Home Cinema లీడర్ చిత్రంలో హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడు ఏ రేంజ్ లో తయారయ్యిందంటే..

లీడర్ చిత్రంలో హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడు ఏ రేంజ్ లో తయారయ్యిందంటే..

priya-anand-from-rana-daggubati-leader-movie-is-looking-so-different-now

కొంతమంది హీరోయిన్స్ ని చూడగానే అబ్బా ఎంత బాగుందో, భవిష్యత్తులో ఈమె ఇండస్ట్రీ లో టాప్ రేంజ్ కి వెళ్ళిపోతుంది అని అనుకుంటూ ఉంటాము. కానీ వాళ్ళు కొన్నాళ్ళకు మాయం అయిపోతుంటారు. ఎవరెవరో ఇండస్ట్రీ కి వచ్చి నేడు పెద్ద పెద్ద అవకాశాలను సంపాదిస్తున్నారు, వీళ్ళకి ఏమైంది? చక్కగా అందంగా ఉంటారు, యాక్టింగ్ కూడా బాగుంటుంది అని మీ మనసులో ఎన్నోసార్లు అనిపించి కూడా ఉండొచ్చు. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు ప్రియా ఆనంద్(Priya Anand Leader Movie). ఈమె 2009 వ సంవత్సరంలో ‘వామనన్’ అనే తమిళ సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది.

See also  Keerthy Suresh: డబ్బు కోసం.. ఛీ ఛీ కీర్తీ సురేష్ మరీ అంతకు బరి తెగించిందా.??

ఆ తరవాత వెంటనే మరో తమిళ సినిమాలో నటించింది కానీ, అనుకున్న స్థాయిలో సక్సెస్ ని గుర్తింపుని అందుకోలేదు. అలాంటి సమయంలోనే ఆమెకి శేఖర్ కమ్ముల నుండి కాల్ వచ్చింది. ఆయన రానా దగ్గుపాటి తో చేస్తున్న ‘లీడర్’ సినిమాలో ఈమెకి సెకండ్ హీరోయిన్ రోల్ ఇచ్చాడు(Priya Anand Leader Movie). సెకండ్ హీరోయిన్ రోల్ అయినప్పటికీ కూడా ప్రేక్షకులు బాగా గుర్తుపెట్టుకునేలా లాగా ఆ పాత్ర ని డిజైన్ చేయడం లో శేఖర్ కమ్ముల సక్సెస్ అయ్యాడు. ఈ సినిమా తర్వాత ప్రియా ఆనంద్ కి ‘రామ రామ కృష్ణ కృష్ణ’ , ‘కో అంటే కోటి’ వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కింది.

See also  Surekha: సురేఖ చేసింది మరీ అంత దారుణమా..? విపరీతంగా వైరల్ అవుతుంది..

అవి పెద్దగా సక్సెస్ ని సాధించలేదు. ఇక ఆ తర్వాత ఆమె హిందీ, తమిళం లో అనేక సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కింది. ఆ తర్వాత కన్నడ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమెను అక్కడి ప్రేక్షకులు స్టార్ హీరోయిన్ ని చేసారు. కన్నడ లో పవర్ స్టార్ గా పిలవబడే దివంగత పునీత్ రాజ్ కుమార్ తో కలిసి ఈమె ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఇప్పటికీ కూడా ఈమె రెగ్యులర్ గా సినిమాలు చేస్తూనే ఉంది. గత ఏడాది ఈమె తలపతి విజయ్ హీరో గా నటించిన ‘లియో’ చిత్రం లో చిన్న పాత్రలో కనిపించింది.

See also  Anasuya: అదొక్కటి తప్ప తన అంద చందాలను చూసుకోండి అంటూ ఆరబోసిన అనసూయ.

ఈ సినిమా కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. అలా ఈ హీరోయిన్ తెలుగు సినిమాలకు దూరమైనా, ఇతర భాషల్లో రెగ్యులర్ గా సినిమాలు చేస్తూనే ఉంది. ప్రస్తుతం ఆమె నటించిన వాటిల్లో సుమో అనే చిత్రం విడుదలకు సిద్ధం గా ఉంది. చూడాలి మరి భవిష్యత్తులో అయినా ఈమె తెలుగు సినిమాల్లో నటిస్తుందో లేదో అనేది.