Pradeep Manchiraju: మన తెలుగులో బుల్లి తెరపై ప్రస్తుతం సక్సెస్ఫుల్ మేల్ యాంకర్ గా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది ఎవరని అంటే.. ఎక్కువగా వినిపించే పేరు యాంకర్ ప్రదీప్ మాచిరాజు. బుల్లి తెరపై ఎన్నో షో లలో నటిస్తూ తన నాన్సింక్ పంచులు, కామెడీతో ఆ షో ఎలాంటిదైనప్పటికీ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాడు. ఇక అక్కడి వచ్చిన ప్రేక్షకులను సైతం ఎలాంటి బోరింగ్ అనేది లేకుండా అలరిస్తూ ఉంటాడు. ఇక డీ షోలో సుడిగాలి సుదీర్ తో కలిసి ఆయన చేసిన సందడి అంతా ఇంతా కాదు. ప్రతివారం వచ్చే ఈ షో ఎవ్వరు మర్చిపోను కూడా పోరు. ఇక వీళ్ళిద్దరి కాంబినేషన్ తో ప్రతివారం స్క్రీన్ మీద కడుపుబ్బ పొట్ట చెక్కలయ్యేలా నవ్వాల్సిందే.
ఇలా తాను ఏ షోలో నటించినప్పటికీ ఆ షో ఖచ్చితంగా హిట్ అవుతుంది. అది కేవలం యాంకర్ ప్రదీప్ వళ్ళ మాత్రమే.. ఇక తన కెరీర్ విషయానికొస్తే యాంకర్ ప్రదీప్.. యాంకర్ గా, నిర్మాత గా కూడా బాగానే సంపాదిస్తున్నాడు. అయితే ప్రస్తుతం యాంకర్ ప్రదీప్ గురించి నెట్టింట ఇంట్రెస్టింగ్ వార్త తెగ వైరల్ గా మారి బొంగరంలా తిరుగుతుంది. మరి ఆ బొంగరం లా తిరిగే వార్త ఏంటి అనుకుంటున్నారా.. అదేంటంటే.? యాంకర్ ప్రదీప్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా తీయబోతున్నాడని, దానికి నిర్మాతగా వ్యవహరించబోతున్నాడని, ఇప్పటి వరకు.. పలు షోలకు నిర్మాతగా వ్యవహరించిన ప్రదీప్. ఇప్పుడు సినిమా కు నిర్మాతగా అంటే ఆశామషి వ్యవహారం కాదు.. ఎందుకంటే.
కొన్ని వందల కోట్లు పై మాట. ఇక అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే మాటలా.. మరి అలాంటి సినిమాను ప్రదీప్ నిర్మించబోతున్నాడు అన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. అంటే ప్రదీప్ షో ల ద్వారా ఎంత సంపాదిస్తున్నాడని మరొక ప్రశ్న కూడా నెట్టింట గుసగుసలు పెడుతుంది.. యాంకర్ ప్రదీప్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తాను అని చెప్పడంతో.. ఒక్కసారిగా ఇండస్ట్రీలో అందరూ షాక్ కి గురయ్యారు. ఆయన మాట్లాడిన మాటలు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా చలామణి అవుతున్నాయి. ఇక ప్రదీప్ మాచిరాజు తన కెరియర్ లో ఎన్నో షోలకి ఈ వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించాడు. ముఖ్యంగా జీ తెలుగులో ప్రసారమయ్యే కొంచెం టచ్ లో ఉంటే చెప్తా అనే ప్రోగ్రాం కి వ్యాఖ్యాతగా వ్యవహరించడమే కాకుండా..(Pradeep Manchiraju)
దానికి నిర్మాతగా కూడా ఉన్నాడు. ఆ షో తో తనకి ఎంతో మంచి గుర్తింపు లభించింది. ఇక మంచి హిట్ ఇచ్చిన చిత్రం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా ద్వారా మంచి విజయాన్ని సాధించాడు. అలా యాంకర్ ప్రదీప్ హీరోగా, ఓ యాంకర్ గానే కాకుండా మరియు నిర్మాతగా కూడా మంచి సక్సెస్ అందుకున్న వ్యక్తి.. అయితే ప్రదీప్ కు ఓ సినిమా నిర్మించాలని కోరిక ఉందట.. అది మరీ ముఖ్యంగా తన మొదటి సినిమాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోనే నిర్మిస్తానని.. ఇప్పటికి ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. ప్రస్తుతం అదే విషయం కూడా వినిపిస్తుంది. మరి అసలు విషయం ఏంటనేది.. మనకు తెలియాలంటే మరొకసారి అది ప్రదీప్ నోట నుండి మాట వస్తే కానీ అసలు విషయం అనేది మనకు తెలుస్తుంది.