Home Cinema Prabhas Surgery : ఆ సర్జరీ చేయించుకుంటున్న ప్రభాస్ ఇలా ఈ పనికి కొంతకాలం దూరమేనట..

Prabhas Surgery : ఆ సర్జరీ చేయించుకుంటున్న ప్రభాస్ ఇలా ఈ పనికి కొంతకాలం దూరమేనట..

prabhas-did-that-surgery-and-he-should-be-away-from-that-work-for-one-month

Prabhas Surgery : ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి తెచ్చుకున్న మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే ఇప్పుడు ఎంత క్రేజ్ ఉందో.. యావత్ ప్రపంచంలో ఎందరో అభిమానులు పెరిగారన్న సంగతి కూడా మనకు తెలిసిందే. బాహుబలి ( Prabhas did that Surgery ) సినిమాతో అంత క్రేజ్ ని సంపాదించుకున్న ప్రభాస్ ఆ తర్వాత సినిమాల్లో దానిని నిలబెట్టుకునేందుకు, ఇంకా పెంచుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అయితే దురదృష్టకరం ఏమిటంటే.. ప్రభాస్ ఏ సినిమా నటించినా కూడా బాహుబలి తో పోల్చుకోవడం వలన ఇప్పటివరకు చేసిన మూడు సినిమాల్లో కూడా బ్లాక్ బస్టర్ హిట్ ని సాధించలేకపోయాయి. దీనితో ప్రభాస్ అభిమానులు చాలా బాధగా ఉన్నారు.

See also  Pawan Kalyan : ఎవ్వరూ ఊహించని శుభవార్త చెప్పిన పవన్ కళ్యాణ్

Prabhas-did-that-sugery

అయితే ఏ సినిమా ఫ్లాప్ అయినా.. యావరేజ్ అయినా కూడా ప్రభాస్ పై ఎటువంటి క్రేజ్ తగ్గలేదు. ఎందుకంటే ప్రభాస్ బాహుబలి తో ఎక్కడికో వెళ్లిపోయాడు. అతని మీద ఉన్న ఇష్టం పోవడం చాలా కష్టం. అయితే ప్రభాస్ బాహుబలి ( Prabhas did that Surgery ) సినిమాలో విపరీతంగా యాక్షన్ రిలేటెడ్ షూటింగ్ చేయడం వలన మోకాళ్ల నొప్పులు మొదలయ్యాయి. కానీ ప్రభాస్ వాటిని పట్టించుకోకుండా రాజమౌళి ఎలా చెక్కితే అలా చెక్కించుకుంటూ.. అలాగే మసులుకొని.. అలాగే కష్టపడి ఆ సినిమాలో నటించడం వల్లే.. అంత మంచి ఔట్పుట్ వచ్చిందన్న విషయం అందరికీ తెలిసిందే.

See also  Sai Dharam Tej: పెళ్ళయిన ఆ స్టార్ హీరోయిన్ నా క్రష్ అంటూ తెలిపిన సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్..

Prabhas-surgery-away-work

అలాగే బాహుబలి సినిమా తర్వాత కూడా ప్రభాస్ తన మోకాళ్ల నొప్పుని పెద్దగా పట్టించుకోలేదు. ఇటీవల కాలంలో మోకాళ్ళ నొప్పి ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ బాధతోనే ఆదిపురుష్ సినిమా సలార్ సినిమా షూటింగ్లో పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత ( Prabhas did that Surgery ) మొదలైన ప్రాజెక్ట్ కల్కి 2898 ఎడి సినిమా షూటింగ్ మొదలైన తర్వాత ప్రభాస్ కి మోకాళ్ళ నొప్పి విపరీతంగా ఎక్కువైందంట. ఇక ఆ బాధను భరించలేక ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని గట్టిగా డిసైడ్ అయ్యి డాక్టర్లను సంప్రదించాడంట.

Prabhas- surgery -away-work-news

దానితో డాక్టర్లు ఆ మోకాళ్ళకు సర్జరీ చేయాలని చెప్పారంట. ఆ సర్జరీ చేయించుకోవడం కోసమే ప్రభాస్ యూరప్ వెళ్లి అక్కడ సర్జరీ చేయించుకున్నాడు అంట. సర్జరీ చాలా బాగా సక్సెస్ అయిందంట. అంతా బాగానే ఉంది అక్కడ 15 రోజులు రెస్ట్ తీసుకొని వచ్చి మళ్ళీ షూటింగ్లో పాల్గొందామని ప్రభాస్ అనుకున్నాడు అంట. కానీ డాక్టర్లు మాత్రం కనీసం నెలరోజుల పాటు రెస్ట్ ఉండాలని ఆ తర్వాత వెళ్ళమని చెప్పారంట. డాక్టర్లు చెప్పిన సలహా మేరకు ప్రభాస్ సర్జరీ సక్సెస్ అయింది గానీ.. పాపం సినిమా పనికి, సినిమా షూటింగులకి, తన ఇష్టమైన సినిమా తల్లికి దూరంగా నెల రోజులు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. దీని తర్వాత వచ్చి మిగిలిన సినిమాలు షూటింగులు కంటిన్యూ చేస్తాడంట.