Prabhas : సినిమా రంగంలో ఒక్కొక్కసారి బ్లాక్ బస్టర్ హిట్స్ వస్తాయి. ఒక్కోసారి వరుసగా ఫ్లాప్స్ కూడా వస్తాయి. దాన్ని బట్టి ఏ హీరోకి ఎంత నటన వచ్చు.. ఏ దర్శకుడికి ఎలాంటి ట్యాలెంట్ ఉంది అనేది.. పూర్తిగా సక్సెస్ ఫెయిల్యూర్ ని బట్టి ఎవరిని వెంటనే కించపరి చేయకూడదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ( Prabhas fans and Vivek Agnihotri ) మారిన ప్రభాస్ అప్పటినుంచి రిలీజ్ అయిన మూడు సినిమాలు కూడా పెద్ద హిట్స్ సాధించలేకపోయాయి. అలా అని ప్రభాస్ కి ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అయితే ఇటీవల ఒక దర్శకుడు ప్రభాస్ మీద, దర్శకుల మీద అతను చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి మాట్లాడిన మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
ఆదిపురుష్ సినిమా పెద్దగా ప్రేక్షకులని ఆకట్టుకోకపోయినా కూడా.. ప్రభాస్ నెక్స్ట్ సినిమా సలార్, ప్రశాంత నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా టీజర్ రిలీజ్ అయిన సంగతి మన అందరికి తెలిసిందే. ఆ సినిమా 500 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తుండగా.. సెప్టెంబర్ 28న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా టీజర్ విపరీతమైన ( Prabhas fans and Vivek Agnihotri ) పాజిటివ్ రెస్పాన్స్ తీసుకుంది. ఈ సినిమా టీజర్ రిలీజ్ అవ్వగానే డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ట్విట్టర్ లో కామెంట్ చేశారు. హీరో దర్శకుల పేర్లు ఎత్తకుండా.. ఆయన చేసిన కామెంట్స్ చాలా దారుణంగానే ఉన్నాయి. టీజర్‌ను లౌడ్ సౌండ్‌తో కూడిన నాన్సెన్స్ యాక్షన్.. ఎవరూ హింసని కోరుకుని పుట్టరు. ఇండస్ట్రీ పెద్దలు యువతను శాంతివైపు ప్రేరేపించేలా నడుచుకోవాలి. కానీ సినిమాల్లో, రాజకీయాల్లో హింసని ఒక ఫ్యాషన్ గా మార్చేస్తున్నారు.
ఇలాంటి హింసాత్మక ప్రపంచంలో సృజనాత్మక స్పృహ మాత్రమే పరిష్కారం. ప్రస్తుతం సినిమాల్లో మితిమీరిన హింసని ప్రమోట్ చేయడం, అర్థం లేని చెత్త సినిమాలను తీసి ప్రమోట్ చేయడం కూడా టాలెంట్ గా పరిగణిస్తున్నారు. అసలు నటనే రాని వ్యక్తిని బిగ్గెస్ట్ స్టార్ గా ప్రమోట్ చేయడాన్ని అతిపెద్ద టాలెంట్ గా పరిగణిస్తున్నారు.` అని ఇతను ట్వీట్ చేసాడు. సలార్ టీజర్ రిలీజ్ అవ్వగానే ఇతను ఇ లాంటి ట్వీట్ చేయడం వెనక.. కావాలనే ( Prabhas fans and Vivek Agnihotri ) సలార్ టీజర్ ని, ప్రభాస్ ని అవమానించాలని అలా చెప్పారని అందరూ మండిపడుతున్నారు. ప్రభాస్ కి నటనే రాదు అనడం అభిమానులకు అస్సలు నచ్చలేదు. నటనే రాని హీరో అయితే పాన్ ఇండియా స్టార్ గా భారతదేశానికి, యావత్ ప్రపంచానికి ప్రభాస్ ని వెలుగెత్తి చూపించిన రాజమౌళి లాంటి దర్శకుడు..
ఎన్నుకొని మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా ప్రభాస్ తో తీసారు అంటే ప్రభాస్లో నటన ప్రతిభను చూసే కదా అతను సెలెక్ట్ చేసుకున్నారు. అంటే ఇతను ఒక ప్రభాస్ నే కాదు.. ప్రభాస్ ని, సలార్ సినిమా తీస్తున్న దర్శకుడు పాశాంత్ నీల్ ని, ప్రభాసు లాంటి హీరోని ప్రమోట్ చేసిన రాజమౌళిని కూడా అవమానించాడని అందరూ భావిస్తున్నారు. దేనితో ప్రభాస్ అభిమానులు.. గతంలో ఈ డైరెక్టర్ తీసిన హేట్ స్టోరీ లాంటి వివాదాస్పద మూవీస్ ప్రబాస్ ఫాన్స్ టార్గెట్ చేస్తూ వివిధ కామెంట్స్ పెడుతున్నారు. అంతే కాకుండా అత్యంత వివాదాస్పద మతఘర్షణల నేపథ్యంలో తీసిన కాశ్మీరీ పైల్స్ ని కూడా టార్గెట్ చేస్తున్నారు.. అదేంటో పెద్ద పెద్ద వాళ్లు కూడ వార్తల్లో వ్యక్తులు అవడం కోసం, పబ్లిసిటీ కోసం అవసరం లేని చోట కూడ ఏదో రకమైన మాటలు మాట్లాడి మీడియా లో ఉండాలని ఆరాట పడుతున్నారు.