Preetham: సినీ ప్రేక్షకులకు అయితే కనీసం వారంలో రెండు నుంచి మూడు రోజులకు ఏదో ఒక వార్త సమంత గురించి లేదా సమంత నాగచైతన్య ల గురించి వినిపిస్తూనే ఉంటుంది. అసలు సమంత టాపిక్ లేకుండా ఇటు ఏ న్యూస్ ఛానల్ అయినా లేదా మరదే విధంగా సోషల్ మీడియాలో కూడా ఏదైనా చిన్న వార్త వినిపిస్తే చాలు అది చాలా వైరల్ చేసేస్తుంటారు ఇటు వాళ్ళ అభిమానులు.. సినీ ప్రేక్షకులు.. ఇక తాజాగా సమంత స్టైలిష్ ప్రీతమ్ జుకాల్కర్ గారు సమంత గురించి కొన్ని ఆసక్తికరమైన షాకింగ్ కామెంట్లు చేశాడు. మనందరికీ తెలిసిందే గతంలో నాగచైతన్య సమంత విడిపోవడానికి అసలు సిసలైన కారణం..
సమంత స్టైలిష్ ప్రీతమ్ అని అతనితో ఉన్న ఎఫైర్ వల్లే నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చాడని ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తాజాగా పాల్గొన్నాడు ప్రీతమ్ ఇక ఈ విషయాలన్నిటి గురించి క్లియర్ గా క్లారిటీ తెలిపాడు. ప్రీతమ్ ఆ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ నేను సమంతతో చాలా మంచి రిలేషన్ మెయింటెయిన్ చేశాను. మా ఇద్దరి మధ్య ఉన్నది అన్నాచెల్లెళ్ల బంధం మాత్రమే కానీ చాలా మంది ఆ బంధాన్ని ఏదో రకంగా దురుద్దేశంతో అర్థం చేసుకున్నారు. ఇక మా ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ గురించి నాగచైతన్య కి కూడా చాలా బాగా తెలుసు అని తెలిపాడు.
నేను ఎన్నోసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాగచైతన్య నన్ను చాలా బాగా చూసుకునేవాడు. అయితే ఎవరైనా బాధలో ఉన్నప్పుడు మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని దాని గురించి స్పందిస్తుంటా.రు అదే విధంగా నేను కూడా సమంతకి దగ్గరయ్యాను. కానీ మా మధ్యలో ఉన్న ఈ దగ్గర బంధాన్ని చాలా మంది తప్పుగా అర్థం చేసుకునే మా ఇద్దరికీ ఏదో రకమైన ఎఫైర్ ఉందని పిచ్చి పిచ్చి రాతలు రాస్తూ వచ్చారు. ఇక ఎప్పుడైతే ఆ వార్తలన్నీ వచ్చాయో ఆ రోజు నుంచి నేను ఎంతో కోపంతో ఉన్నాను.
అసలు విషయం తెలియకుండా నోటికొచ్చినట్లు ఏది పడితే అది లేనిపోని వార్తలు ఎలా సృష్టిస్తారు అని కోపంతో రగిలిపోయాను. కానీ నేను కోప్పడితే నాకు నా మిత్రులు మీ కెరియర్ పాడవుతుందని చెప్పడంతో లోపల ఎంతగానో బాధతో చాలా కుమిలిపోయాను. బయట చెప్పలేని బాధతో చాలా బాధపడ్డానంటూ ప్రీతమ్ జుకాల్కర్ ఇంటర్వ్యూలో భాగంగా తెలిపాడు. కాగా సమంత నాగచైతన్య విడిపోయిన సమయంలో వాళ్ళిద్దరు విడిపోవడానికి అసలు సిసలైన కారణం ప్రీతమ్ జుకాల్కర్ (Preetham) అనే విషయం చాలా వైరల్ అయిన సంగతి మనమందరం చూసాం…