Home Cinema Rajamouli: రాజమౌళి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఆ ఏకైక సినిమాలో స్పెషల్ ఏమిటో తెలుసా?

Rajamouli: రాజమౌళి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఆ ఏకైక సినిమాలో స్పెషల్ ఏమిటో తెలుసా?

rajamouli-acted-as-a-child-artist-the-movie-was-not-released-for-that-reason

Rajamouli: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలుగుతున్న రాజమౌళి గురించి తెలియని వాళ్లంటూ ఎవరూ ఉండరు. తెలుగు సినీ రచయిత కె వి విజయేంద్ర ప్రసాద్ కొడుకుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా అడుగుపెట్టిన ( Rajamouli acted as a child artist ) రాజమౌళి అంటే ఇష్టం లేని వాళ్ళు అంటూ ఉండదేమో. ఒక్క సినిమా కూడా ఫెయిల్యూర్ అనే ప్రసక్తి లేకుండా ఇంతవరకు తన కెరీర్ ని నడిపించిన గొప్ప దర్శకుడు రాజమౌళి. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో 2001లో తన కెరీర్ ని మొదలుపెట్టిన రాజమౌళి.. ఇప్పటివరకు ప్రతి సినిమా అంతకు ముందు సినిమా కంటే ఇంకొంచెం బెటర్ పోసిషన్ లోకి తీసుకెళ్తూ సినిమాలు తీసిన దర్శకధీరుడు రాజమౌళి.

See also  Vijay Devarakonda : తన రెమ్యూనరేషన్ నుండి కోటి రూపాయిలు వారికి ఇవ్వనున్న విజయ్ దేవారకొండ..

Rajamouli-acted-as-a-child-artist

రాజమౌళి అంటే ఇప్పుడు కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీకి మాత్రమే కాదు యావత్ భారతదేశం సినీ ఇండస్ట్రీ తో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా పేరు సంపాదించుకున్న దర్శకుడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా సినిమా ని తయారుచేసి.. తెలుగు సినిమా ( Rajamouli acted as a child artist ) ఇండస్ట్రీ మొత్తం యావత్ భారతదేశం గర్వించేలా చేసిన దర్శకుడు రాజమౌళి. అలాగే ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ వ్యాప్తంగా ఖ్యాతిని తీసుకొచ్చి.. ఆస్కార్ అవార్డును ఇక్కడ వరకు తీసుకువచ్చిన గొప్ప దర్శకుడు రాజమౌళి. ఇలా రాజమౌళి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువగానే అనిపిస్తుంది.

Rajamouli-acted-as-a-child-artist

అయితే రాజమౌళి చిన్నతనంలోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా, సినిమాలో నటించిన సంగతి చాలామందికి తెలియదు. అవును రాజమౌళి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒక సినిమాలో నటించాడు. ఆ సినిమా పేరు పిల్లనగ్రోవి. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఈ సినిమాను నిర్మించగా, ఆయన సోదరుడు రచయిత శివశక్తి దత్త దర్శకత్వం వహించారు. ఈ సినిమా ( Rajamouli acted as a child artist ) ఓ బ్రాహ్మణ సాంప్రదాయ కుటుంబంలో చిన్నపిల్లల చుట్టూ ఉండే కథ. ఇది అప్పట్లోనే అంత మంచి కథను రాసుకొని సినిమాను మొదలుపెట్టి.. కానీ ఆ సినిమాను పూర్తిగా రిలీజ్ చేయలేకపోయారు. ఈ సినిమాలో ప్రధాన పాత్రను పోషించారు. పోషించిన వారు ఎవరంటే.. రాజమౌళి, ఆయన కజిన్ శ్రీలేఖ, నిర్మలమ్మ, సోమయాజులు. ఈ సినిమా షూటింగ్ మొత్తం పశ్చిమగోదావరి జిల్లాలో కొవ్వూరు సరసన ప్రాంతాల్లో జరిగింది.

See also  Samantha: సమంత అమెరికా వెళ్ళింది ఇందుకా.. మాయో సైటిస్ అనే వంకతో ఆమె చేస్తున్న పనులు ఇవా..

Rajamouli-acted-as-child-artist

ఎంతో మంచి సంకల్పంతో అద్భుతంగా కథను రాసుకొని సినిమా తీసినా గాని.. డబ్బులు చేతిలో లేక.. ఈ సినిమాని పూర్తిగా చేయలేక విడుదల చేయలేకపోయారు. ఈ సినిమా చేసేటప్పుడు రాజమౌళి వయసు పది సంవత్సరాలు మాత్రమే. అలా రాజమౌళి నటనతో సినిమా రంగంలో అడుగుపెట్టి చిన్నప్పుడు అనుకోని కారణం వల్ల.. డబ్బు లేక, సినిమా రిలీజ్ కాక రాజమౌళి నటుడు కాలేకపోయాడు. లేదంటే రాజమౌళి నటుడుగా ఎలా రాణించి ఉండేవాడో చూద్దుము. అయితే రాజమౌళి నటుడు కాలేకపోయినా.. దర్శకుడయ్యి.. ఎందరో నటులను జక్కన్నలా చెక్కేస్తున్నాడు. అలాగే ఇప్పుడు రాజమౌళి నెక్స్ట్ సినిమా.. మహేష్ బాబుతో చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాపై మహేష్ అభిమానులు అందరూ భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు.