Salaar : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా కోసం ఆయన అభిమానులు అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 22వ తేదీ ప్రభాస్ సినిమా కోసం అభిమానులు పాజిటివ్ టాక్ తో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని ( Salaar censor report ) ఆ భగవంతున్ని కోరుకుంటున్నారు. ప్రభాస్ హీరోగా, శృతిహాసన్ హీరోయిన్గా, జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్యపాత్రలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సలార్ సినిమా డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకోవడానికి గల కారణాలు ఏమిటంటే.. ఒకటి ప్రభాస్ కి ఉన్న క్రేజ్, రెండు ప్రశాంత్ నీళ్ళు సక్సెస్.
కేజిఎఫ్ సినిమాతో ప్రశాంత్ నీల్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారమనగుతుందన్న సంగతి మనందరికీ తెలిసిందే. హీరోయిన్ ఒక డిఫరెంట్ కోణంలో చూపించి కేజిఎఫ్ సినిమాని సక్సెస్ చేసుకున్నాడు. ప్రశాంత్ నీల్ ఇప్పుడు సలార్ సినిమా ( Salaar censor report ) ప్రభాస్ తో కలిసి చేసిన సినిమాపై అందరికీ అన్ని అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే రిలీజ్ అయింది. కానీ ఈ సినిమా ట్రైలర్ అయితే మాత్రం అందరిని సాటిస్ఫై చేయలేకపోయింది. ప్రభాస్ అభిమానులు కొంతవరకు సాటిస్ఫై అయినప్పటికీ.. సినీ అభిమానులు అందరూ మాత్రం సాటిస్ఫై అవ్వలేకపోయారు. ఇక ట్రైలర్ చూసి అందరూ ప్రభాస్ కంటే ఎక్కువగా ప్రశాంత నీల్ నే ఆడిపోసుకుంటున్నారు.
ఎంత కేజీఎఫ్ సినిమా హిట్ అయితే మాత్రం.. అదే కోణంలో అలాగే మళ్ళీ దీన్ని తీస్తున్నాడని, అలాగే కనిపించిందని సినిమా చూడగలమా అని చాలామంది అనేవాళ్ళు ఉన్నారు కానీ.. ఎవరేమన్నా కూడా ట్రైలర్ మాత్రం విపరీతమైన ఆదరణతో చూశారు. అయితే ట్రైలర్లో చూసిందాన్ని బట్టి సినిమాని జడ్జిమెంట్ ఇవ్వలేం. ఎందుకంటే.. సందీప్ రెడ్డి వంగ ( Salaar censor report ) తీసిన అనిమల్ సినిమా కూడా అతను ఇంటర్వ్యూలో అర్జున్ రెడ్డి పాత్రకి అనిమల్ లో హీరో పాత్రకి చాలా దగ్గర పోలికలు ఉంటాయని.. వాళ్ళ ఆటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకొచ్చాడు. అయితే అలాగే ఆ సినిమాను కూడా తీసేసాడా అని చాలామంది అనుకున్నారు. కానీ అనిమల్ సినిమా ఇంకొక కోణంలోకి తీసుకెళ్లి అందరిని సాటిస్ఫై చేసి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టుకున్నాడు దర్శకుడు.
ఇప్పుడు ప్రశాంత్ నీల్ కూడా అలాగే చేసి ఉండొచ్చు. ఆడియన్స్ కి విపరీతమైన హైప్ ని ట్రైలర్ లో క్రియేట్ చేయకుండా.. ఎందుకంటే.. ఆల్రెడీ ప్రభాస్ సినిమాల్ని హైప్ లో ఊహించుకొని వెళ్లి.. చాలా మందికి నచ్చడం లేదు. అందుకే ఇప్పుడు హైప్ ని పూర్తిగా తగ్గించి, నార్మల్గా సాదాసీదాగా చూపించి.. సినిమాని థియేటర్లోకి వెళ్ళిన తర్వాత సెన్సేషన్ క్రియేట్ చేయాలని అనుకుని ఉంటాడని చాలామంది అనుకుంటున్నారు. ఏదైనా ఈ సినిమాకి సెన్సార్ పూర్తయింది. ఈ సినిమాకి ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. అలాగే ఇక ఈ సినిమా గురించి సెన్సార్ వాళ్ళు చెబుతూ.. సినిమా స్టార్ట్ అయిన అరగంట వరకు ప్రభాస్ కనిపించడని చెప్పారు. ప్రభాస్ ఎంట్రీ సినిమా స్టార్ట్ అయిన 30ని.. తర్వాత వస్తుందంట. అలాగే సినిమా రన్ టైం కూడా 2 గంటల 55 నిమిషాల 22 సెకండ్లు అంట. అయితే ఇప్పుడు అందరికీ వచ్చిన సందేహం ఏంటంటే.. ఏ సర్టిఫికెట్ వచ్చింది అంటే పిల్లలు వెళ్లలేరు అంటే ఫ్యామిలీతో కలిసి చూడలేరు. అది పక్కన పెడితే.. 30ని.. వరకు ప్రభాస్ కనిపించడు అంటే.. ఆడియన్స్ బోర్ అయిపోతారా అని కొంతమంది భయపడుతున్నారు. ఏదైనా సినిమా రిలీజ్ అయిన తర్వాత, దాన్ని చూసిన తర్వాతే ఆ సినిమా ఎలా ఉంది అనేది కరెక్ట్ గా చెప్పుకోవాలి.