
Payal Rajput : ఎప్పుడెప్పుడు ఎవరెవరికి ఎలాంటి డిజాస్టర్స్, హిట్స్ వస్తాయో చెప్పలేం. ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయినే గా ఒక వెలుగు వెలిగేసిన హీరోయిన్ పాయల్ రాజపుత్.. ఆ సినిమా సక్సెస్ ( Payal Rajput posted one video ) చూసి అందరూ కూడా ఇక ఈ హీరోయిన్ కి తిరుగు లేదని అనుకున్నారు. అలాగే ఆమెకు అనేక అవకాశాలు కూడా రావడం జరిగింది. కానీ ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా ఒక మంచి సక్సెస్ అనేది ఆమె ఖాతాలో వేసుకోలేకపోయింది. దానితో ఆమె స్టార్ హీరోయిన్ కాదు కదా.. కనీసం ఒక సాధారణమైన హీరోయిన్గా కూడా పెద్ద స్థానాన్ని సంపాదించుకోలేకపోయింది.
కానీ పాయల్ రాజ్ పుత్ స్టార్ హీరోయిన్ కాకపోయినప్పటికీ.. ఆమెపై ఆర్ఎక్స్ 100 తో వచ్చిన ఒక క్రేజ్ మాత్రం ఇప్పటికీ పోలేదనే అనుకోవాలి. సరైన కథతో సరిగ్గా తీస్తే ఆమె తన నటనా ప్రతిభ చూపించగలరని ఎందరికో నమ్మకం. అందరికంటే ముఖ్యంగా ఆమెను ఆర్ఎక్స్ 100లో అంత బాగా చూపించిన దర్శకుడు అజయ్ భూపతికి ( Payal Rajput posted one video ) గట్టి నమ్మకం అన్న విషయం మంగళవారం సినిమా చూస్తే అర్థమవుతుంది. ఆర్ఎక్స్ 100 తో క్రేజీ కాంబినేషన్ గా, సక్సెస్ఫుల్ కాంబినేషన్ గా పేరు సంపాదించుకున్న వీళ్ళిద్దరూ మళ్లీ.. మంగళవారం సినిమాతో ప్రజల ముందుకు వచ్చారు. అజయ్ భూపతి ఎంతో కష్టపడి ఎలా అయినా బ్లాక్ బస్టర్ కొట్టాలని ఆలోచనతో కష్టపడి తీసిన సినిమా ఇదని అతను చెప్పుకుంటూనే వచ్చాడు.
ఈ సినిమా షూటింగ్ తీసే టైంలో కూడా అనేక కష్టాలను ఎదుర్కొన్నామని, చాలా న్యాచురల్ గా సినిమా తీయాలని ఆలోచనతో ఎంతో అద్భుతంగా తీశామని చెప్పుకుంటూ వచ్చాడు దర్శకుడు అజయ్ భూపతి. ఇక ఈ సినిమాలో నటించిన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్.. ఇటువంటి పాత్రను చేయడానికి అందరు హీరోయిన్లు ఒప్పుకోరని.. కేవలం ఆమె ( Payal Rajput posted one video ) ఎంతో ధైర్యంగా సినిమాల మీద ఉన్న ఇష్టంతో.. ఆమె పాత్రను ఆమె గౌరవించి చేసిన పాత్ర ఇదని.. నిజంగా చాలా అద్భుతంగా చేసిందని దర్శకుడు ముందుగానే చెప్పాడు. చెప్పినట్టుగానే పాయల్ రాజ్ పుత్ ఈ సినిమాలో చాలా బాగా నటించిందని, ఆమె నటనా ప్రతిభని చూపించిందని అనేక రివ్యూస్ లో రాయడం జరిగింది.
అయితే ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఇది వీకెండ్ కాబట్టి సండే వరకు బాగానే ఉంటాయి. పైగా ఈ సినిమాకి పెద్ద కాంపిటేషన్ కూడా లేదు. పెద్ద సినిమాలేవి పడలేదు. మరి దాన్ని బట్టి సోమవారం నుంచి ఎలా ఉంటుందో చూడాలి. ఇదిలా ఉంటే సినిమా చూసి వచ్చిన పాయల్ రాజ్ పుత్ తన అనుభవాన్ని వీడియో చేసి ట్విట్టర్లో పోస్ట్ చేసింది. నేను ఎప్పుడూ ఇలాంటి వీడియోలు చేయలేదు. కానీ ఈరోజు చేయాలనిపించింది అంటూ మొదలు పెట్టింది. మంగళవారం సినిమా అభిమానులతో కలిసి కూర్చొని చూశానని.. ఇప్పుడే చూసి వచ్చాను చాలా బాగా వచ్చిందని.. ఇలాంటి పాత్రలు తనకి ఇంకా ఇంకా దొరికితే చెయ్యాలని ఉందని.. మంచి పాత్ర దొరికితే ఎప్పుడూ తాను వెనకాడనని.. తనకి ఇంత ప్రోత్సాహాన్ని ఇచ్చిన అభిమానులకు ఎంతో ధన్యవాదాలు అంటూ ఆమె వీడియోని రిలీజ్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.