Home Cinema Rajamouli – Jr NTR : రాజమౌళితో జూనియర్ ఎన్టీఆర్ ఆ పాత్రలో..

Rajamouli – Jr NTR : రాజమౌళితో జూనియర్ ఎన్టీఆర్ ఆ పాత్రలో..

rajamouli-and-jr-ntr-combo-movie-planning-again-news-became-viral

Rajamouli – Jr NTR : రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్ అంటే దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి చాలా ఆతృతగా ఉంటుంది. వీళ్లిద్దరు కాంబినేషన్లో సినిమా అంటేనే ఒక సంచలనాన్ని సృష్టిస్తుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే.. ఇప్పటివరకు వీళ్ళిద్దరూ తీసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా ( Rajamouli and Jr NTR combo ) ఒక్కొక్క సినిమా ఒక్కొక్క సంచలనాన్ని క్రియేట్ చేసింది. అందుకే ఇటీవల రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంత పెద్ద సక్సెస్ ని సాధించిందో.. ఆస్కార్ అవార్డుని తెలుగు సినిమా పరిశ్రమకి తీసుకొచ్చిన ఘనత ఆ సినిమాకి దక్కింది అన్న విషయం మనందరికీ తెలిసిందే.

Jr Ntr-Rajamouli-movie

అందుకే రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్ అంటే అందరికీ అంత ఇష్టం. అయితే వీళ్ళిద్దరి కాంబోలో మరో సినిమా వస్తుందని.. పైగా ఆ సినిమా ఎన్టీఆర్ పాత్ర చాలా అద్భుతంగా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. రాజమౌళి నెక్స్ట్ సినిమా మహేష్ బాబుతో తీస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే. మరి ఇప్పుడు ఎన్టీఆర్ తో సినిమా ( Rajamouli and Jr NTR combo ) తీయాలంటే ఎన్ని సంవత్సరాలు గ్యాప్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారా? ఇంతకీ అసలు సంగతి ఏంటో తెలుసుకుందాం.. రాజమౌళి మేడ్ ఇన్ ఇండియా సినిమాకి సమర్పితుడుగా వ్యవహరిస్తున్నాడు. ఈ విషయాన్ని రాజమౌళి అధికారకంగా కూడా తెలియపరచడం జరిగింది.

See also  Raashii Khanna: బడా ఫ్యామిలీకి కోడలుగా వెళ్ళవలసిన రాశీ ఖన్నా ఆ హీరో ప్రేమ వల్లే మోసపోయిందా.?

Jr Ntr-Rajamouli-combo-movie-news

మేడిన్ ఇండియా సినిమాకి నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాకి రాజమౌళి సమర్పికుడిగా వ్యవహరించగా ఆయన ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ని నటించమని అడిగారంట. పైగా భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ లో ఆయన పాత్రని ఎన్టీఆర్ ని చేయమని అడిగారంట. రాజమౌళి అడిగితే ఎన్టీఆర్ నో అనే ప్రసక్తే లేదు. వీళ్ళిద్దరి మధ్య అంత మంచి అనుబంధం ఉంది. అందుకనే ( Rajamouli and Jr NTR combo ) కచ్చితంగా ఎన్టీఆర్ ఆ పాత్రని చేస్తాడని.. పైగా ఆ పాత్రను ఎన్టీఆర్ ఫ్రీగా చేస్తున్నాడని.. ఒక రూపాయి కూడా రెమ్యూనిరేషన్ తీసుకోకుండా చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంతవరకు నిజమందో తెలియదు గానీ.. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ఆ సినిమా అదిరిపోయే ఎలాంటి రికార్డుని, ఎలాంటి అవార్డ్స్ ని తెచ్చి పెడుతుందో కూడా ఊహించలేము..

See also  Samyuktha Menon : ఆ సీన్స్ లో మితిమీరిపోతున్న సంయుక్త మీనన్ ఫొటోస్ వైరల్!

Jr Ntr-Rajamouli-latest-movie

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో జాహ్నవి కపూర్ హీరోయిన్గా, జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిస్తున్న ఈ సినిమాపై ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఈ సినిమాపై నందమూరి అభిమానులకు భారీ అంచనాలతో పాటు విశేషమైన అవార్డును ఖచ్చితంగా తీసుకొస్తుందని నమ్మకం ఉంది. ఇదిలా ఉంటె.. రాజమౌళి తన నెక్స్ట్ సినిమా మహేష్ తో చేయడానికి.. ఆ సినిమాకి కావాల్సిన కథని అన్నిటిని రెడీ చేసుకుంటూ.. చాలా బాగా ప్రిపేర్ అవుతున్నాడు. ఆయన ఈసారి మరి ఎలాంటి అద్భుతాలను సృష్టిస్తాడో .. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎంత గొప్పగా తలెత్తి చూస్తుందో అని అందరూ ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబుతో కచ్చితంగా ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమాకి గొప్ప పేరు వచ్చేలా చేస్తాడని అందరూ నమ్ముతున్నారు..