
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఇప్పటికి మూడు పెళ్లిళ్లు జరిగిన విషయం మనందరికీ తెలిసినదే. పవన్ కళ్యాణ్ మొదటి పెళ్లి ఆయిన కుటుంబ సభ్యుల ఇష్ట ప్రకారం, వాళ్ళ సెలెక్ట్ చేసిన అమ్మాయిని ( Pawan Kalyan’s first wife’s ) పెళ్లి చేసుకోవడం జరిగింది. మొదటి భార్య పేరు నందిని రెడ్డి కాగా.. 1997లో నందిని రెడ్డిని పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో వైభవంగా పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత 2007లో పవన్ కళ్యాణ్ నందిని రెడ్డికి విడాకులు ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ నందిని రెడ్డి వైవాహిక జీవితంలో ఎదురైన సమస్యలేమిటో బయటకు రాలేదు కానీ ఏవో కొన్ని కారణాల వలన ఇద్దరు విడిపోయారని మాత్రం తెలుసు.
2007లో నందిని రెడ్డికి విడాకులు ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఒక ఏడాదిలోనే 2008లో రేణు దేశాయ్ ని వివాహం చేసుకున్నారు. అంతకంటే ముందే పవన్ కళ్యాణ్ రేణుదేశాయ్ ప్రేమలో పడడం, వాళ్లిద్దరూ కొంతకాలం ( Pawan Kalyan’s first wife’s ) సహజీవనం చేయడం జరిగింది. 2008లో రేణుదేశాయ్ ని వివాహం చేసుకున్న పవన్ కళ్యాణ్ నాలుగేళ్లలోనే ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యి.. 2012లో రేణు దేశాయ్ కి విడాకులు ఇచ్చారు. రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ తో విడిపోయినప్పటికీ.. సినీ అభిమానులకు మాత్రం చాలా దగ్గరగా ఉంటూ.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన గురించి తన పిల్లలు ఇద్దరు గురించి సంబంధించిన డీటెయిల్స్ ని అభిమానంతో సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటూ ఉంటాది.
అందువలన పవన్ కళ్యాణ్ అనగానే అందరికీ వెంటనే గుర్తుకు వచ్చే ఫిమేల్ అంటే రేణు దేశాయ్ అని చెప్పుకోవాలి. రేణు దేశాయ్ కి విడాకులు ఇచ్చిన పవన్ కళ్యాణ్ రష్యన్ అమ్మాయి అయిన.. అన్నా లెజినా తో మూడో పెళ్లి ( Pawan Kalyan’s first wife’s ) చేసుకోవడం జరిగింది. అయితే మూడో భార్య విశేషాలు కూడా ఎప్పటికప్పుడు ఏదో రూపంలో ప్రచారంలోకి వస్తూ ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని రెడ్డి విడాకుల తర్వాత ఆమె ఏం చేస్తుంది? ఎక్కడుంది ఎలా బ్రతుకుతుంది అనే విషయాలు పెద్దగా ఎప్పుడు ప్రచారంలోకి రాలేదు.
అయితే ఇటీవల ఆమె గురించి కొంత సమాచారం బయటకు వచ్చింది. నందినీ రెడ్డి పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్న తరవాత ఆమె పేరు జాహ్నవిగా మార్చుకున్నారని.. 2010లో డాక్టర్ కృష్ణారెడ్డిని పెళ్లి చేసుకొన్నారని.. ఆ తరవాత ఈ జంట అమెరికాలో సెటిల్ అయ్యి, ఎంతో ఆనందంగా బ్రతుకుతున్నారని అని వార్తలు వస్తున్నాయి. అలాగే రెండవ పెళ్లి తరవాత ఇప్పుడు ఆమె ఆస్థి 250 కోట్ల రూపాయలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అంటే ఆమె అంత పెద్ద సంబంధం చేసుకుని.. అన్ని కోట్ల ఆస్తికి అధిపతిగా హాయిగా బ్రతుకున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన ఇటు సినిమాలు, అటు రాజకీయాలలో ఎంతో బిజీగా ఉన్నారు.