Home Cinema Rajamouli : చివరికి రాజమౌళి లో కూడా ఈ కోణం ఉందా.. ఊహించని షాకే..

Rajamouli : చివరికి రాజమౌళి లో కూడా ఈ కోణం ఉందా.. ఊహించని షాకే..

Rajamouli gave shock to industry with his another angle: తెలుగు సినిమా ఇండస్ట్రీ ని ప్రపంచ వ్యాప్తంగా ఒక రేంజ్ కి తీసుకువెళ్లిన ఘనుడు రాజమౌళి. ఈ దర్శకుడి దర్శకత్వం లో నటించే అదృష్టం కోసం ప్రతీ నటుడు, నటి ఎదురు చూస్తూ ఉంటారు. ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ ఇలా వీళ్ళందరికీ ఒక అద్భుతమైన క్రేజ్ ని తేవటంలో రాజమౌళి పాత్ర ఎంతన్నది ప్రతీ ఒక్కరికీ తెలుసు. అసలు ఒక సినిమాని కేవలం అదొక వ్యాపారం అని కాకుండా, అదొక కలగా దానిని ఎంత బాగా చూపించగలిగితే అంత అదృష్టం, అదే నాఇష్టం అన్నట్టు సినిమాని తీస్తాడు రాజమౌళి. ఈయన దర్శకత్వంలో ప్రతీ క్యారెక్టర్ కి మంచి పెర్ఫామెన్స్, ఇంపార్టెన్స్ ఉంటాది. వారి హావభావాలను మాత్రమే కాదు వారి పర్సనాలిటీని కూడా సరిగ్గా ఆ పాత్రకు తగ్గట్టు మారుస్తాడు. అందుకే ఇతన్ని జక్కన్న అనేది.

rajamouli-gave-shock-to-industry-with-his-another-angle

జక్కన్న (Rajamouli) సినిమాని పూర్తి చెయ్యడానికి ఎందుకు ఇంత టైం తీసుకుంటాడు అని సామాన్యులకు అనిపించవచ్చుగాని, సినిమా ఇండస్ట్రీ లో ఉన్నవారు ఎవ్వరూ మాత్రం అలా అనుకోరు. ఎందుకంటే ఆయన దర్శకత్వం చేసినట్టు, ఆయన ప్రతీ షాట్ పై తీసుకున్న కేర్ తీసుకున్నట్టు సినిమా తియ్యాలంటే ఎంత శ్రమ, టైం తో కూడుకున్నదో వాళ్లందరికీ తెలుసు. అందుకే ఆయన సినిమాని ఎవరైనా ఒప్పుకున్నారు అంటే రెండేళ్ల పాటు ఇంకొక సినిమా వైపు చూడటానికి టైం ఉండదు, ఒప్పుకోరు కూడా. అందుకే ఆ సినిమాలో నటించేవారు, పని చేసేవారు అందరూ కూడా 24 గంటల్లో మెలుకువగా ఉన్న ప్రతీ క్షణం ఈ సినిమాలో వాళ్ళ పార్ట్ గురించే పని చేస్తూ ఉంటారు. అందుకే ఈ సినిమాలో ప్రతీ పాత్ర నటిస్తున్నట్టు ఉండదు, జీవిస్తున్నట్టు ఉంటాది.

See also  Srikanth Odhela: దసరా డైరెక్టర్ ఫస్ట్ లవ్ ఎవరో గెస్ చేయగలరా.. పైగా ఆమె ఈ సినిమాలో మెయిన్ రోల్ లో ఉంది..

rajamouli-gave-shock-to-industry-with-his-another-angle

రాజమౌళి ( Rajamouli gave shock to industry with his another angle )సినిమాలో యాక్టర్స్ మాత్రమే కాదు, టెక్నీషన్స్కి కూడా మంచి గుర్తింపు వస్తాది. జక్కన్న సినిమాకి పని చేసిన వారిని ఎంత పెద్ద నిర్మాణ సంస్థ అయినా కళ్ళకుద్దుకుని ఆ టెక్నీషన్ కి మంచి ఆఫర్ ఇచ్చి తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళతో అంత పని చేయిస్తాడు మన జక్కన్న. ఆ సినిమాకి అలసిపోయినా, తరవాత ఫ్యూచర్ వాళ్లకి చాలా బాగుంటది. ఇక ప్రొడ్యూసర్స్ సినిమాకి బడ్జెట్ వెళ్తున్న కొద్దీ భయంగా ఉంటారేమో గాని, తరవాత రిజల్ట్ మాత్రం అంతే అద్భుతంగా ఉంటాది. ఇలా ప్రతీ ఒక్కరినీ తనకి కావలసినట్టు తీర్చి దిద్దుకునే రాజమౌళికి జక్కన్న అనే పేరు సరిగ్గా సరిపోతుంది. కేవలం తన పని మీద అంత ఫోకస్ పెడుతూ కష్టపడి పని చేసే గుణం ఉండబట్టే రాజమౌళి ఈరోజు ఇంత పెద్ద స్థాయిలో ఉన్నారు. అయితే రాజమౌళి దర్శకత్వం మాత్రమే కాకుండా ఇంకో బాటన కూడా నడవాలని అనుకుంటున్నాడట.

See also  Ram Pothineni: యంగ్ హీరో అరుదైన రికార్డ్ పాన్ ఇండియా హీరోల పరువు తీసిన రామ్..

rajamouli-gave-shock-to-industry-with-his-another-angle

రాజమౌళి దర్శకత్వంలో వచ్చే సినిమాలు ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ తెస్తాయని తెలుసు. అయితే రాజమౌళి ఎప్పుడు డబ్బు గురించి గాని, నిర్మాణం జోలికి గాని పోలేదు. తన పనిని మాత్రమే తాను చేసుకుంటూ వెళ్లారు. ఇప్పుడు రాజమౌళి తన ట్యాలెంట్ తో కేవలం లిమిటెడ్ రెమ్యూనిరేషన్ మాత్రమే కాకుండా, భారీ ఎత్తున సంపాదించాలని అనుకుంటున్నారట. యమదొంగ సినిమా టైం లో తాను ఒక సంస్థని రిజిస్ట్రేషన్ చేసుకున్నారట గాని, అయినా నిర్మాణం జోలికి ఇంత వరకు పోలేదు. కానీ ఇప్పుడు మాత్రం నెక్స్ట్ మహేష్ బాబు తో తియ్యబోయే సినిమాకి తాను ఒక ప్రొడ్యూసర్ అవ్వాలని అనుకుంటున్నారట. అసలు తన పనిని దైవంగా భావించి పని చేయడం.. అంటే క్వాలిటీ గురించి తప్ప క్వాన్టిటీ గురించి ఆలోచించని రాజమౌళి లో ఈ కోణం కూడా దాగి ఉందా అని అందరూ షాక్ అవుతున్నారు. దర్శకుడిగా ఒక చరిత్ర సృష్టించిన రాజమౌళి, మరి నిర్మాతగా ఎలాంటి సెన్సేషన్స్ క్రియేట్ చేస్తాడో చూద్దాం..

See also  Varun Tej: ఆత్మహత్య చేసుకోవాలనుకున్న నాగబాబు ఆ విషయం తెలుసుకున్న వరుణ్ తేజ్ చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు.