
SSMB29 : సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆయన అభిమానులు అందరూ ఎంతో ఆనందంగా పండగలా ఈ వేడుకను చేసుకుంటున్నార. మహేష్ బాబు హీరోగా, శ్రీలీల హీరోయిన్గా, త్రివిక్రమ్ దర్శకత్వంలో ( Mahesh Babu SSMB29 birthday ) రూపొందుతున్న గుంటూరు కారం నెక్స్ట్ రాబోయే సినిమా. ఈ సినిమాపై మహేష్ అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా పూర్తి కాగానే నెక్స్ట్ మహేష్ బాబు ప్రాజెక్ట్ రాజమౌళితో స్టార్ట్ అవ్వబోతుంది. రాజమౌళితో సినిమా అంటే అందులో నటిస్తున్న హీరో అభిమానులు అందరూ కూడా ఆ సినిమా కోసం ఎంత ఎదురు చూస్తారో కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలేదు.
మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో రాబోయే సినిమా గురించి 3d అనిమేటెడ్ వీడియో ఒకటి రిలీజ్ చేశారు. ఈ వీడియో చూస్తే ఇక మహేష్ అభిమానులు ఆనందంతో గంతేస్తున్నారు.ఎంత అద్భుతంగా ఉందంటే.. హాలీవుడ్ సినిమా చూస్తున్నట్టే ఉంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. స్టార్టింగ్ లో ( Mahesh Babu SSMB29 birthday ) ఫారెస్ట్, అది కూడా మామూలు ఫారెస్ట్ కాదు హాలీవుడ్ సినిమాల్లో చూపించే ఫారెస్ట్ చూపించి ఆకాశం మబ్బులు పొగలతో వీడియో స్టార్ట్ అయింది. అడవిలో ఒక శిల్పంలా మాత్రం ఒకటి కనిపిస్తుంది. ఆ శిల్పాన్ని మెయిన్ చాలా ఇంపార్టెంట్ గా తీశారు. ఆ తర్వాత మహేష్ బాబు పేరు ఫారెస్ట్ లో కనిపించింది. ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి పేరు వచ్చింది. ఇంకా అక్కడ నుంచి కెమెరా అడవుల పైనుంచి తీస్తూ..
కెమెరా కిందకు వెళ్లి, లోపలికి వెళ్లి ఇంకా లోపలికి వెళ్లి ఒకచోట చూపించింది అసలైన సింహాన్ని.. బుల్లెట్ మీద అటువైపుగా కూర్చొని వెనకాతల ఒక బ్యాగ్ తగిలించుకొని ఉన్న మన హీరో మహేష్ బాబు మొదట వెనకనుంచి కనిపిస్తాడు. అప్పుడు ( Mahesh Babu SSMB29 birthday ) మహేష్ కనిపించిన మహేష్ బాబు ఎదురుగా ఐరన్ డ్రెస్సులు వేసుకొని ఉన్న కొంత మంది మనుషులు పడి ఉండడం చూపిస్తాడు. వాళ్లందర్నీ అలా పడేసి మహేష్ బాబు ఒక రకమైన నవ్వు నవ్వుతూ కూర్చుంటాడు. ఆ నవ్వు వింటుంటే వాళ్ళని ఎంత సునాయాసంగా స్మాష్ చేసాడో అర్థమవుతుంది. ఆ తర్వాత యానిమేటెడ్ మహేష్ బాబుని ఫ్రంట్ నుంచి చూపించి.. ఇంగ్లీష్ సాంగ్ తో చూపించిన విధానం అదిరిపోయింది. మహేష్ బాబు ఫారెస్ట్ లో ఎగురుతూ..
రెండు చేతులతో రివాల్వర్ పట్టుకొని వెనకాతల ఒక పొడుగాటి గన్, ఒక బ్యాగ్ తగిలించుకొని పైకి ఎగురుతూ షూట్ చేస్తున్న ఆ యానిమేటెడ్ ఇమేజ్ చూస్తుంటే.. అభిమానుల ఆనందంతో పొంగిపోతున్నారు. ఇక సోల్జర్ అంటూ వెనకనుంచి ఇంగ్లీష్ లో వచ్చే ఆ సాంగ్ హాలీవుడ్లో మన హీరోని చూస్తుంటే ఆనందమే వేరబ్బా అనిపిస్తుంది. ఒక కొండ నుంచి ఇంకొక కొండమీదకి ఎగిరికొని వెళ్లి.. అక్కడ మళ్ళీ నిలబడి అవతల లోతుని చూస్తూ నిలబడిన మన హీరోని చూస్తే.. అసలు సినిమా ఏ రేంజ్ లో ఉంటదో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇంతకాలం రాజమౌళి సినిమాలన్నీ ఒక లెక్కైతే.. ఈ సినిమా ఒక లెక్క ఏమో అనిపిస్తుంది. ఆ లెవెల్ లో కనిపిస్తుంది. నిజంగా మహేష్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా షూటింగ్ మొదలై.. ఎప్పుడెప్పుడు దాని గురించి విశేషాలు తెలుస్తాయని ఎంతగానో ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. అలాంటిది ఈరోజు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ వీడియోని చూసి ఆనందంతో గెంతులు వేస్తున్నారు..
#MaheshBabu 3D animated motion poster.
Globetrotting forest adventure concept video🔥🔥
Process Details and YouTube Link below👇@urstrulyMahesh #HBDSuperstarMaheshBabu #SSMB29 #GunturuKaaram pic.twitter.com/4k2WluuWLE
— YASHWANTH (@maskman_studios) August 8, 2023