Prabhas : పాన్ ఇండియా స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్న ప్రభాస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చత్రపతి, మిర్చి ఇలాంటి సినిమాలతో తనకు ఒక స్థాయిని సంపాదించుకున్న ప్రభాస్.. బాహుబలి సినిమాతో ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆదిపురుష్ సినిమాతో ఒక మంచి అనుభూతిని సంపాదించుకున్నాడు. ఆ శ్రీరామచంద్రుడి ( Prabhas marriage fix with that girl ) పాత్రలో కనిపించడం అంటే నిజంగా ఒక అదృష్టమే.. ప్రభాస్ హీరోగా, కృతి శనన్ హీరోయిన్ గా, ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఆదిపురుష్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ నిన్న తిరుపతిలో జరిగింది. ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ వేడుకను ఎంతో ఘనంగా చేశారు. ప్రభాస్ ఆదిపురుష్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అంటూ ప్రభాస్ అభిమానులు వేయికళ్లతో ఎదురు చూశారు.
ఆదిపురుష్ ఈవెంట్ కోసం తిరుపతి వెళ్ళిన ప్రభాస్ ముందుగా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాడు. వాళ్ళ హీరో ఏడుకొండల స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళుతున్నాడు అని తెలిసి.. అక్కడ కూడా వెళ్లి ( Prabhas marriage fix with that girl ) దూరం నుంచి చేతులు ఊపారు ఫాన్స్. అభిమానులను అక్కడ చూసిన ప్రభాస్ ఆనందంతో చేతులు ఊపుతూ.. ఆ స్వామి దర్శనానికి వెళ్లి వచ్చారు. ఆ తర్వాత అక్కడ నుంచి గెస్ట్ హౌస్ కి వెళ్ళిన ప్రభాస్ ని అభిమానులను వెంబడించి.. అక్కడ కూడా ఆయన్ని చూసి ఆనందంతో ఉర్రూతలు ఊగారు. వాళ్ళని కంట్రోల్ చేయలేక పోలీసులు నానా కష్టాలు పడ్డారు. ఇదిలా ఉంటే ఈవెంట్ ఫంక్షన్ లో ఆది పురుష ఫైనల్ ట్రైలర్ రిలీజ్ చేశారు.
ఫ్యాన్స్ తో కలిసి ఆ ట్రైలర్ చూస్తూ ప్రభాస్ కూడా ఎంతో ఆనందంతో తేలుతున్నట్టు ఆయన ఫేస్ ఫీలింగ్స్ కనిపించాయి. ట్రైలర్ లో వస్తున్న ప్రభాస్ శ్రీరామచంద్రుడిగా నటిస్తూ చెప్పిన డైలాగ్స్ ని ప్రభాస్ స్టేజి మీద ట్రైలర్ చూస్తూ.. తన నోటితో ( Prabhas marriage fix with that girl ) తన డైలాగ్స్ అనుకుంటూ ఉండటం గమనార్హం. అంతగా ఆ సినిమాలో లీనమై.. ప్రతి డైలాగ్ ని, ప్రతి పార్ట్ ని ఇష్టపడుతూ ప్రభాస్ చేశాడు అన్న విషయం అర్థమవుతుంది. ఆ ట్రైలర్ అంత పెద్ద వేడుకలో అభిమానులతో కలిసి చూస్తుండగా ఆయన ముఖంలో ఆనందం, కళ్ళల్లో ఆనందభాష్పాల సందేశం కనిపిస్తుంది. ఇవన్నీ ఇలా ఉంటే ప్రభాస్ మాట్లాడుతూ ఉండగా అభిమానులు గోరుమంటూ అరుస్తూ ఉన్నారు.
ఇంతకీ వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే.. అభిమానులు మీ పెళ్లెప్పుడు పెళ్లెప్పుడు అని గట్టిగా అరవడం మొదలుపెట్టారు. వాళ్ళ అరుపుల విన్న ప్రభాస్ చిరునవ్వు నవ్వి పెళ్లేగా ఇక్కడే తిరుమలలోనే చేసుకుంటాను లేండి అని సమాధానం ఇచ్చాడు. అంతే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రభాస్ తిరుమలలోనే పెళ్లి చేసుకుంటాను అన్నాడు అంటే ప్లేస్ అయితే ఫిక్స్ అయిపోయింది. తిరుమలలో దేవుడు సన్నిధిలో పెళ్లి చేసుకోవడం అంటే మన ఆచారాల మీద, వేంకటేశ్వరస్వామి మీద.. ఇలవేల్పుగా బాగా భక్తి అలవాటు ఉన్న అమ్మాయి అయి ఉంటుందని.. అంటే కచ్చితంగా తెలుగమ్మాయి అయి ఉంటుందని.. ఏ బాలీవుడ్, హాలీవుడ్ హీరోయిన్స్ ని తీసుకురాడని.. తెలుగు అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడని.. అది తిరుమల లోనే చేసుకుంటాడని.. ప్రభాస్ చెప్పేసాడని అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు.