Prabhas fans are worrying about his health: వరసగా నాలుగు పాన్ ఇండియా సినిమాలు చేసి, సినిమా ఇండస్ట్రీ లో ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్న ప్రభాస్ అంటే సినీ అభిమానులు అందరికీ ఇష్టమే. సాధారణంగా సినిమా ఇండస్ట్రీ లో హీరోల అభిమానుల ధోరణి ఇంచుమించుగా ఒకేలా ఉంటాది. కానీ ప్రభాస్ విషయంలో అలా కాదు, అన్ని హీరోల ఫాన్స్ కూడా ప్రభాస్ కి ఏమి అంత వ్యతిరేకంగా ఉండరు. ప్రభాస్ ఫాన్స్ తో పాటు ఇతర హీరోల ఫాన్స్ కూడా ప్రభాస్ సినిమాలు బాగానే చూస్తారు. సినిమా బాగుంటే చాలు ప్రభాస్ సినిమాని అన్ని వయసుల వారు బాగానే ఆదరిస్తారు. బాహుబలి సినిమాతో ప్రభాస్ అంటే ఒక హైప్ క్రియేట్ అయ్యింది. దానిని అలా క్యారీ చెయ్యడం చాలా కష్టం. అయినా కూడా ప్రభాస్(Prabhas fans are worrying about his health మాత్రం ఆ హైప్ ని జాగ్రత్తగా క్యారీ చేస్తూ వస్తున్నాడు.
ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ తో కూడా చాలా బిజిగా ఉంటున్నాడు. ఆది పురుష్, సలార్,స్పిరిట్,రాజా డీలక్స్.. సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఆది పురుష్ సినిమా షూటింగ్ పూర్తి కావస్తుంది. ఇవన్నీ కూడా పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ మద్యకాలంలో ప్రభాస్ అనారోగ్యంతో బాధ పడుతున్నాడని వార్తలు వచ్చాయి. విపరీతమైన జ్వరంతో ప్రభాస్ బాధపడటం వలన కొన్ని రోజులు షూటింగ్స్ కూడా వెళ్లలేకపోయాడని వార్తలు వచ్చాయి. ఆ టైంలో ప్రభాస్ ని అనుష్క దగ్గర ఉండి మరీ చూసుకుందని ప్రచారాలు కూడా బాగా వినిపించాయి. ప్రభాస్ విషయంలో ఎలాంటి న్యూస్ గాని, గాసిప్ గాని రాయాలంటే అందులో ఎక్కడో ఒక చోట అనుష్కకి సంబంధం ఉన్నా, లేకున్నా ఆమెని మాత్రం తీసుకుని వస్తారు.
మరి ప్రభాస్ అనుష్కల జోడి, స్నేహం, బంధం అలాంటిది అభిమానుల అభిప్రాయం. అయితే ప్రభాస్ అనారోగ్యం విషయంలో ఆయన అభినాలు చాలా టెంక్షన్ తీసుకుంటున్నారు. అసలు ప్రభాస్ అంతగా సిక్ అవ్వడానికి కారణం ఏమయ్యి ఉంటాదని అభిమానులు ఆలోచించడం మొదలు పెట్టారు. ఇదిలా ఉండగా ఇటీవల ప్రభాస్ ఒక చిన్న బడ్జెట్ సినిమా ప్రమోషన్ కి వెళ్లాల్సి వచ్చింది. సాధారణంగా ప్రతీ సినిమాకి ప్రమోషన్ అనేది చాలా అవసరం. అయితే చిన్న చిన్న సినిమాలకు పెద్ద హీరోలతో, డైరెక్టర్స్ తో సినిమా ప్రమోషన్ చేయిస్తూ ఉంటారు. దాని వలన ఆ సినిమా పై మీడియా మరియు ఫాన్స్ ఫోకస్ పెరుగుతాది.
ప్రభాస్ ఇటీవల సాచి అనే ఒక చిన్న సినిమా ప్రమోషన్ కి వస్తానని మాట ఇచ్చాడంట. మాటంటే ఇచ్చాడు కానీ ప్రభాస్ వస్తాడా రాడా అనే అనుమానం అయితే ఎవ్వరికైనా ఉండాల్సిన పరిస్థితే. ఎందుకంటే ప్రభాస్ ఎలాంటి పెద్ద ప్రాజెక్ట్స్ తో ఎంత బిజీ గా ఉన్నాడో అందరికీ తెలుసు. అయితే వాళ్ళని ఆశ్చర్యపరిచేలా ఎవ్వరూ రాకముందే ఉదయం 5 గంటలకి ప్రమోషన్ కోసం ప్రభాస్ వచ్చి కూర్చున్నాడంట. ఇంత డెడికేషన్ వలనే ప్రభాస్ ఆరోగ్యం పాడయిపోతుందని అభిమానులు అనుకుంటున్నారు. అసలు వాళ్ళ హీరో కొన్ని రోజులు పాటు సినిమాలకు దూరంగా ఉంటె బాగుణ్ణు, ఆరోగ్యం కుదుట పడతాడని అభిమానులు అనుకుంటున్నారు. ప్రభాస్ సినిమాలకు దూరంగా ఉండాలని కోరుకుంటున్న ప్రభాస్ అభిమానులను చూసి అందరూ షాక్ అవుతున్నారు. అంటే వారి అభిమానం అంత గట్టిగా ఉంది.