Home Cinema Prabhas Adipurush: అంచనాలు పెంచుతున్న ప్రభాస్ ఆదిపురుష్ మోషన్ టీజర్.. నయా అప్డేట్ తో టీమ్..

Prabhas Adipurush: అంచనాలు పెంచుతున్న ప్రభాస్ ఆదిపురుష్ మోషన్ టీజర్.. నయా అప్డేట్ తో టీమ్..

Adipurush Motion Teaser: ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఆదిపురుష్ షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు రెడీ అవుతుంది. ఈ చిత్రంలో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ రాముడిగా ప్రముఖ పాత్రలో నటిస్తున్నాడు మరియు సీతగా ఆయన సరసన కీర్తి సనన్ నటిస్తుంది. ఆదిపురుష్ మొదటి గ్లిమ్ప్స్ వచ్చినపుడు ప్రభాస్ అభిమానులు నిరాశ పడ్డారు. VFX మరియు టేకింగ్ బాలేదని ఆ టీజర్ కు చాల నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

Adipurush-Motion-Teaser

సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు దర్శకుడు ఓం రౌత్ ని విపరీతంగా ట్రోల్ చేస్తూ పోస్టులు మరియు కామెంట్లు చేసారు. ఇలా జరగడంతో దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమా పట్ల ఎక్కువ దృష్టి పెట్టి మళ్ళీ సీన్ లను రీటేక్ చేసారని సినీ ఇండస్ట్రీలో ఓ వార్త మారుమోగుతోంది. ఫస్ట్ టీజర్ నచ్చకపోవడంతో సినిమాకు నెగిటివిటీ ఎక్కువ అవ్వడంతో దర్శకుడు ప్రెషర్ లో ఉన్నట్లు తెలిసింది. అయన తరువాత రిలీజ్ అయ్యే టీజర్, సాంగ్స్ మరియు మెయిన్ ట్రైలర్ పై సంపూర్ణ దృష్టి పెట్టాడు.

See also  Anushka Shetty: అనుష్క ఆ వ్యాధి కారణంగా లావెక్కిందా.??

Adipurush-Motion-Teaser

ఈ మధ్య విడుదలైన పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనితో ఫాన్స్ కొంత కుదుట పడ్డారు. అయితే శుక్రవారం రోజు ప్రభాస్ ఫోటోతో ఒక మోషన్ పోస్టర్ రిలీజ్ చేసారు ఆదిపురుష్ టీమ్. ఆ మోషన్ టీజర్ అందరిని మెప్పిచింది. VFX మరియు రోమాలు నిక్కపొడిచేలా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ తో ప్రభాస్ ని చూస్తుంటే అయన అభిమానులు సంతొషంలో మునిగిపోయారు. “సారీ ఓం రౌత్” అని ఒక అభిమాని సోషల్ మీడియా ప్లాట్ఫారం ద్వారా ఆయనకు క్షమాపనులు తెలిపారు మరియు సినిమా కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాము అని రాసారు.

See also  Asnushka: ప్రభాస్‌కు అనుష్క పెట్టిన ముద్దుపేరు గురించి మీకు తెలుసా.?

Adipurush-Motion-Teaser

ఆదిపురుష్ సినిమా జూన్ లో విడుదలకు రెడీ అయింది మరియు ఇప్పటినుండి ఆ సినిమాను ప్రమోట్ చేయడానికి ఓం రౌత్, ప్రభాస్, కృతి సనన్ మరియు మొత్తం టీమ్ అల్ ఇండియా టూర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రభాస్ ఆదిపురుష్ తరువాత కెజిఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే మూవీ చేస్తున్నారు. ఇది 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ ప్రాజెక్ట్ పై ప్రేక్షకులు ఎనో ఆశలు పెట్టుకున్నారు. (Adipurush Motion Teaser) నాగశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే సినిమా చేస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సినిమా అశ్విని దత్ తన సొంత బ్యానర్ పై నిర్మిస్తున్నారు.