Rajamouli – Jhanvi Kapoor:తెలుగు సినిమా రంగాన్ని ఒక మెట్టు కాదు, పది మెట్లు పైకి ఒకేసారిగా తీసుకుని వెళ్లిన ప్రతిభావంతుడు రాజమౌళి గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు కానీ, ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. హీరోలని మించిన ఈ హీరో ఎక్కడ ఉంటె అక్కడ అందరికీ గర్వకారణంగానే ఉంటాది. అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీకి అందాల అతిలోక సుందరి శ్రీదేవి, కేవలం తెలుగు ఇండస్ట్రీతో ఆగకుండా బాలీవుడ్ లో కూడా గట్టిగా పాదాన్ని మోపి, కపూర్ ఇంటిపేరుని సొంతం చేసుకున్న గొప్ప నటి. ఆమె కూతరు జాన్వీ కపూర్ కూడా మనందరికీ పరిచయమే. జాన్వీ కపూర్ ఇప్పటివరకు హిందీ సినిమాలు మాత్రమే నటించినా కూడా మన తెలుగు కుర్రాళ్ళు ఎందరో ఆమెకి అభిమానులు ఉండటానికి కారణమేమిటంటే.. ఆమె బాక్ గ్రౌండ్ అలాంటిది.
జూనియర్ ఎన్టీఆర్ 30 వ సినిమా కొరటాలశివ దర్శకత్వంలో ఇప్పుడు మొదలువుతాది, అప్పుడు మొదలవుతాది అంటూ ఎన్నో రోజులుగా ఊరిస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు సినిమాని పూజ చేసి మొదలు పెట్టారు. ఈ సినిమా ( Rajamouli and Jhanvi Kapoor in NTR 30 movie opening function ) ప్రారంభానికి కొరటాల శివ, నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్, దర్శకులు రాజమౌళి, ప్రశాంత్ నీల్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న జాన్వీకపూర్, ప్రకాష్ రాజ్ శ్రీకాంత్‌తో పాటు ఇండస్ట్రీకి చెందిన అతిరథ మహారథులు కూడా వచ్చారు. ఈ కార్యక్రమంలో రాజమౌళి, జాన్వికపూర్ హైలెట్ గా నిలిచారు. ఎందుకంటే మొదటి సారిగా తెలుగులో నటిస్తున్న జాన్వీ పై ఎలాగూ అట్రాక్షన్ ఉంటాది, అలాగే ఎంతో రిజర్వ్డ్ గా ఉండే రాజమౌళి జాన్వీ కపూర్ తో చాలాసేపు మాట్లాడటం పై మీడియా వాళ్ళు కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టారు.
అంతే కాదు వాళ్ళిద్దరి మధ్య సంభాషణ మాత్రమే కాకుండా అందరి ఎదురుగా రాజమౌళి జాన్వీ కపూర్ తో కాగితం పై సంతకం పెట్టించుకున్నాడు. అది చూసిన నెటిజనులు అనేక రకాలుగా ఊహించుకుంటున్నారు. రాజమౌళి నెక్స్ట్ సినిమా మహేష్ బాబు లో చేస్తున్న సంగతి తెలిసినదే. మహేష్ బాబు సినిమాలో, జాన్వీ కపూర్ ని ( Rajamouli and Jhanvi Kapoor in NTR 30 movie opening function ) హీరోయిన్ గా ఒప్పించి.. అక్కడికక్కడే సంతకం తీసుకున్నాడని వార్తలు హల్చల్ చేశాయి. అసలు ఒక ఆర్టిస్ట్ తాను ఏదైనా సినిమాకి ఒప్పుకోవాలంటే, తన డేట్స్ ఎప్పుడెప్పుడు ఎలా ఖాళి ఉన్నాయో లేదో చూసుకోవడనికి ఒకరు ఉంటారు. వాళ్ళని అడిగి ఆ తరవాత ప్రామిస్ చేస్తారు. అలాంటిది జాన్వీ కపూర్ అక్కడికక్కడే ఎలా డిసైడ్ అయ్యి సైన్ చేసేసింది అని అనుకున్నారు. అసలు నిజానికి వస్తే జాన్వీ సినిమా కోసం సంతకం చేయలేదు.
జాన్వీ కపూర్ కి రాజమౌళి కూతురు పెద్ద ఫ్యాన్ అంట. అందుకని తన కూతురు జాన్వీ కపూర్ ఆటోగ్రాఫ్ తీసుకుని రమ్మని రాజమౌళి కి చెప్పిందట. అందుకని రాజమౌళి జాన్వీ కపూర్ ని ఆటోగ్రాఫ్ అడగ్గా, కేవలం సంతకం పెట్టకుండా.. రాజమౌళి కూతురు పేరుతో మంచి కొటేషన్ రాసి మరీ సంతకం పెట్టి రాజమౌళి కి సర్ప్రైజ్ ఇచ్చిందట. ఆ ఆనందంలో రాజమౌళి జాన్వీ కపూర్ తో చాలాసేపు మాట్లాడుతూ.. ఆమె తల కొట్టుకుని నవ్వెంతగా జక్కన్న ఎంటర్టైన్ చేసాడు.