Rajamouli Birthday : తెలుగు సినిమా ఇండస్ట్రీని తెలుగు వాళ్ళు మాత్రమే కాకుండా భారతదేశం, యావత్ ప్రపంచం కూడా ఉలిక్కిపడి చూసేంతగా గొప్ప స్థానంలో నిలబెట్టిన గొప్ప దర్శకుడు రాజమౌళి. రాజమౌళిని ఒక మామూలు ( Rajamouli Birthday special ) దర్శకుడిగా చూడకూడదు ఆయనలో ఎన్నో కోణాలు ఉన్నాయి. ఒక్క ఫ్లాప్ సినిమా కూడా ఆయన కెరీర్లో లేకుండా చూసుకున్న దర్శకుడు. ఈరోజు రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు అందరూ మాత్రమే కాకుండా.. సినీ ప్రపంచం అంతా కూడా ఒక్కసారిగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇలాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి దొరకడం నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం గర్వించదగ్గ విషయం.
రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవితంలో అనేక నిజాలను, అనేక జరిగిన సంఘటనలను, ఆయన ఆలోచనలను ఒకసారి నెమరువేసుకుంటున్నారు నేటిజనులంతా. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో ఆయన కెరీర్ ని సినిమా ఇండస్ట్రీలో మొదలుపెట్టి.. ఆ మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ చేసుకున్నాడు. కానీ ఆ సినిమా ( Rajamouli Birthday special ) సక్సెస్ అయినా కూడా పేరు మాత్రం రాజమౌళికి రాకుండా.. రాఘవేంద్రరావు గారి పరివేక్షణలో జరగడం వలన ఆ పేరు రాఘవేంద్రరావు గారికి వెళ్లిపోయింది. ఆ తర్వాత సింహాద్రి సినిమాతో రాజమౌళి పేరు ఒక్కసారి మారుమ్రోగింది. సై సినిమాతో ఒక కొత్తరకం ఆటను చూపించి అందరిని ఆకట్టుకున్నాడు. చత్రపతి సినిమాతో ప్రభాస్ కి తగ్గ కథ ఇలాంటిది అని నిరూపించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.
ఎంతోకాలంగా అట్టర్ ఫ్లాప్స్ తో బాధపడుతున్న రవితేజ కి విక్రమార్కుడు సినిమా ఇచ్చి ఒక పోలీస్ ఆఫీసర్ ని ఎలా చూపించాలో అలా చూపించాడు. యమదొంగ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ ని సన్నగా నాజుగ్గా చూపించి.. సినిమాని ఒకరకంగా ( Rajamouli Birthday special ) కేక పెట్టించాడు. మగధీర సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద అందరి కళ్ళు పడేలా చేశాడు. మర్యాద రామన్న సినిమాతో.. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలి, కిందకి చూడాలన్నట్టు.. ఒక చిన్న సినిమాను కూడా సక్సెస్ చేసి చూపించాడు. ఈగ సినిమాతో ఒక సినిమా సక్సెస్ అవ్వడానికి కావాల్సింది హీరో, హీరోయిన్ మాత్రమే కాదు ఆ సినిమా దర్శకుడు ఆలోచన, ప్రతిభను బట్టి ఆ సినిమా సక్సెస్ అవుతుందని చూపించాడు.
ఇక బాహుబలి సినిమాతో సినిమా ఇండస్ట్రీలో బాహుబలి ముందు బాహుబలి తర్వాత అనే స్థాయికి తీసుకెళ్లాడు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ నిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఆస్కార్ అవార్డు ని తీసుకుని వచ్చాడు. ఇంత గొప్ప దర్శకుడు పుట్టినరోజు ఈరోజుని అందరూ ఎంతో ఆనందంగా, గర్వంగా ఫీల్ అవుతున్నారు. రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా వీటన్నిటిని అందరూ గుర్తు చేసుకుంటున్నారు. ఇక ఇన్ని సక్సెస్ లను అందుకున్న రాజమౌళికి ఆస్తులు విలువ ఎంతుంది అనేది కూడా అనేక వార్తలు వస్తున్నాయి. రాజమౌళి ఇప్పటికే 200 కోట్ల దగ్గర ఆస్తులు ఉంటాయని అంచనాలు అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజమో తెలియదు గాని ఆయన ఆస్తిని డబ్బుతో పోల్చెకంటే.. ఆయన సక్సెస్ లే ఒక పెద్ద ఆస్తి.. ఎవరు దోచుకోలేనిది, ఆయన దాచుకోలేనిది..