అలానే పని చేసుకుంటూ పోతే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎందరో రాజమౌళిలు తయారయ్యే అవకాశం లేకపోలేదు. కాకపోతే అంతటి పట్టుదల, అంతటి సహనం అన్ని కలిసి ఉంటే కచ్చితంగా రోజులు కలిసి వస్తాయి. రాజమౌళి సినిమాలో విలన్ కు చాలా ప్రత్యేకత ఉంటదన్న విషయం అందరికీ తెలుసు. రాజమౌళి సినిమాలో విలన్ ఎంతో బలంగా, మంచి నటన కలిగి విలన్ ని చూసినంత సేపు కూడా సినిమాని చాలా ఇంట్రెస్ట్ గా ఆడియన్స్ చూసేలా తీస్తాడన్న విషయం మనకు తెలిసిందే.
అలాగే ఆయన సినిమాలో హీరోయిన్ ని మాత్రం ఇలాంటి హీరోయిన్ నే పెట్టాలి, అలాంటి హీరోయిన్ నే పెట్టాలి, ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్న హీరోయిన్ ని పెట్టాలి, పెద్ద స్టార్ హీరోయిన్ ని పెట్టాలి అనే ఆలోచనలు ఎప్పుడూ కనిపించలేదు. సినిమా కథ మీద రాజమౌళి చాలా గట్టిగా కాన్సన్ట్రేషన్ పెడతాడు. అలాగే హీరోయిన్ విషయంలో కూడా తన కథకి ఆమె సూట్ అవుతుందా లేదా చూస్తాడు తప్ప.. ఆమె ప్రజెంట్ ట్రెండింగ్ లో ( Rajamouli takes care of heroines ) ఉన్న స్టార్ హీరోయిన్ అవునా కాదా అని మాత్రం చూసినట్టు ఎక్కడా కనిపించలేదు. దీనికి కారణం స్టార్ హీరోయిన్స్, ప్రజెంట్ బాగా ట్రెండింగ్ లో ఉన్న హీరోయిన్స్, డిమాండ్ ఉన్న హీరోయిన్స్ ని పెట్టుకుంటే వాళ్ల కాల్షిట్స్ అన్ని ఆయనకు తగ్గట్టు దొరకవు, దొరికినా కూడా వాళ్ళు ఇచ్చిన కాల్షిట్ ప్రకారం గబగబా షూటింగ్ చేసుకొని వెంటనే ఇంకో షూటింగ్ వెళ్ళాలనే కంగారులో ఉంటారు. అలా హీరోయిన్స్ కంగారు కంగారుగా షూటింగ్ చేయడం ఆయనకు నచ్చదు.
ఆయన సినిమాకి ఎవరో ఒప్పుకున్నా కూడా ఇంకొక సినిమా చేయడం ఇంకో సినిమాతో ఎక్కువ బిజీగా ఉండడం ఆయనకు నచ్చదు. అందుకని పెద్దగా డిమాండ్ లేని హీరోయిన్స్ ని, ఒకవేళ స్టార్ హీరోయిన్ తీసుకున్నా కూడా ఆమె కాల్ షీట్ లో ఇంకో సినిమా లేదు అన్న విషయాన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే రాజమౌళి ( Rajamouli takes care of heroines ) తన సినిమాకి ఒప్పుకోవడం జరుగుతుందట. హీరోయిన్స్ తన సినిమాలో తీసుకునేటప్పుడు ఆమె డేట్స్ వేరే సినిమా దేనికి లేదు అని ఆ ఒక్క విషయాన్ని జాగ్రత్తగా చూసుకొని.. కేవలం అతని సినిమాకే ఎంతసేపైనా కూడా మళ్లీ మళ్లీ నటించాలి అనుకున్న కూడా విసుగు లేకుండా ఈ సినిమాతోనే జర్నీ చేసేలా.. ఆ ఒక్కటి ఉండేటట్టుగా జాగ్రత్తపడతాడట రాజమౌళి.