తమిళ చిత్ర పరిశ్రమ తీవ్రమైన శోకసంద్రం లో మునిగిపోయింది. ప్రముఖ నిర్మాత, ఎంతోమందికి శ్రేయోభిలాషిగా పిలవబడే ఢిల్లీ బాబు(Dilli Babu) మృతి చెందాడు. గత కొంత కాలంగా ఆయన తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ప్రముఖ హీరోలు, దర్శకులు కూడా ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. అందరితో చక్కగా నవ్వుతూ మాట్లాడిన ఆయనని చూసి కచ్చితంగా కోలుకుంటాడు , మళ్ళీ సినిమాలను నిర్మిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ గత రెండు రోజులు క్రితం ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది.
కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ని హాస్పిటల్ కి తరలించి చికిత్స అందించారు. కానీ ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోయింది. అలా చికిత్స పొందుతూనే నిన్న ఉదయం కన్ను మూసారు. దీంతో తమిళ సినిమా ఇండస్ట్రీ ఒక్కసారిగా శోకసంద్రం లో మునిగిపోయింది. ఢిల్లీ బాబు(Dilli Babu) యాక్సెస్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ లో అనేక బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను నిర్మించాడు. రాక్షసన్, ఓ మై గాడ్ఎం బ్యాచిలర్ వంటి సూపర్ హిట్ సినిమాలు ఈయన బ్యానర్ నుండి వచ్చిన సినిమాలే.
వీటిలో రాక్షసన్ చిత్రం ఎంత పెద్ద సూపర్ హిట్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తమిళం లో సంచలన విజయం సాధించిన ఈ సినిమాని తెలుగు లో బెల్లం కొండా శ్రీనివాస్ రాక్షసుడు అనే పేరు తో రీమేక్ చేసాడు. వరుస ఫ్లాప్స్ లో ఉన్న బెల్లంకొండ ని ఈ చిత్రం మళ్ళీ హిట్ ట్రాక్ లోకి తీసుకొచ్చింది. ఇదే సినిమాని హిందీ లో అక్షయ్ కుమార్ రీమేక్ చేసాడు. డైరెక్ట్ గా థియేటర్స్ లో కాకుండా, ఓటీటీ లో విడుదలైన ఈ సినిమాకి అక్కడి ఆడియన్స్ దగ్గర మంచి రెస్పాన్స్ వచ్చింది.
అలా వరుసగా ఇన్ని భాషల్లో రీమేక్ అయ్యే సత్తా ఉన్న సినిమా తీసాడు ఢిల్లీ బాబు. వీటితో పాటు ఆయన నిర్మించిన మిరల్, మరతకమని చిత్రాలు తెలుగులో కూడా దబ్ అయ్యాయి. మరతకమని సినిమాలో ఆది పినిశెట్టి హీరో గా నటించాడు. ‘సరైనోడు’ చిత్రం లో విలన్ గా నటించి ప్రేక్షకుల్లో బాగా పాపులర్ అయినా ఆదిపిన్నీ శెట్టి నుండి వచ్చిన చిత్రం కావడం తో తెలుగు లో కూడా ఈ సినిమా యావరేజి గా ఆడింది. తెలుగు లో కూడా ఆయన పలువురు యంగ్ హీరోలతో సినిమాలు చేయడానికి ఎంతో అమితాసక్తిని చూపించారు. కానీ చివరికి ఇలా ప్రాణాలు కోల్పోవడం అందరిని శోకం లోకి నెట్టేసింది.