Home Cinema RRR OSCAR SPECIAL: నాటు నాటు పాటకు రాహుల్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడో తెలుసా..??

RRR OSCAR SPECIAL: నాటు నాటు పాటకు రాహుల్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడో తెలుసా..??

Rahul Sipliganj Remuneration: మొత్తానికి 130 కోట్ల మంది అభిమానులు ఎదురుచూస్తున్న కల నెరవేరింది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించినటువంటి సినిమా ఆర్ ఆర్ ఆర్ కు ఆస్కార్ అవార్డు దక్కింది. భారతీయ చలనచిత్ర రంగంలో ఇంతవరకు ఏ సినిమా అందుకొని అరుదైన ఘనతను సాధించుకుంది రాజమౌళి నిర్మించినటువంటి ఆర్ ఆర్ ఆర్. ఇదే క్రమంలో ఆస్కార్ నామినేషన్లో ఒరిజినల్ సాంగ్ విభాగంలో రాహుల్ సిప్లిగంజ్ అలాగే కాలభైరవ పాడిన నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్ ఫైనల్ లిస్ట్ లోకి ఎంటర్ అయ్యి మొత్తానికి ఫైనల్ గా ఆస్కార్ అవార్డు కూడా దక్కించుకుంది..

rahul-sipliganj-remuneration-for-naatu-naatu-rrr-oscar-winning-song

అంతేకాక మొట్టమొదటిసారి ఆస్కార్ చరిత్రలోనే ఇండియన్ లైవ్ సాంగ్ పెర్ఫార్మెన్స్ ఆస్కార్ స్టేజ్ పై ఇవ్వడం ఎంతో సంచలనంగా మారింది.. నాటు నాటు పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్ అలాగే కాలభైరవ పేర్లు ప్రపంచం మొత్తం దద్దరిల్లి పోతున్నాయి. రాజమౌళి నిజానికి ఈ పాట సాంగ్ లిరిక్స్ విన్నప్పుడే ఇది సూపర్ డూపర్ అవుతుందని అనుకున్నాడట.. అంతేకాక మరీ ముఖ్యంగా సాంగ్ కొరియోగ్రఫీ టైంలో కూడా రాజమౌళి పాటపై ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు.. మొత్తానికి చివరగా రాజమౌళి అనుకున్నదే జరిగింది.

See also  Niharika : నిహారిక తన విడాకుల విషయాన్ని ఇప్పుడు బయట పెట్టడానికి అసలు కారణం అదంట..

rahul-sipliganj-remuneration-for-naatu-naatu-rrr-oscar-winning-song

ఇక రాహుల్ విషయానికొస్తే పుట్టింది ,పెరిగింది, పక్కా లోకల్ హైదరాబాద్.. చిన్నతనం నుంచే తనకు పాటలు పాడటం అంతే ఎంతో ఇష్టం.. వృత్తిరీత్యా తన తండ్రి సెలూన్ నడిపేవాడు. తల్లి గృహిణి. రాహుల్ సిప్లిగంజ్ కి ఒక చెల్లి, ఒక తమ్ముడు ఉన్నాడు. ఇంత పెద్ద సింగర్ అవుతానని ఎప్పుడు అనుకోలేదు. తన తల్లిదండ్రులు బాగానే చదివించారు. కానీ మొత్తానికి తాను ఇవాళ ప్రపంచంలో అతి పెద్ద అవార్డు అయినటువంటి ఆస్కార్ అవార్డు పొందడానికి తాను పాడిన పాట కారణమైంది. అదే కాకుండా అంత పెద్ద స్టేజిపై మన తెలుగు పాట పాడి ఇవాళ అందరికి గొప్ప పేరు తీసుకొచ్చాడు అందరికీ.. దీంతో రాహుల్ సిప్లిగంజ్ నా కొడుకు ఆస్కార్ వేదిక మీద పాట పాడుతుంటే గొప్పగా ఉందని తన తండ్రి తెలిపాడు.

See also  Niharika : అప్పుడు నిహారిక కోరుకున్న నాగ చైతన్యతో వద్దన్న నాగబాబు ఇప్పుడేమంటాడో?

rahul-sipliganj-remuneration-for-naatu-naatu-rrr-oscar-winning-song

కాగా మనకు ఉన్న సమాచారం ప్రకారం.. ఈ పాటను పాడినటువంటి రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipliganj Remuneration) గాని అలాగే కాలభైరవ ఒక్కొక్కరు ఈ పాట పాడినందుకు దాదాపు 5 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నారట. అన్ని వేల కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా కు పాట పాడిన ఈ సింగర్స్ కేవలం ఐదు లక్షల వేతనం తీసుకోవడం ఏంటని ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలమైన హాట్ టాపిక్ గా మారింది.. వేచి చూద్దాం.. మరి రాజమౌళి ఆస్కార్ అవార్డు అందుకున్న సందర్భంగా ఈ టీంకు ఎలాంటి బోనస్ ఇవ్వనున్నాడో తొందర్లోనే తెలియబోతుంది.