Home Cinema Pushpa 2 : పుష్ప 2 స్టోరీ రివీల్. ఇందులో కట్టప్ప లాంటి క్యారెక్టర్.

Pushpa 2 : పుష్ప 2 స్టోరీ రివీల్. ఇందులో కట్టప్ప లాంటి క్యారెక్టర్.

Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక హీరోయిన్ గా సుకుమార్ దర్శకతంలో వచ్చిన పుష్ప పాన్ ఇండియా సినిమాగా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పడు ఇదే కాంబినేషన్ లో పుష్ప 2 తీస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు అల్లు అర్జున్ పుట్టినరోజు ( Pushpa 2 Story Reveal. It has a character like Kattappa ) సందర్భంగా, ముందురోజు పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది అనుకున్న స్థాయి కంటే ఎక్కువ ఆదరణ పొందింది. నార్త్ సైడ్ అయితే ఈ ట్రైలర్ ఇంకా బాగా చూస్తున్నారు. పోస్టర్ ద్వారా ఈ సినిమా స్టోరీని నెటిజనులు ఇమాజిన్ చేసుకుని అనేకమంది రాస్తున్నారు.

See also  Naga Chaitanya: ఆ హీరోయిన్ పై తన మనసులో ఉన్న ఫీలింగ్స్ ని బయటపెట్టిన చైతు..

pushpa-2-story-reveal-it-has-a-character-like-kattappa

పుష్ప మొదటి భాగంలో పోలీస్‌ అధికారి భన్వర్‌ సింగ్‌ షేకావత్‌తో గొడవ పడి, వాడిని బాగా అవమానించి, వార్ట్నింగ్ ఇచ్చి.. తిన్నగా ఇంటికి వచ్చి రష్మికని పెళ్లి చేసుకుంటాడు. పోలీస్‌ అధికారి భన్వర్‌ సింగ్‌ షేకావత్‌ కూడా గట్టిగా రిటర్న్ పగ ఎప్పటికైనా తీర్చుకుంటాను అన్నట్టే ఎండింగ్ ఇచ్చారు. పుష్ప 2 పోస్టర్, ట్రైలర్ చూస్తే మాత్రం కొంతవరకు సుకుమార్ స్టోరీ ని రివీల్ చేసేశాడనే అనిపిస్తుంది. రెండవ భాగంలో నెటిజనులు కథనం ప్రకారం.. ( Pushpa 2 Story Reveal. It has a character like Kattappa ).

See also  Samantha: ఆ హీరో కోసం సినిమాలో అలా కనిపించేందుకు ఓకే చెప్పేసిన సమంత.. మరీ బరితెగించేసిందింగా..

pushpa-2-story-reveal-it-has-a-character-like-kattappa

పుష్ప 2 లో పవర్ ఫుల్ గా పుష్పరాజ్ ఎలా ఎదుగుతాడో, ఏ స్థాయికి వెళ్లిపోతాడో, జనాలు ఏస్థాయిలో ఆరాధిస్తారో టీజర్ మూవీ టీం చూపింది. అయితే ఈస్థాయిలో పబ్లిక్ లో కూడా ఎదిగిన పుష్పరాజ్ ని పోలీసులు పట్టుకోవాలి అంటే.. షేకావత్ సార్ పగ తీరాలి అంటే… పుష్పరాజ్ కి దగ్గరగా ఉన్నవాళ్లే నమ్మక ద్రోహం చేయాలి.. లేని పక్షంలో పబ్లిక్ లో ఒక పెద్ద లీడర్ స్థాయి వ్యక్తి ని అరెస్ట్ చేయడం అంత ఈజీ కాదు. పైగా పుష్ప మొదటి పార్ట్ లో కేశవనే స్టోరీ చెప్పడం, పుష్ప పక్కనే కేశవ ఉండటం చూపించారు.

See also  Mega Family : ఈ ఫోటో లో ఆ ఒక్క పర్సన్ మిస్సింగ్.. ఎవరో చెప్పగలరా?

pushpa-2-story-reveal-it-has-a-character-like-kattappa

కేశవ కి ఒక ఫ్యామిలీ ఉన్నట్టు, ఆ ఫామిలీ కి 10 లక్షలు రూపాయలు డబ్బులు కూడా కావాలి అన్నట్టు చూపారు.. డబ్బు కోసం గానీ లేక ఫామిలీ కోసం గానీ కేశవ షేకావత్ కి లొంగి పోయి పుష్ప ని వెన్నుపోటు పొడస్తాడు అంట.. అందుకే పుష్ప 2 టీజర్ లో కేశవ ఎక్కడ కనపడలేదు.. పైగా ముందు నుండి కూడా కేశవ క్యారక్టర్ విషయంలో ఎన్నో అనుమానాలు ప్రేక్షకులుకి ఉన్నాయి. ఇలా పుష్ప 2 స్టోరీ లో కట్టప్ప పాత్ర కూడా సుకుమార్ పెట్టాడంటూ నెటిజనులు కామెంట్ చేస్తున్నారు.