Home Cinema Rajamouli: పెళ్లికి ముందు ఆ హీరోయిన్ ని ప్రేమించిన రాజమౌళి.. రాత్రి గోడలు దుంకి..

Rajamouli: పెళ్లికి ముందు ఆ హీరోయిన్ ని ప్రేమించిన రాజమౌళి.. రాత్రి గోడలు దుంకి..

Rajamouli Love: ఇండియన్ సినిమా ఇండస్ట్రీ గర్వించదగ్గ దర్శక దిగ్గజాలతో ఒకడు రాజమౌళి. ఒక సీరియల్ డైరెక్టర్ గా కెరీర్ ని ప్రారంభించి, నేడు పాన్ వరల్డ్ డైరెక్టర్ గా కీర్తి ప్రతిష్టలు సంపాదించి ఆస్కార్ అవార్డు ని కూడా గెలుపొందాడు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కి మొట్టమొదటి ఆస్కార్ అవార్డు తీసుకొచ్చిన డైరెక్టర్ గా చరిత్ర సృష్టించడమే కాకుండా, మన తెలుగు సినిమాకి పాన్ వరల్డ్ మార్కెట్ ని కూడా #RRR చిత్రం ద్వారా తెచ్చాడు. ఇప్పుడు ఆయన సినిమాలకు హాలీవుడ్ లో కూడా క్రేజ్ ఏర్పడింది. భవిష్యత్తులో తియ్యబోయే మహేష్ బాబు సినిమాతో, అక్కడ కూడా కలెక్షన్స్ పరంగా చరిత్ర సృష్టిస్తాడో లేదో చూడాలి.

See also  Surekha Upasana - Lavanya : సురేఖ ఉపాసన లావణ్య లలో ఉన్న ఆ కామన్ బుద్ది వలన మెగా హీరోలకు లాభమా నష్టమా?

rajamouli-love-before-marriage-with-that-actress

ఇదంతా పక్కన పెడితే రాజమౌళి రమా ని ప్రేమించి పెళ్లాడిన సంగతి అందరికీ తెలిసిందే. రమ కి మొదటి పెళ్లి కాదు, రెండవ పెళ్లి, ప్రస్తుతం రాజమౌళి తన కొడుకుగా పిలవబడే కార్తికేయ మొదటి భర్త కి సంబంధించిన వాడు అనే విషయం ఈమధ్యనే అందరికీ తెలిసింది. ఇదంతా పక్కన పెడితే రాజమౌళి రమ ని ప్రేమించి పెళ్లాడే ముందు , ఒక స్టార్ హీరోయిన్ ని గాఢం గా ప్రేమించాడట. ఆమె ఎక్కడ షూటింగ్ చేస్తే అక్కడకి వెళ్లి ఆమెనే చూస్తూ ఉండేవాడట. ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తలో రాజమౌళి అంత పాపులర్ డైరెక్షర్ ఏమి కాదు, కాబట్టి ఆయనకి ఆమెని కలవడానికి ఛాన్స్ దక్కేది కాదట.

See also  Director Krish: పెళ్ళైన ఒక్క ఏడాదికే డివోర్స్.. ఆ హీరోయిన్ తో ఎఫైర్ కారణం..

director-rajamouli

ఎలా అయినా ఆమెని చూసేందుకు ఆమె ఇంటి గోడలు కూడా దూకిన సందర్భాలు చాలానే ఉన్నాయి అట(Rajamouli Love). ఇంతకీ ఆయన అంతలా అభిమానించిన హీరోయిన్ ఎవరు అనేది బయటపడలేదు కానీ, ఆ హీరోయిన్ పేరు రమ్యకృష్ణ అని తెలుస్తుంది. ఈమె తన ఫేవరెట్ హీరోయిన్ అని పలు మార్లు రాజమౌళి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అంతే కాకుండా ఆమెని తన కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిల్చిన ‘సింహాద్రి’ మరియు ‘బాహుబలి’ సిరీస్ లో కూడా పెట్టుకున్నాడు. మరి రాజమౌళి ప్రేమించిన హీరోయిన్ ఆమేనా ? అనే సందేహాలు మొదలయ్యాయి అభిమానుల్లో.

See also  Leo – Bhagavanth Kesari: లియో భగవంత్ కేసరి ల కలెక్షన్ రికార్డ్స్ ఎలా ఉన్నాయంటే..

s-s-rajamouli

ఒక స్టార్ హీరోయిన్ అన్న తర్వాత ఎంతో మంది ఇష్టపడుతారు, ప్రేమిస్తారు అందులో వింతేమీ లేదు. రాజమౌళి కూడా అలా ప్రేమించి ఉండొచ్చు కానీ,అందరూ అనుకున్న విధంగా మాత్రం కాదని అంటున్నారు కొంతమంది. మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో చూడాలి(Rajamouli Love). రాజమౌళి ప్రస్తుతం సినిమాల నుండి విరామం తీసుకుని టూర్ లో ఉన్నాడు. మల్లి తిరిగి వచ్చి సినిమాలు స్టార్ట్ చేస్తాడు జక్కన్న. రాజమౌళి తదుపరి సినిమా మహేష్ బాబుతో ఉంది, దాని షూటింగ్ కాస్టింగ్ ఇంకా ఫిక్స్ చేయాల్సి ఉంది.