Payal Rajput: టాలీవుడ్ లో గడిచిన కొద్దీ సంవత్సరాల నుండి ఇండస్ట్రీ లోకి పరిచయమైనా కొత్త హీరోయిన్స్ లో యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న బ్యూటీ పాయల్ రాజ్ పుత్. అజయ్ భూపతి దర్శకత్వం లో తెరకెక్కిన RX100 అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైన పాయల్. ఆ సినిమా పెద్ద హిట్ అయినా తర్వాత ఈమెకి అవకాశాలు బాగానే వచ్చాయి. అయితే తొలిసినిమాలోనే నెగటివ్ రోల్ చెయ్యడం తో ఈమె పై ఆడియన్స్ లో అదే ముద్ర పడిపోయింది. దర్శకులు కూడా ఈమెకి అదే తరహా బోల్డ్ పాత్రలు ఇస్తూ ఉండడం తో ఈమెకి స్టార్ హీరోలు ఇప్పటి వరకు అవకాశాలు ఇవ్వడం లేదు.
దీనితో అందం మరియు అభినయం ఉన్నప్పటికీ కూడా కేవలం మీడియం రేంజ్ హీరోయిన్ గానే మిగిలిపోయింది పాయల్ రాజ్ పుత్(Payal Rajput). ఇక రీసెంట్ గా ఈమె ప్రధాన పాత్రలో ‘మాయ పేటిక’ అనే చిత్రం విడుదలైంది. ఈ సినిమా ఎప్పుడు వచ్చింది అనేది కూడా చాలా మందికి తెలియదు. అయితే ఈ సినిమా ప్రొమోషన్స్ లో పాల్గొన్నప్పుడు ఈమె తన కెరీర్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ ‘నేను ఏదైనా సినిమా ఒప్పుకున్నాను అంటే నా పాత్రకు న్యాయం చెయ్యడం కోసం 200 శాతం కష్టపడుతాను. కానీ కొంతమంది దర్శకులు దానిని అలుసుగా తీసుకున్నారు.
RX 100 చిత్రం విడుదలై సూపర్ హిట్ సాధించిన తర్వాత నాకు ఇండస్ట్రీ లో చాలా అవకాశాలు వచ్చాయి. అప్పుడే ఇండస్ట్రీ కి వచ్చిన హీరోయిన్ ని కాబట్టి, కథల ఎంపిక విషయం లో నాకు అంతగా మెచ్యూరిటీ లేదు. కొంతమంది దర్శకులు చెప్పింది గుడ్డిగా నమ్మి, ఆ సినిమాలను ఒప్పుకొని చేశాను. వారి అవసరాల కోసం నన్ను బాగా వాడుకొని వదిలేసారు. ఆ సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్స్ అయ్యాయి. అందుకే నా రేంజ్ కి తగ్గ కెరీర్ ని నేను చూడలేకపోయాను’ అంటూ చెప్పుకొచ్చింది పాయల్ రాజ్ పుత్. ఆమె మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
ఇకపోతే పాయల్ రాజ్ పుత్ RX 100 తర్వాత వెంకీ మామ, డిస్కో రాజా, 3 రోజెస్ , అనగనగ ఓ అతిధి, RDX లవ్ వంటి చిత్రాలలో హీరోయిన్ గా నటించింది. పాయల్ నటించిన సినిమా మాయ ఏటికా నిన్న విడుదలైంది. సినిమా కు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఆమె అజయ్ భూపతి దర్శకత్వం లో ‘మంగళవారం’ అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రం చేస్తుంది. ఈ సినిమా మీదనే ఆమె బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. చూదాం కనీసం ఆ సినిమాతో అయినా పాయల్ మంచి హిట్ కొట్టి గుర్తింపు తెచుకుంటుందేమో.