Mahesh Babu Bag సోషల్ మీడియా వచ్చినప్పటి నుండి స్టార్ హీరోలు వాడే స్టార్ ప్రొడక్ట్స్ ఇలానే వైరల్ ఐపోతున్నాయి. సోషల్ మీడియా లేని సమయం లో మన స్టార్ హీరో లు వాడే బ్రాండెడ్ ప్రొడక్ట్స్, వారి ఖరీదైన దుస్తులు, మరియు వారి యొక్క ఖరీదైన జీవనశైలి మనకి తెలుసుకోవాలి అని ఉన్న తెలిసేవి కావు. కానీ సోషల్ మీడియా లో ఇటీవల మన స్టార్ హీరో లు జీవితం మొత్తం యిట్టే వైరల్ ఐపోతుంది. మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా రీసెంట్ గా సోషల్ మీడియా లో హుళచల్ చేస్తున్నాడు..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన అద్భుతమైన నటనకు మాత్రమే కాకుండా తన ఫ్యాషన్ సెన్స్ కూడా అద్భుతంగా పాటిస్తారు. అయితే మొన్న మహేష్ బాబు ఫారిన్ ట్రిప్ కి బయలుదేరినప్పుడు హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించాడు. మహేష్ బాబు లేటెస్ట్ సినిమా ఎస్ ఎస్ ఎం బి 28 మూవీ పోస్టర్ మనం చూసాము. ఇటీవల మహేష్ బాబు బ్రేక్ తీస్కొని భార్య నమ్రత పిల్లలు సితార మరియు గౌతమ్ తో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో కనిపించరు. అయితే మహేష్ బాబు వేసుకున్న బ్యాగ్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ ట్రెండ్ గా మారింది.(Mahesh Babu Bag)
మహేష్ బాబు ధరించిన బ్యాగు విలాసవంతమైన లూయిస్ విట్టన్ క్రిస్టోఫర్ MM బ్యాక్‌ప్యాక్ గా తెలుస్తుంది. అయితే ఈ బ్యాగు కి సంబందించిన వివరాలను మహేష్ బాబు ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. ఈ క్రిస్టోఫర్ MM బ్యాక్‌ప్యాక్ హై ఎండ్ నలుపు మరియు నీలం డిజైన్ సిగ్నేచర్ తో అందంగా కనిపిస్తుంది. ఈ బ్యాగు ఖరీదు అక్షరాల 3.92 లక్షలు! అవును, మీరు చదివింది నిజమే. మహేష్ బాబు వేసుకున్న బ్యాగ్ ఒక్కటే ఇంత ధర ఉంటె, ఇంకా మహేష్ బాబు లైఫ్‌స్టైల్ ఎలా ఉంటుందో ఆలోచిస్తే మతి పోతుంది కదా! మన సూపర్‌స్టార్ రేంజ్ ఆ మాత్రం లేకపోతే ఎలా అంటూ చాలా మంది కామెంట్స్ కూడా చేస్తున్నారు.(Mahesh Babu Bag)
మనలో చాలా మంది సాధారణ బ్యాక్‌ప్యాక్‌తో సంతృప్తి చెందుతారు, మహేష్ బాబు యొక్క లూయిస్ విట్టన్ బ్యాక్‌ప్యాక్ స్టైలిష్‌గా మాత్రమే కాకుండా డీసెంట్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది అధిక నాణ్యత పదార్థాలతో తయారు చేయబడింది. పని విషయంలో, 2024 విడుదలకు సిద్ధంగా ఉన్న ఎస్ ఎస్ ఎం బి 28లో తెలుగు సూపర్ స్టార్ త్వరలో కనిపించనున్నారు. సూపర్‌స్టార్ రాబోయే చిత్రానికి సంబంధించిన తన ఫస్ట్‌లుక్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టారు మరియు ఎస్ ఎస్ ఎం బి జనవరి 13, 2024న థియేటర్లలో విడుదలవుతుందని చెప్పారు.