Home Cinema Pawan Kalyan: షాకింగ్.. పవన్ కళ్యాణ్ ఆ జబ్బు కారణంగా సూసైడ్ చేసుకోవాలనుకున్నాడా!

Pawan Kalyan: షాకింగ్.. పవన్ కళ్యాణ్ ఆ జబ్బు కారణంగా సూసైడ్ చేసుకోవాలనుకున్నాడా!

మెగాస్టార్ చిరంజీవి ముద్దుల తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎలాంటి క్రేజ్ ఉందొ చెప్పుకోవలసిన పని లేదు. చిరంజీవి తమ్ముడిగా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంటర్ అయినప్పటికీ, తరవాత ఆయనకంటూ ఒక అద్భుతమైన క్రేజ్ ని క్రియేట్ చేసుకున్నారు. ప్రతీ హీరోకి అభిమానులు ఉంటె,పవన్ కళ్యాణ్ కి మాత్రం భక్తులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ కోసం ఆయన భక్తులు ఎలాంటి భక్తి చూపిస్తారో అందరికీ తెలుసు.

పవన్ కళ్యాణ్ ప్రవర్తన సామాన్యులతో పోలిస్తే, కొంచెం డిఫరెంట్ గానే ఉంటాది. ఆయన కొన్ని రోజులు చాలా యాక్టీవ్ గా, స్పీడ్ గా ఉంటారు. మరికొన్ని రోజులు చాలా సైలెంట్ గా ఎవ్వరి జోలికి వెళ్లకుండా ఉండిపోతారు. ఇదేమిటి ఈఆయన మైండ్ సెట్ అని చాలామంది అనుకుంటారు. అసలు పవన్ కళ్యాణ్ జీవితంలో చాలా ముఖ్యమైన విషయాలను ఇటీవల బాలకృష్ణ ప్రోగ్రాం అన్ స్టాపబుల్ కి వచ్చినప్పుడు పవన్ చెప్పారు.

See also  Prabhas Adipurush: అంచనాలు పెంచుతున్న ప్రభాస్ ఆదిపురుష్ మోషన్ టీజర్.. నయా అప్డేట్ తో టీమ్..

పవన్ కళ్యాణ్ పదిహేడేళ్ల వయసులో మానసికంగా జబ్బు పడి, స్కూల్ కి వెళ్లబుద్ది వేసేది కాదంట. ఎవ్వరితోని మాట్లాడేవారు కారంట. ఒంటరిగా ఉంటూ.. మానసిక ఒత్తిడి తట్టుకోలేక సూసైడ్ చేసుకోవాలనిపించేదంట. అది కనిపెట్టిన చిరంజీవి భార్య సురేఖ మరియు నాగబాబు పవన్ ని చిరు దగ్గరకి తీసుకుని వెళ్లగ.. నువ్వు చదువుకోకపోయినా పరవాలేదు కానీ బ్రతికి ఉండు అని చెప్పారంట. అప్పటి నుంచి ధైర్యం వచ్చి, నిమ్మగా ఆరోగ్యం కుదుట పడిందంట.

See also  EXTRA ordinary man : నితిన్ సినిమా టైటిల్ వెనుక అసలు రియాలిటీ ఇదేనట!

ఈ విషయం విన్న పవన్ ఫాన్స్, వాళ్ళ దేవుడుకి 17 ఏళ్ల వయసులో కదా అలా జరిగిందని, తేలిగ్గా తీసుకోలేరు. వాళ్ళ దేవుడికి అలాంటి జబ్బు మళ్ళీ రాకూడని, నిజమైన దేవుళ్ళకి పూజలు చేస్తూ, దండం పెట్టుకుంటున్నారు.