Home Cinema Prabhas : మరోసారి ఆసుపత్రి పాలైన ప్రభాస్ అక్కడ సర్జరీ.. ఆందోళనలో అభిమానులు..

Prabhas : మరోసారి ఆసుపత్రి పాలైన ప్రభాస్ అక్కడ సర్జరీ.. ఆందోళనలో అభిమానులు..

బాహుబలి సిరీస్ తర్వాత టాలీవుడ్ నుండి మొట్టమొదటి పాన్ ఇండియన్ సూపర్ స్టార్ గా ప్రభాస్ కి ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత ప్రభాస్ చేసిన చేసిన మూడు సినిమాలు ఒక దానిని మించి ఒకటి అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. కానీ ఆ ఆ మూడు సినిమాలు కూడా మన టాలీవుడ్ స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాల కలెక్షన్స్ కంటే ఎక్కువ అనే చెప్పాలి. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ‘సలార్’, ‘కల్కి’ మరియు ‘స్పిరిట్’ వంటి చిత్రాలు ఉన్నాయి(Prabhas Undergoes surgery). వీటిల్లో ‘సలార్’ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధం గా ఉంది.

See also  Viswanath: విశ్వ‌నాథ్ వలన కోట్లు సంపాదించిన నటి ఎవరో తెలిస్తే షాక్ అవుతారు...

hero-prabhas

ఈ సినిమా కోసం కేవలం ప్రభాస్ అభిమానులు మాత్రమే కాదు, ఇండియా మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంది. సెప్టెంబర్ 28 వ తారీఖున విడుదల అవ్వాల్సిన ఈ సినిమా కొన్ని అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. ఇదంతా పక్కన పెడితే ప్రభాస్ కి ఇప్పుడు మేజర్ సర్జరీ జరగబోతుంది అంటూ సోషల్ మీడియా లో వినిపిస్తున్న ఒక వార్త ఇప్పుడు అభిమానులను కంగారు పెడుతుంది(Prabhas Undergoes surgery). చాలా కాలం నుండి ప్రభాస్ మోకాళ్ళ నొప్పి తో ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఆదిపురుష్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కూడా ఆయన ఆ చిత్రం లో హీరోయిన్ గా నటించిన కృతి సనన్ భుజం పట్టుకొని నడుస్తూ వచ్చాడు.

See also  Lavanya Tripathi : లావణ్య త్రిపాఠి రిసెప్షన్ లో కట్టుకున్న చీర అంత ఖరీదా?

rebel-star-prabhas

ప్రభాస్ ని అంత దీనమైన స్థితిలో చూసి అభిమానులు ఓర్చుకోలేకపోయారు. ఇప్పుడు ఆ మోకాళ్ళ నొప్పి చాలా తీవ్ర రూపం దాల్చింది అట. అందుకే ప్రధాన శస్త్ర చికిత్స కోసం ఆయన యూకె కి వెళ్లినట్టు తెలుస్తుంది. ఒక 15 రోజుల పాటు చికిత్స నిమిత్తం ఆయన అక్కడే ఉంటాడట. ఈ విషయం సోషల్ మీడియా లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారి అభిమానులను కంగారు పెడుతుంది. ప్రభాస్ సంపూర్ణ ఆరోగ్యం తో కోలుకొని మా ముందుకు రావాలి అంటూ అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. ఈ సర్జరీ తర్వాత అయినా ప్రభాస్ మునుపటి లాగ చలాకీతనం తో నడుస్తాడని ఆశిస్తున్నారు ఫ్యాన్స్.

See also  Hansika: ప్రతి రోజూ రాత్రి ఆ విషయం కోసం బలవంతం చేసేది నేనేనంటూ పచ్చిగా చెప్పుకొచ్చిన హన్సిక.

prabhas-salaar

బాహుబలి సినిమా సమయం లో కూడా ఆయనకీ భుజం విరిగి ఇలాగే ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది. ఆరోజుల్లో ఈ వార్త అభిమానులను చాలా కంగారు పెట్టేసింది. అప్పటి లాగానే ఇప్పుడు కూడా ప్రభాస్ ఈ మోకాళ్ళ సర్జరీ ని జయిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఇకపోతే సలార్ సినిమా ని మల్లి ఎపుడు రిలీజ్ చేస్తారో తెలీదు. దాని రిలీజ్ డేట్ గురించి కూడా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. సంక్రాంతికి రిలీజ్ చేస్తారు అని సోషల్ మీడియా లో కొన్ని వార్తలు ఐతే వినిపిస్తున్నాయి కానీ ఫాన్స్ మాత్రం దానికి ఏమాత్రం ఒప్పుకోవటం లేదు. అన్ని రోజులు మేము అస్సలు ఆగలేము అని ట్విట్టర్ లో లొల్లి చేస్తున్నారు.