Home Cinema Ustaad bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ లేటెస్ట్ అప్డేట్ తో నిరుత్సాహంతో పవన్ అభిమానులు..

Ustaad bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ లేటెస్ట్ అప్డేట్ తో నిరుత్సాహంతో పవన్ అభిమానులు..

pawan-kalyan-movie-ustaad-bhagat-singh-latest-update

Ustaad bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. అలాంటి వీళ్లిద్దరి కాంబినేషన్ ఇన్నాళ్ల తర్వాత మళ్లీ సినిమా ( Ustaad bhagat Singh ) రాబోతుంది. పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై పవన్ కళ్యాణ్ అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే.. గబ్బర్ సింగ్ సినిమా ఎంత పెద్ద సెన్సేషన్ హిట్ క్రియేట్ చేసిందో చవిచూశారు కాబట్టి.. అందుకే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందా.. ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Usthad-Bhagath-Sing

అయితే పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఇటు సినిమా రంగం వైపు, అటు రాజకీయాల వైపు రెండిటి మీద రెండు కాళ్లు వేసి నడుస్తూనే ఉన్నారు. రెండిటికి సమాన న్యాయం చేయాలని ఆరాటపడుతూనే ఉన్నారు. అయినా కూడా ఏదో ఒకదానికి ( Ustaad bhagat Singh ) ఆటంకం అనేది తప్పడం లేదు. రాజకీయాల్లో తిరిగేటప్పుడు సినిమా షూటింగ్ లు ఆగిపోతున్నాయి. సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు రాజకీయాల్లో అనేక మీటింగ్ లలో పాలుపంచుకోవడం కుదరడం లేదు. ఇలా పవన్ కళ్యాణ్ ఒక్కడే రెండు చోట్ల బ్యాలెన్స్ చేసుకోవడం కష్టంగా ఉన్నప్పటికీ.. ఆయన అభిమానుల అభిమానం పుణ్యమా అని సాధ్యమైనంత వరకు రెండిటిని అలా నడుపుకుంటూ వస్తున్నారు.

See also  Venuswamy - Sreeleela : ఆ విషయంలో శ్రీలీలను కూడా ఆ హీరోయిన్ పరిస్థితుల్లో చూడక తప్పదంటున్న వేణుస్వామి..

Pawan-Kalyan-Usthad

ఇటీవల పవన్ కళ్యాణ్ సినిమా బ్రో సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా ఆశించినంత సంతృప్తిని ఇవ్వలేకపోయింది. ఆ సినిమా కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన్ని అన్ని రకాల హిట్ సాంగ్స్ తో.. ఆయన్ని మళ్లీ ఒక జోష్లో చూడ్డానికి పనికొచ్చింది తప్పా.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వలేకపోయింది. అయితే ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ మీద ( Ustaad bhagat Singh ) మాత్రం భారీ అంచనాలు ఉన్నాయి కానీ.. పవన్ కళ్యాణ్ రాజకీయాలపై వెళ్ళినప్పుడు ఈ సినిమా షూటింగ్ ఎప్పటికప్పుడు ఆగిపోతుంది. ఇటీవల చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళిన పుణ్యమా అని పవన్ కళ్యాణ్ మళ్లీ షూటింగ్ ఆపుకొని దానికోసం పోరాటంలో తిరగడం జరిగింది. మళ్లీ షూటింగ్ మొదలు పెడుతున్నారని వార్తలు అయితే వస్తున్నాయి. అయితే ఈ సినిమా అప్డేట్స్ గురించి అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తూ ఉన్నారు.

See also  Priyamani: నేను ముస్లిం ను పెళ్ళి చేసుకుని చాలా తప్పు చేసానంటూ ప్రియమణి సంచలన వాఖ్యలు.

Gautami- Pawan-Kalyan

ఇదిలా ఉంటే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ సోషల్ మీడియాలో హల్ చల్ అవుతుంది. అదేంటంటే.. ఈ సినిమాలో గౌతమి కూడా నటిస్తుందట. గౌతమి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి తల్లి పాత్రలో చేస్తుందంట. ఒకప్పుడు మంచి హీరోయిన్గా అనేక మంచి మంచి సినిమాలు తెలుగులో చేసి మంచి పేరు సంపాదించుకున్న గౌతమి.. ఆ తర్వాత సినిమాలకు దూరంగానే ఉన్నారు. ఇటీవల ఆమె మళ్లీ సినిమాలకు దగ్గరవుతూ అన్ని మంచి శకుణములే, శాకుంతలం వంటి సినిమాల్లో నటించడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్లీ పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో.. పవన్ కళ్యాణ్ కి తల్లిగా ఆమె నటిస్తున్నారని అంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ తల్లి పాత్రలో గౌతమి అంటే అభిమానులకు పెద్దగా ఆనందించేలా లేదు. పవన్ కళ్యాణ్ తల్లి పాత్రలో పెడితే బాగా పవర్ ఫుల్ లేడని పెట్టాలి లేదా నార్మల్గా ఎవరో ఒకరిని పెట్టేయాలి కానీ గౌతమి అంటే ఎందుకో సెట్ అయినట్టు అనిపించలేదు.. ఏమో హరీష్ శంకర్ ఈ తల్లి కొడుకుల బంధాన్ని ఎంత బాగా చూపించగలుగుతాడో ఎవరికీ తెలుసు? ఏ పాత్రలోనైనా నటీనటులని చూపించే దర్శకుడిలో ఉన్న గొప్పతనాన్ని బట్టి దాని రిజల్ట్ ఉంటాది అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.