Prabhas – Pawan Kalyan : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మన టాలీవుడ్ హీరోలు ఈ మధ్యకాలంలో చాలా పెద్ద పెద్ద ఘనవిజయాన్ని వాళ్ళ ఖాతాలో వేసుకుని.. వాళ్ళ పేరు ప్రఖ్యాతల్ని పెంచుకోవడమే కాకుండా.. తెలుగు సినిమా ( Prabhas and Pawan Kalyan ) ఇండస్ట్రీని కూడా అంచలంచలాగా ముందుకు తీసుకుని వెళ్తున్నారు. ఇలాంటి తరుణంలో కొన్ని సినిమాలకి నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి. రాజమౌళి లాంటి దర్శకుడు తెలుగు ఇండస్ట్రీ నుంచి ప్రభాస్ ని హీరోగా పాన్ ఇండియా సినిమా మొదటిసారిగా తీసి.. తెలుగు సినిమా ఖ్యాతిని భారతదేశం మొత్తం గర్వంగా చెప్పుకునేలా చేసిన గొప్ప దర్శకుడు. బాహుబలి, బాహుబలి 2 సినిమాలు సినిమా ఇండస్ట్రీ గర్వించదగ్గ సినిమాలని గట్టిగా చెప్పుకోవచ్చు. అలాంటి సక్సెస్ ని అందించిన రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే..
పాపం ప్రభాస్ కి రాజు బాహుబలి సినిమా తర్వాత వచ్చిన రెండు సినిమాలు కూడా డిజాస్టర్ గా మిగిలాయి. తర్వాత ఆదిపురుష్ సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అయింది. ఎందుకంటే రామాయణం మీద వస్తున్న ఈ సినిమా ( Prabhas and Pawan Kalyan ) భారతదేశం మొత్తం అందరూ చూస్తారని.. రాముడిగా ప్రభాస్ కి నటించే అవకాశం దొరకడం ఎంతో అదృష్టమని.. పైగా ప్రభాస్ వేషధారణ పర్సనాలిటీ అన్నీ కూడా రాముడిగా ఎంతో చక్కగా సూట్ అవుతుందని.. అది చూడాలని అందరూ ఎంతో ఆత్రం పడ్డారు కానీ.. దురదృష్టం ఏమిటంటే ఈ సినిమాకు విపరీతమైన నెగిటివ్ కామెంట్స్ రావడంతో.. సినిమా స్టార్టింగ్ భారీగా కలెక్షన్ రోజురోజుకీ తగ్గిపోతూ వస్తుంది.
అయితే ప్రభాస్ సంగతి ఇలా ఉంటే.. ప్రభాస్, పవన్ కళ్యాణ్ కి అనుకోకుండా ఒక కనెక్షన్ ఏర్పడింది. ఆ కనెక్షన్ పవన్ కళ్యాణ్ తో ఎందుకు పడిందా అని అభిమానులు బాధపడుతున్నారు. ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే.. ప్రభాస్ సినిమాని తెలుగులో రిలీజ్ చేసిన వాళ్లే.. పవన్ కళ్యాణ్, సాయి ధర్మ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా ( Prabhas and Pawan Kalyan ) నిర్మాతలు. అయితే పీపుల్స్ మీడియా వారు ఆదిపురుష్ సినిమాని చాలా హై బడ్జెట్ తో కొని.. డిస్ట్రిబ్యూటర్లకు చాలా హై బడ్జెట్లో అమ్ముకున్నారు. అయితే ఆదిపురుష్ సినిమా స్టార్టింగ్ రెండు మూడు రోజులు బానే కలెక్షన్ వచ్చినా కూడా.. నెగిటివ్ కామెంట్స్ విపరీతంగా ఎక్కువ రావడం వల్ల అక్కడి నుంచి కలెక్షన్స్ చాలా భారీగా తగ్గుతూ కూడా వచ్చాయి.
ఈ కారణంగా డిస్ట్రిబ్యూటర్లకు చాలా నష్టపోయే అవకాశం ఉంది. అందువలన ఇప్పుడు నెక్స్ట్ రాబోయే పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ సినిమా బ్రో జూలైలో ఆడియన్స్ ముందుకు రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాని సముద్రఖని దర్శకత్వంలో రూపొందించారు. ఈ సినిమాపై పవన్ కళ్యాణ్ అభిమానులకి భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు పీపుల్స్ మీడియా వాళ్ళని ఆదిపురుష్ సినిమాలో నష్టపోయినందుకు గాను.. డిస్ట్రిబ్యూటర్లందరూ వాళ్ళని బ్రో సినిమాని తక్కువ ప్రైజ్ కి డిమాండ్ చేస్తున్నారు. ఆ సినిమాను తెలుగులో రిలీజ్ చేసిన వాళ్లు.. ఈ సినిమా నిర్మాతలు పీపుల్స్ మీడియా వాళ్ళు ఒక్కరే వవ్వడం వల్ల ఈ విపరీత పరిస్థితి వచ్చింది. ఇలా ప్రభాస్ పవన్ కళ్యాణ్ కి అనుకోకుండా కనెక్షన్ ఏర్పడింది.