Home Cinema Poonam Kaur : బ్రో వివాదం పై పూనమ్ కౌర్.. దాని వెనుక అసలు సీక్రెట్...

Poonam Kaur : బ్రో వివాదం పై పూనమ్ కౌర్.. దాని వెనుక అసలు సీక్రెట్ అదే..

poonam-kaur-latest-tweet-about-the-movie-bro-became-viral

Poonam Kaur : సినిమా రంగంలో హీరోయిన్స్ ఎవరు ఎలా సక్సెస్ అవుతారు అనేది ఎవ్వరం చెప్పలేం. చాలా అందంగా, గ్లామర్గా ఉన్న హీరోయిన్స్ కూడా ఒక్కొక్కసారి సక్సెస్ ని చూడలేరు. స్టార్ హీరోయిన్స్ గా ఒక వెలుగు వెలగలేరు. కొందరు హీరోయిన్స్ చాలా సామాన్యంగా, సహజంగా నటించే వాళ్ళు స్టార్ హీరోయిన్స్ గా ఒక వెలుగు వెలుగుతారు. అలాగే ( Poonam Kaur latest tweet ) టాలీవుడ్లో అందానికి అందం, అభినయం ముందు కూడా సక్సెస్ అవ్వలేని హీరోయిన్గా మిగిలిన హీరోయిన్ పూనమ్ కౌర్. ఈమె ఇంతవరకు కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఎక్కడా కూడా ఆమె స్టార్ హీరోయిన్గా నిలబడగలిగే పరిస్థితి కనిపించలేదు.

poonam-kaur-latest-tweet-about-the-movie-bro-became-viral

అయితే సినిమాల్లో స్టార్ అయినా అవ్వకపోయినా కూడా.. ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఎప్పుడు దగ్గరగా ఉంటుంది. అంతేకాకుండా ఈమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కౌంటర్లు ఇస్తూ ఉంటుంది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ లపై ఏదో ఒక కౌంటర్ ఇస్తూ ఉంటాది. కొందరు దీనికి పాజిటివ్గా రియాక్ట్ అయితే.. మరికొందరు ( Poonam Kaur latest tweet ) నెగిటివ్గా రియాక్ట్ అవుతారు. దేనికైనా కౌంటర్ అనేదానికి రిజల్ట్ అనేది సహజంగా అలాగే ఉంటాది. ఎందుకంటే.. ఆ పక్షంలో ఆలోచించే వాళ్ళందరూ ఆ కౌంటర్ అవునంటారు.. ప్రతిపక్షంలో ఉన్న వాళ్లంతా కౌంటర్లో ఏ సత్తా లేదు అంటారు. ఇలా ఆమె కొనసాగుతున్న క్రమంలో ఇప్పుడు మరొక కౌంటర్ పెట్టింది.

See also  Adipurush Movie First Review : ఆశ్చర్యపోయేలా హిట్టో ఫట్టో చెప్పేసిన ఆదిపురుష్ ఫస్ట్ రివ్యూ !

poonam-kaur-latest-tweet-about-the-movie-bro-became-viral

పూనమ్ కౌర్ వేసిన కౌంటర్ చూసి అందరూ ఎవరికి వారు దాని మీనింగ్ ని వెతుక్కుంటూ ఉన్నారు. పూనం కౌర్ ఇలా మెసేజ్ చేసింది. ఈ మధ్యకాలంలో రాజకీయాలనేవి ఎంతో వినోదాత్మకంగా మారాయి.. ఎంటర్టైన్మెంట్ అనేది ఏమో సీరియస్గా మారిపోయింది. అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ చూసిన వాళ్ళందరూ ఆలోచించడం మొదలుపెట్టారు. పూనమ్ ఎవరికి కౌంటర్ వేసి ఉంటుంది అని అనుకుంటున్నారు. ఆలోచించగా ఆమె ఎవరు ( Poonam Kaur latest tweet ) మీద కౌంటర్ వేసింది అనేది అర్థమవుతుంది. దానిపై విపరీతంగా ఎవరు కామెంట్లు వాళ్ళు చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఇంతకీ పూనమ్ కౌర్.. బ్రో సినిమా గురించి కౌంటర్ వేసిందని అంటున్నారు. దీనికి కారణమైతే లేకపోలేదు అసలు సంగతేమిటంటే.. జూలై 28వ తేదీ రిలీజ్ అయిన బ్రో సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.

See also  Prabhas - Anushka: బాహుబలి లో అనుష్క డూప్ తో ప్రభాస్ ఆపని చేసాడట.. ఇంతకీ ఆమె ఎవరంటే..

poonam-kaur-latest-tweet-about-the-movie-bro-became-viral

అయితే ఈ సినిమాలో అంబటి రాంబాబు గురించి సంబంధించిన ఒక డాన్స్ ని కావాలనే పెట్టి.. అతన్ని అవమానించారని కొందరు అంటే.. అలాగే రాంబాబు కూడా మీటింగ్ పెట్టి.. పవన్ కళ్యాణ్ మీద కూడా డిఫరెంట్ పేర్లు పెట్టి సినిమాలు తీస్తామని.. అతని పర్సనల్ లైఫ్ మీద తీస్తామని.. ముఖ్యంగా ఆ పేర్లు అతను చెప్పినవన్నీ కూడా పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లకు రిలేటెడ్ అయ్యి ఉన్నాయి. ఇలా ఒకరితో ఒకరు కౌంటర్లు వేసుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో పూనమ్ కౌర్ పెట్టిన ఈ ట్వీట్ మీనింగ్ కావాలనే పవన్ కళ్యాణ్ ని త్రివిక్రమ్ ని పాయింట్ అవుట్ చేస్తూ.. రాజకీయాల్లోకి వచ్చేసరికి వీళ్ళ వ్యవహారం వినోదాత్మకంగా ఉంటే.. వినోదంలో సీరియస్గా పొలిటికల్ రిలేటెడ్ పెడుతున్నారని కామెంట్ చేసిందని కొందరు అంటున్నారు. అయితే దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు పూనమ్ ని వ్యతిరేకిస్తుంటే.. పవన్ కళ్యాణ్ వ్యతిరేకులు పూనమ్ ని సమర్థిస్తున్నారు. ఇంతకీ ఆమె దేనికి ట్విట్ చేసింది అనేది ఆమె చెప్తేనే కరెక్ట్ గా ఉంటుందని మామూలు నెటిజనులు అంటున్నారు.