
Bro Trailer Review : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ధర్మతేజ్ హీరోలుగా నటించిన బ్రో సినిమాపై మెగా అభిమానులు ఎన్నో అంచనాలతో ఎదురు చూస్తున్నారు. ఈరోజు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కాబోతుంది. ఈ ట్రైలర్ ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఘనంగా విడుదల చేసేందుకు వైజాగ్ లో జగదాంబ థియేటర్, హైదరాబాదులో దేవి థియేటర్ ఎంచుకున్నారు. ఈ రెండు థియేటర్ల దగ్గర సరిగ్గా ఆరు గంటల మూడు నిమిషాలకు ఈ ( Bro Movie Trailer Review ) ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. ఎంతో మంది ఎన్నో అంచనాలతో ఎదురుచూస్తున్న ఈ సినిమాకి దర్శకుడు సముద్రఖని కాగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ రీమేక్ కథకు మార్పులు చేర్పులు చేశాడు. మరి ఇంతకీ ఎదురుచూస్తున్న బ్రో సినిమా ట్రైలర్ ఎలా ఉందో చూద్దామా..
అందరి మధ్య ఎంతో వైభవంగా ట్రైలర్ బ్రో ట్రైలర్ రిలీజ్ అయింది. భస్మాసురుడు అనేవాడు ఒకడు ఉండేవాడు మీకు తెలుసా? మనుషులందరూ అలాంటి వారే.. ఎవరి తల మీద చెయ్యి వాడే పెట్టుకుంటాడు ఇంకెవరికి ( Bro Movie Trailer Review ) అవకాశం ఇవ్వరు అని పవన్ కళ్యాణ్ వాయిస్ తో వచ్చిన డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత సాయిధర్మతేజ్ టైం తో పోరాడుతున్నట్టు స్పీడుగా పరుగులు పెడుతూ పనులు చేసుకుంటున్నట్టు తిరుగుతున్నట్టు చూపించాడు. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంటు అయినట్టు చూపిస్తాడు. ఆ తర్వాత సాయిధర్మ తేజ్ మరి నువ్వు అని అనగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంట్రీ కనిపిస్తుంది. ఎంట్రీ చాలా బాగా తీశారు. టైం ఎప్పుడు లేదు అంటావు కదా అదే నేను అని పవన్ కళ్యాణ్ చెబుతాడు.
అలాగే ట్రైలర్ లో బ్రహ్మానందం మీ బస్సు ఎప్పుడు రెడీ గా ఉంటాది.. ఎప్పుడు ఎవడు కనిపిస్తాడా, ఎక్కించుకుని తీసుకుపోదాం అని చూస్తావు అనే డైలాగ్ ఉంది. బహుశా అది ఆ దేవుడిని అంటాడు అనుకుంటా.. పవన్ కళ్యాణ్ సాయిధర్మతేజ్ తో కంగ్రాట్స్ బ్రో.. అందరూ టైం లో ముందుకు వెళ్తారు నువ్వు ఒక్కడివే టైం వెనక్కి వెళ్తావు వెళ్తున్నావు అని అంటాడు. అలాగే సాయిధరమ్ తేజ్ చచ్చి బతికాడన్నమాట.. అనవసరంగా ( Bro Movie Trailer Review ) నేను బతికి చచ్చాను అనే డైలాగ్ సినిమా మొత్తం కథ ని చెప్తుంది. సాయిధర్మతేజ్ చనిపోయి కాలం వెనక్కి వెళ్లి మళ్లీ తాను చనిపోయే టైం దగ్గరికి వస్తుండగా వాళ్ళ కుటుంబంలో సెంటిమెంట్ ని బాగా చిత్రీకరించడానికి ట్రై చేశారన్న విషయం ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అలాగే ఇందులో పవన్ కళ్యాణ్ మీరు వేస్తున్న స్టెప్పులు ఏంటి అంటూ తకిట తకిట అంటూ పవన్ కళ్యాణ్ వేసిన డాన్స్ అభిమానులకు మంచి ఊపునిచ్చింది. సాయిధర్మతేజ్ చి వెధవ జీవితం అని అనగానే పవన్ కళ్యాణ్ అందుకే చంపేశా అనడంతో ట్రైలర్ పూర్తయింది.
ట్రైలర్ చూడ్డానికి బానే ఉంది అనిపించింది చాలా గొప్పగా ఊహించనిదేదో చూసినట్టుగా మాత్రం అనిపించలేదు. ఎందుకంటే ఈ సినిమా కథ మూలమే దేవుడు అవతారంలో పవన్ కళ్యాణ్ వస్తాడని.. సాయి ధరమ్ తేజ్ కి హెల్ప్ చేయడానికి వస్తాడని.. ముందు నుంచి తెలుసు. అదే మాదిరిగా ట్రైలర్ కొనసాగింది కాకపోతే.. ఇప్పుడు ట్రైలర్లో తేజ్ చనిపోయి మళ్లీ బ్రతికి చనిపోయే సీన్ వరకు ఏం జరుగుతుంది అనేది చూపించి.. చివరిలో తేజ్ బ్రతికే ఉంటాడా అనే ఒక చిన్న సస్పెన్షన్ ఉంచి ట్రైలర్ ని ముగించేశారు. అయితే సినిమాలో ( Bro Movie Trailer Review ) డైలాగ్స్ ఐతే కొన్ని హీట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే.. మాటలు మాంత్రికుడు సహాయం ఉంది అంటే అందులో మాటలు కచ్చితంగా హిట్ అవుతాయని గెస్ చేయవచ్చు. అలాగే సినిమా ఎంటర్టైన్మెంట్ పరంగా బాగుంటుందని అనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తన తరహా కనిపించే విధంగా డాన్సులు డైలాగులు కామెడీ అన్ని చూపించినట్టుగా కనిపిస్తుంది. ట్రైలర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు అయితే మాత్రం పిచ్చిగా నచ్చేసింది. మొత్తం మీద ఈ సినిమా వాళ్ళ అంచనాలను ఎంతవరకు రీచ్ అవుతది అనేది సినిమా చూసిన తర్వాత తెలుసుకోవాలి..