Home Cinema Pawan Kalyan: మా వదిన చేసిన ద్రోహానికి ఇప్పుడు నేను ఇలా అయ్యనంటూ పవన్ కళ్యాణ్...

Pawan Kalyan: మా వదిన చేసిన ద్రోహానికి ఇప్పుడు నేను ఇలా అయ్యనంటూ పవన్ కళ్యాణ్ సంచలనమైన కామెంట్స్..

Pawan Kalyan Comments: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కాంబోలో విడుదలబోతున్న తాజా చిత్రం బ్రోధి అవుతారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతో ఘనంగా హైదరాబాద్ లోని శిల్పకళ వేదికలో నిర్వహించడం జరిగింది. కాగా ఈ కార్యక్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ గురించి కొన్ని సంచలమైన కామెంట్స్ ను చేశాడు. ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి. మరి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో ఇప్పుడు మనం చూద్దాం..

pawan-kalyans-sensational-comments-saying-that-i-have-become-like-this-because-of-megastar-chiranjeevi-wife

బ్రో చిత్రం చాలా రోజులు చేయాల్సిన చిత్రం. కానీ నేను ఓ పక్క రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నందు వల్ల త్వర త్వరగా పూర్తి చేసాము. అయితే నాకు సినిమాలలో నటించడం అన్న సమాజ సేవ అన్న చాలా ఇష్టం. అసలు మీ అందరికీ తెలియని విషయం నేనేదో నా పాటికి ఓ చిన్న వ్యవసాయం చేసుకుంటూ నా జీవితాన్ని కొనసాగించాలనుకున్నాను. కానీ అనుకోని పరిస్థితుల్లో సడన్ గా సినిమాల్లోకి నన్ను లాక్కొచ్చారు. ఇప్పటికీ నా దృష్టిలో హీరో అంటే కేవలం మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే అయితే నందమూరి తారక రామారావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారు సూపర్ స్టార్ కృష్ణ గారు వంటి మహానుభావులు కూడా పెద్ద నటులే అయినప్పటికీ నా దృష్టి లో మాత్రం నా హీరో మెగాస్టార్ చిరంజీవి గారే..

See also  Pawan Kalyan : పవన్ కళ్యాణ్ తో పెట్టుకుని పాపం చివరికి ఏమౌతాడో..

pawan-kalyans-sensational-comments-saying-that-i-have-become-like-this-because-of-megastar-chiranjeevi-wife

మా కుటుంబం చాలా మధ్య తరగతి కుటుంబానికి చెందింది. మేమందరం కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే అసలు ఏదో వచ్చిన జాబ్ చేస్తూ వ్యవసాయం చేసుకుంటూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని నేను నా జీవితాన్ని కొనసాగించాలి అనుకున్నాను. కానీ మా వదిన గారే నన్ను సినిమాల్లోకి తీసుకువచ్చారు. అలా నేను హీరో అయ్యాక సుస్వాగతం చిత్రం సమయంలో ఓ సాంగ్ చేయాల్సి ఉంది. ఇక ఆ సాంగ్ కోసం నేను బస్సు పైన డ్యాన్స్ చేస్తున్నాను. కాగా అప్పుడు నాకెందుకు చాలా ఇబ్బందికరంగా ఫీల్ అయ్యాను వెంటనే నేను మా వదినకు ఫోన్ చేసి ఎందుకు వదిన నన్ను ఈ సినిమాల్లోకి నెట్టేసావు అని అడిగాను.

See also  Hero Surya: మీకు తెలుసా.? ఆ అమ్మాయిని జ్యోతిక కంటే ముందే సూర్య ప్రేమించాదట.!!

pawan-kalyans-sensational-comments-saying-that-i-have-become-like-this-because-of-megastar-chiranjeevi-wife

నా పాటికి నేను ఏదో వచ్చిన జాబ్ చేస్తూ వ్యవసాయం చేస్తూ ఇంటి దగ్గరే ఉండే వాడిని కదా ఇప్పుడు ఇలా అందరి ముందు డాన్స్ చేయాలంటే నాకు ఏదోలా చాలా ఇబ్బందికరంగా ఉంది అని నేను వదిన గారితో చెప్పాను. అంతే కాదు అసలు మా వదిన చేసిన ద్రోహానికే ప్రస్తుతం నేను మీ అందరి ముందు ఇలా స్టార్ గా నిలుచున్నాను అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంచలమైన వ్యాఖ్యలు చేశాడు. దాంతో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan Comments) మాట్లాడిన ఈ మాటలు బట్టి చూస్తుంటే ఆయన హీరో అవ్వడానికి ప్రధానమైన కారణం మెగాస్టార్ చిరంజీవి గారి భార్య సురేఖ గారని మనందరికీ అర్థమవుతుంది.