Prabhas : తెలుగు సినిమా ఇండస్ట్రీ గర్వించదగ్గ హీరో ప్రభాస్ అన్న విషయం మనందరికీ తెలిసిందే. తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసి అన్నిచోట్ల తెలుగు వాడి సత్తాని చూపించిన సినిమా బాహుబలి. ఈ సినిమా ( Prabhas movie Rajasaab latest updates ) తర్వాత ప్రభాస్ రేంజ్ ఎంత పైకి వెళ్ళిందో అందరికీ తెలుసు. అప్పటినుంచి ప్రభాస్ సినిమా అంటే ఆ స్థాయిలోనే అందరూ ఊహించుకుంటున్నారు. అలాంటి స్థాయిలోనే ప్రభాస్ సక్సెస్ను సాధించాలని ఆయన అభిమానులు ఎంతో ఆశపడుతున్నారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తొలి పాన్ ఇండియా సినిమాకి లో హీరోగా ప్రభాస్ ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయే ఘనతనే సాధించుకున్నాడు. ఆ తర్వాత ప్రభాస్ సాహో, సలార్, కల్కి మొదలగు సినిమాలో చేయడం జరిగింది.బాహుబలి తర్వాత ( Prabhas movie Rajasaab latest updates ) వచ్చిన సాహో సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత సలార్ మంచి టాక్ తెచ్చుకొని, కలెక్షన్స్ రాబట్టింది. ఇక కల్కి విషయానికి వస్తే అద్భుతమైన రిజల్ట్ నిచ్చి మంచి కలెక్షన్స్ తీసుకొచ్చింది. మధ్యలో వచ్చిన ఆదిపురుష్ సినిమా కూడా అంతగా ఎవరిని సంతృప్తి పరచలేక పోయింది. అయినప్పటికీ ప్రభాస్ క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు.
ఇకపోతే ప్రభాస్ తర్వాత సినిమాలు కూడా అంతే హైప్ లో ఉండేలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా ( Prabhas movie Rajasaab latest updates ) రూపొందించిన విషయం మనకు తెలిసిందే. ఆ సినిమా పేరు స్పిరిట్.. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్గా చేస్తున్నాడు. అలాగే హనూ రాఘవపూడి సినిమాలో కూడా సైనికుడిగా ప్రభాస్ చేస్తున్నారు. ఈ రెండు పాత్రలలో ప్రభాస్ ఎంతగా ఇమిడిపోతాడో, ఎంతగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోగలడో అంచనా వేయవచ్చు. ఇకపోతే ప్రభాస్ నటిస్తున్న చిత్రం రాజాసాబ్.. ఈ సినిమాని మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు.
రాజాసాబ్ సినిమా ఒక హర్రర్ రొమాంటిక్ కామెడీ జోనర్ లో రూపొందుతున్న సినిమా అని తెలుస్తుంది. కానీ ఇలాంటి సినిమాలను ఓటీటీ లోనే ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. హర్రర్ రొమాంటిక్ కామెడీ సినిమా లాంటి జోనర్ లో ఇంతవరకు ప్రభాస్ టచ్ చేయలేదు. ఇంత హై ఎస్టిమేషన్స్ తో ఎదురుచూస్తున్న తరుణంలో ప్రభాస్ ఇలాంటి జోనర్ ని టచ్ చేయడం కరెక్టేనా అని చాలామంది అనుకుంటున్నారు. ప్రభాస్ ఎందుకు ఇలాంటి సాహసం చేశాడని? ఇది చాలా పెద్ద రిస్క్ అని, ఈ రిస్క్ ఎవరి కోసం తీసుకున్నాడని? పైగా మారుతీ లాంటి దర్శకుడు చేతిలో ఇంత పెద్ద రిస్క్ ని పెట్టి.. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందని అందరూ అనుకుంటున్నారు. మరి చూడాలి రాజాసాబ్ సినిమాతో ప్రభాస్ చేసిన రిస్క్ ఎంతవరకు సక్సెస్ దారిలోకి తీసుకు వెళ్తుందో..